India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: దుబాయ్ వెళ్లేందుకు యత్నించిన వైసీపీ నేత దేవినేని అవినాశ్‌కు పోలీసులు అనుమతి నిరాకరించారు. నిన్న రాత్రి ఆయన దుబాయ్ వెళ్లేందుకు హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అయితే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయనపై FIR నమోదైందని, ప్రయాణానికి అనుమతి ఇవ్వొద్దని మంగళగిరి పోలీసులు విమానాశ్రయ అధికారులకు సూచించారు. అనుమతి నిరాకరించడంతో ఆయన వెనుదిరిగారు.
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ బర్త్ డే సందర్భంగా ‘దేవర’ నుంచి అప్డేట్ రాబోతోంది. ఈరోజు సాయంత్రం 4.05 గంటలకు ‘భైర’కు సంబంధించిన గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ హీరోహీరోయిన్‌గా నటిస్తుండగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ‘దేవర’ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు.
కొన్ని నెలలుగా ఆగిపోయిన హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ ఈ నెల 14 నుంచి పునః ప్రారంభమైనట్లు మేకర్స్ వెల్లడించారు. స్టంట్ మాస్టర్ శివ ఆధ్వర్యంలో 400-500 మంది ఫైటర్స్, జూనియర్ ఆర్టిస్టులతో భారీ యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నట్లు తెలిపారు. మరికొన్ని రోజుల్లోనే పవన్ కళ్యాణ్ షూటింగ్‌లో పాల్గొంటారని, ఎప్పుడూ చూడని కొత్త గెటప్‌లో అలరిస్తారని పేర్కొన్నారు. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటన మరువక ముందే మరో వైద్యురాలికి చేదు అనుభవం ఎదురైంది. బర్ద్వాన్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ ఘటనపై సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు పోలీసులు అడ్రెస్ తెలుసుకొని తన ఇంటికి వచ్చినట్లు ఆమె తెలిపారు. రాత్రిపూట పోలీసులు ఇంటికి రావడంతో తన తల్లి భయాందోళనకు గురైందని, పోస్ట్ డిలీట్ చేయాలని వారు బెదిరించినట్లు చెప్పారు. దీనిపై తీవ్ర విమర్శలొస్తున్నాయి.
క్యాబ్ సర్వీసులు ఇష్టానుసారం రేట్లు పెంచి ప్రయాణికులను దోచుకోవడం సర్వసాధారణమైంది. ఈ వ్యవహారంపై ఓ నెటిజన్ చేసిన పోస్టు వైరలవుతోంది. ‘ఓలా, ఉబర్, ర్యాపిడో తదితర సంస్థలు తక్కువ ధరతో సర్వీస్ అందిస్తామని చెబుతుంటాయి. అయితే కొన్ని వర్షపు చినుకులు రాలగానే 300% అధికంగా డిమాండ్ చేస్తాయి. ఢిల్లీలో 1.8KMల దూరానికి కారు సర్వీసుకు ఏకంగా రూ.699 రేటు చూపుతోంది’ అని అతను రాసుకొచ్చారు.
మీకూ ఇలాంటి సమస్య ఎదురైందా?
RGకర్ ఆస్పత్రి విధ్వంసం కేసులో 19 మందిని అరెస్టు చేశామని కోల్‌కతా పోలీసులు Xలో ప్రకటించారు. వీరిలో ఐదుగురిని సోషల్ మీడియా ఫీడ్‌బ్యాక్ ద్వారా గుర్తించామన్నారు. తాము ఇంతకు ముందు చేసిన పోస్టుల్లో ఇంకెవరినైనా గుర్తిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజల మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆస్పత్రి బారికేడ్లపై నిలబడ్డ కొందర్ని సర్కిల్ చేసి ఫొటోలు, వీడియోలను పోలీసులు సోషల్ మీడియాలో పెట్టిన సంగతి తెలిసిందే.
TG: స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు పూర్తయినా ఓ మహిళ ఇప్పటికీ ఒంటరిగా ప్రయాణించలేకపోతోంది. నిన్న సాయంత్రం HYDలోని JBS మెట్రో స్టేషన్ వద్ద 23 ఏళ్ల యువతిని ఓ వ్యక్తి వేధింపులకు గురిచేశాడు. JBS బస్‌స్టాండ్ వైపు వెళ్లేదారిలో వరద చేరడంతో మరోవైపు నుంచి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి ఆమె వెంటపడి తప్పుగా ప్రవర్తించాడు. ఆమె గట్టిగా అరవడంతో అతడు పారిపోయాడు. కాగా మారేడ్‌పల్లి పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు.
నాగార్జునసాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. 590 అడుగుల నీటి మట్టంతో నిండు కుండను తలపిస్తోంది. అధికారులు 4 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 79,528 క్యూసెక్కులుగా ఉంది. సాగర్ పూర్తి నిల్వ సామర్థ్యం 312.5టీఎంసీలు కాగా ప్రస్తుతం అంతే మొత్తంలో నిల్వ ఉంది.
రానున్న రెండు గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, ఆదిలాబాద్ జిల్లాల్లో మోస్తరు వాన పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. గంటకు 40కి.మీ మేర ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది.
AP: సీఎం చంద్రబాబుతో టాటా గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ భేటీ అయ్యారు. అలాగే పరిశ్రమల సమాఖ్య ప్రతినిధులు కూడా సీఎంతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో చేపట్టనున్న నూతన పారిశ్రామిక విధానంపై సీఐఐ ప్రతినిధులతో సీఎం చర్చించారు.
Sorry, no posts matched your criteria.