news

News February 3, 2025

రేపు ఢిల్లీకి మంత్రి నారా లోకేశ్

image

AP: మంత్రి నారా లోకేశ్ రేపు సా.4.30 గంటలకు ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సా.5.45 గంటలకు భేటీ కానున్నారు. రాష్ట్రానికి రైల్వే బడ్జెట్‌లో కేటాయింపులపై ధన్యవాదాలు తెలపడంతో పాటు పలు అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. రాత్రి 9 గంటలకు తిరిగి లోకేశ్ విజయవాడ బయల్దేరనున్నారు. రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి రూ.9,417 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే.

News February 3, 2025

మత మార్పిడులపై సంచలన బిల్లు

image

మతమార్పిడులపై సంచలన బిల్లును రాజస్థాన్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆ బిల్లు ప్రకారం మత మార్పిడి చేసుకోవాలని నిర్ణయించుకున్నవారు దాదాపు 2 నెలల ముందు కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సొంతంగా నిర్ణయం తీసుకున్నామని, ఎవరి బలవంతం లేదని తెలిపితేనే అనుమతి లభిస్తుంది. ఎస్సీలు, తెగలు, మహిళలు, మైనర్లను బలవంతంగా మత మార్పిడులకు ప్రోత్సహిస్తే 2-10 ఏళ్ల జైలు శిక్ష, రూ.25వేల జరిమానా ఉంటుంది.

News February 3, 2025

ఎక్స్‌లెంట్ ఇన్నింగ్స్.. థాంక్యూ సాహా: BCCI

image

వృద్ధిమాన్ సాహా ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన సేవలను కొనియాడుతూ BCCI పోస్టర్ విడుదల చేసింది. సాహాది అద్భుతమైన కెరీర్, ఎక్స్‌లెంట్ ఇన్నింగ్స్ అని పేర్కొంది. భారత జట్టుకు అందించిన సేవలకు థాంక్స్ చెప్పింది. భవిష్యత్తు మంచిగా సాగాలని కోరుకుంటున్నట్లు విష్ చేసింది. సాహా 28ఏళ్ల పాటు స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ తదితర లెవెల్స్‌లో క్రికెట్ ఆడారు.

News February 3, 2025

‘తీన్మార్ మల్లన్న ఏ పార్టీ?’

image

TG: కాంగ్రెస్ MLC నవీన్ కుమార్(తీన్మార్ మల్లన్న) ఇటీవల చేసిన వ్యాఖ్యలు జనాల్లో గందరగోళానికి తెరలేపాయి. ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. దీనిపై పార్టీ ఇప్పటికీ స్పందించకపోవడం ఏంటని జనాలు చర్చించుకుంటున్నారు. అధికారపార్టీ నేతగా ఉండి సొంత పార్టీపైనే విమర్శలు చేయడం ఏంటని విస్తు పోతున్నారు. దీంతో ఆయన ఏ పార్టీ నేత అని పలువురు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

News February 3, 2025

రాహుల్ వ్యాఖ్యలు అవాస్తవం: జయశంకర్

image

లోక్‌సభలో రాహుల్ చేసిన వ్యాఖ్యలు దేశ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని విదేశాంగమంత్రి జయశంకర్ ఫైరయ్యారు. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ప్రధానిని ఆహ్వానించామని కోరడానికి తాను అమెరికాకు వెళ్లాననడం పూర్తిగా అబద్ధం అన్నారు. విదేశాంగ కార్యదర్శిని కలవటానికే అక్కడికి వెళ్లానని స్పష్టం చేశారు. ఎంతో ప్రతిష్ఠ కలిగిన మోదీ లాంటి నాయకుడిపై ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేయటం సరికాదని తన X ఖాతాలో పోస్ట్ చేశారు.

News February 3, 2025

తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్

image

TG: ఎమ్మెల్సీ నవీన్ కుమార్(<<15344708>>తీన్మార్ మల్లన్న<<>>)పై భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఫైరయ్యారు. మల్లన్న స్థాయి మరిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. డబ్బులు ఖర్చు పెట్టి నల్గొండలో ఆయనను గెలిపించినట్లు తెలిపారు. ఓ వర్గాన్ని టార్గెట్ చేసి ఆయన మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. పార్టీ ఆయనపై చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

News February 3, 2025

సోషల్ మీడియాలో ఏపీ, తెలంగాణ ఫుడ్ వార్

image

సోషల్ మీడియాలో అభిమాన తారల గురించి వార్స్ చాలానే చూస్తున్నాం. తాజాగా Xలో కొందరు ఫుడ్ వార్‌కు తెరలేపారు. ఆంధ్ర, తెలంగాణ ఫుడ్‌లలో ఏది గొప్ప అంటూ చర్చ ప్రారంభించారు. కొందరు తమ ఫుడ్ గొప్ప అంటే తమ ఫుడ్ గొప్ప అని పోస్టులు చేస్తున్నారు. అయితే ఇలాంటి విషయాలపై కాకుండా ఏదైనా సమాజానికి మేలు చేసే అంశాలపై చర్చించాలని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

News February 3, 2025

కోర్టును ఆశ్రయించిన ఐశ్వర్యరాయ్ కూతురు

image

ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్య బచ్చన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన ఆరోగ్యంపై కొన్ని వెబ్‌సైట్లలోని తప్పుడు కథనాలను తొలగించేలా ఆదేశించాలని ఆమె కోర్టును కోరారు. దీనిపై కోర్టు గూగుల్‌కు నోటీసులు జారీ చేసింది. గతంలోనూ ఇదే విషయమై ఆమె కోర్టును ఆశ్రయించగా గూగుల్, యూట్యూబ్‌తో పాటు ఇతర ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌లకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

News February 3, 2025

స్వదేశంలో దుమ్మురేపుతోన్న భారత టీమ్

image

సొంత గడ్డపై మ్యాచ్ అనగానే టీమ్ఇండియా ప్లేయర్లకు పూనకాలొస్తున్నాయి. ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో టీమ్ఇండియా 4-1తో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇలా 2019 నుంచి ఇప్పటివరకు టీమ్ఇండియా సొంత గడ్డపై 17 టీ20 సిరీస్‌లు కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా జట్టు వారి సొంత గడ్డపై 2006-10 వరకు ఎనిమిది సార్లు, 2007-2010 వరకు సౌతాఫ్రికా 7 సార్లు, 2008-12 వరకు న్యూజిలాండ్ ఆరు సార్లు తమ గడ్డపై విజయాలు సాధించాయి.

News February 3, 2025

ప్రభుత్వానికి అంబులెన్సులు ఇచ్చిన సోనూసూద్

image

AP: రాష్ట్ర ప్రభుత్వానికి సినీనటుడు సోనూసూద్ 4 అంబులెన్సులు ఇచ్చారు. ఇవాళ వెలగపూడిలోని సచివాలయానికి వెళ్లిన ఆయన సీఎం చంద్రబాబును కలిసి వాటిని అందజేశారు. సోనూసూద్ ఫౌండేషన్ తరఫున ఇచ్చిన ఆ అంబులెన్సులను ప్రారంభించిన సీఎం ఆయన్ను అభినందించారు. కరోనా సమయం నుంచి అవసరం ఉన్నవారికి సాయం చేస్తూ సోనూసూద్ మంచి మనసు చాటుకుంటున్నారు.