news

News August 14, 2024

ఏసీబీ కోర్టులో జోగి రాజీవ్ బెయిల్ పిటిషన్

image

AP: అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అరెస్టైన మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు రాజీవ్ ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. నిన్న రమేశ్ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు అనంతరం రాజీవ్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. ఆయనకు కోర్టు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.

News August 14, 2024

సుప్రీం తీర్పుతో ఈ షేర్లు ఢమాల్

image

<<13849728>>రాయల్టీ బకాయిలను<<>> రాష్ట్రాలు వసూలు చేసుకోవచ్చన్న సుప్రీంకోర్టు తీర్పుతో మైనింగ్, మెటల్ కంపెనీల షేర్లు కుదేలయ్యాయి. టాటా స్టీల్, NMDC, వేదాంత, హిందుస్థాన్ జింక్, కోల్ ఇండియా షేర్లు ఇంట్రాడేలో 5% మేర పతనమయ్యాయి. కొన్ని షేర్లు 3% నష్టాల్లో, మరికొన్ని ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఈ తీర్పుతో కేవలం PSUలే రూ.70వేల కోట్ల మేర చెల్లించాల్సి వస్తుందని అంచనా. మెటల్, సిమెంట్ కంపెనీల పైనా ప్రభావం ఉండనుంది.

News August 14, 2024

మరో కొత్త రూల్.. ఖాతాదారులకు అదిరిపోయే న్యూస్

image

ఎమర్జెన్సీ పరిస్థితుల్లో తమ డిపాజిట్లను NBFCల డిపాజిటర్లు వెనక్కి తీసుకోవచ్చని RBI వెల్లడించింది. ఆమోదించిన 3 నెలల్లోపు, అత్యవసర కారణాలతో విత్‌డ్రాకు విజ్ఞప్తి చేస్తే వడ్డీ లేకుండా 100% డిపాజిట్ ఇవ్వాలంది. అత్యవసరం కానప్పుడు డిపాజిట్ మొత్తంలో సగాన్ని వడ్డీ లేకుండా చెల్లించాలంది. అసలులో సగం లేదా రూ.5లక్షలు, ఈ రెండింటిలో ఏది తక్కువైతే ఆ మొత్తం చెల్లిస్తారు. జనవరి 1 నుంచి ఈ రూల్ అమల్లోకి రానుంది.

News August 14, 2024

కేజ్రీవాల్‌కు చుక్కెదురు

image

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి సీబీఐ కేసులో ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఈ నెల 23న తదుపరి విచారణ చేపడతామని వెల్లడించింది. ఈలోగా కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వడంపై సీబీఐ అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం ఆదేశించింది.

News August 14, 2024

ఎలాన్ మస్క్, జేకే రౌలింగ్‌పైనా ఖెలీఫ్ కేసు

image

అల్జీరియా వివాదాస్పద బాక్సర్ ఖెలీఫ్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ గెలిచిన సంగతి తెలిసిందే. అనంతరం తనను నెట్టింట విమర్శించిన వారందరిపై ఆమె ఫ్రాన్స్‌లో దావా వేశారు. వారిలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్, ‘హ్యారీపోటర్’ రచయిత్రి జేకే రౌలింగ్ కూడా ఉన్నారు. ఇటలీ బాక్సర్ ఓడిపోయిన సమయంలో ఖెలీఫ్‌ను విమర్శిస్తూ ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు మస్క్ మద్దతునిచ్చారు. అటు రౌలింగ్ సైతం ఖెలీఫ్ మగాడంటూ ట్వీట్ వేశారు.

News August 14, 2024

గనుల రాష్ట్రాలకు ఘన విజయం.. రాయల్టీ వసూలుకు సుప్రీం అనుమతి

image

మైనింగ్ కంపెనీల నుంచి రాయల్టీ బకాయిలను రాష్ట్రాలు వసూలు చేసుకోవచ్చని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. 2005 ఏప్రిల్ 1 తర్వాత బకాయిలను 12 ఏళ్ల వ్యవధిలో వసూలు చేసుకోవాలని, చెల్లింపులపై జరిమానాలు విధించొద్దని ఆదేశించింది. PSUలపై రూ.70వేల కోట్లు, ప్రజలపై భారం పడుతుందని దీనిని కేంద్రం వ్యతిరేకిస్తోంది. గనుల భూమిపై రాయల్టీ అధికారం రాష్ట్రాలదేనని జులై 25న సుప్రీం కోర్టు 8:1 తేడాతో తీర్పునిచ్చింది.

News August 14, 2024

భార్యతో విమానంలో సామాన్యుడిగా YS జగన్(PHOTO)

image

AP: మాజీ సీఎం YS జగన్ సాధారణ వ్యక్తిలా విమానంలో భార్యతో కలిసి ప్రయాణించారు. గతంలో సీఎంగా ప్రత్యేక విమానాల్లో ప్రయాణించిన ఆయన ప్రస్తుతం సామాన్యుడిలా సాధారణ విమానాల్లో ఎకానమీ క్లాసులో ప్రయాణిస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల విజయవాడ-బెంగళూరు మధ్య మాజీ సీఎం ఎక్కువగా ప్రయాణిస్తుండగా ఆ సమయంలో ఈ ఫొటో తీసినట్లు తెలుస్తోంది.

News August 14, 2024

రేపటి నుంచి ఆరోగ్య శ్రీ బంద్: ఆస్పత్రులు

image

AP: పెండింగ్ బకాయిలు చెల్లించనందున ఆగస్టు 15 నుంచి రోగులకు ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించలేమని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ వెల్లడించింది. ‘2023 సెప్టెంబర్ తర్వాత బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. రూ.2500 కోట్లు రావాల్సి ఉంది. కొత్త ప్రభుత్వం రూ.160 కోట్లు ఇచ్చింది. ఆస్పత్రుల రోజువారీ ఖర్చులకూ డబ్బులు లేవు. అందుకే సేవలు కొనసాగించలేం’ అని ప్రభుత్వానికి లేఖ రాసింది.

News August 14, 2024

రాజ్‌నాథ్ సింగ్ కీలక సమావేశం

image

జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక సమావేశం నిర్వహించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఇతర భద్రతా ఏజెన్సీల అధిపతులతో నార్త్ బ్లాక్‌లో భేటీ అయ్యారు. ఇటీవల జమ్మూలో ఉగ్రదాడులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశంలో భద్రత కట్టుదిట్టం చేయడంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

News August 14, 2024

అయోధ్యలో రూ.50లక్షల విలువైన లైట్లు చోరీ!

image

అయోధ్యలో రామాలయ నిర్మాణం అనంతరం మందిర పరిసర ప్రాంతాలను సర్కారు సుందరంగా ముస్తాబు చేసింది. భక్తిపథం, రామపథం మార్గాల్లో వెదురు స్తంభాలతో కూడిన లైట్లను ఏర్పాటు చేసింది. వాటిలో 3800 వెదురు స్తంభాల లైట్లను, 36 గోబో ప్రొజెక్టర్ లైట్లను దుండగులు చోరీ చేశారు. వీటి విలువ రూ.50 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఆలయ ట్రస్టు పోలీసులకు ఈ నెల 9న ఫిర్యాదు చేయగా తాజాగా వెలుగులోకి వచ్చింది.

error: Content is protected !!