India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈరోజు రాత్రి 12గంటల సమయంలో ‘2024 పీకే2’ అనే గ్రహశకలం భూమి సమీపానికి రానుందని నాసా తెలిపింది. గంటకు 31,380 కిలోమీటర్ల వేగంతో అది ప్రయాణిస్తోందని పేర్కొంది. 83 అడుగుల పొడవుతో సుమారు ఓ చిన్న భవనమంతటి సైజులో ఉండే ఆ శకలం, భూమికి 12 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి వెళ్తుందని వివరించింది. తరచూ భూ కక్ష్యలోకి వచ్చే ఆస్టరాయిడ్స్‌ని అటెన్ గ్రూప్‌గా పిలుస్తున్నారు. ఇది ఆ గ్రూప్‌నకే చెందినదిగా నాసా తెలిపింది.
టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు పంజాబ్‌కు చెందిన భక్తులు రూ.21కోట్ల భారీ విరాళం అందించారు. ట్రైడెంట్ గ్రూపునకు చెందిన రాజిందర్ గుప్తా ఈ చెక్కును టీటీడీ అదనపు ఈవో వెంకయ్యకు తిరుమలలోని క్యాంప్ కార్యాలయంలో అందించారు. కాగా టీటీడీకి చెందిన ప్రాణదాన ట్రస్ట్ ద్వారా పేదలకు గుండె, కిడ్నీ, బ్రెయిన్, క్యాన్సర్ వ్యాధులకు ఉచితంగా వైద్యం అందుతుంది.
తమిళనాడులోని తిరువళ్లూరు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీలోని ఒంగోలుకు చెందిన ఐదుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. చెన్నైలోని SRM కాలేజీలో చదువుతున్న ఏడుగురు విద్యార్థులు నిన్న సెలవు కావడంతో తిరువళ్లూరు వెళ్లారు. ఇవాళ చెన్నైకి తిరిగివస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో నితీశ్ వర్మ, రామ్, చేతన్, నితీశ్, యుకేశ్ మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
సెలబ్రిటీల పిల్లలకు కేర్‌టేకర్‌గా పేరు తెచ్చుకున్నారు లలితా డిసిల్వా. ఇటీవల పెళ్లైన అనంత్ అంబానీ మొదలు, సైఫ్-కరీనాల తనయుడు తైమూర్, రామ్ చరణ్-ఉపాసనల తనయ క్లీంకార వరకు ఎంతోమంది ప్రముఖుల పిల్లలకు ఆమె ఆయాగా ఉన్నారు. ప్రస్తుతం మెగా మనుమరాలి పట్ల శ్రద్ధ తీసుకుంటూ నెలకు రూ.2 లక్షల వరకు సంపాదిస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించారు. చరణ్ దంపతులు తన పట్ల చాలా ప్రేమ చూపిస్తారని తెలిపారు.
సినీ చరిత్రలో తొలిసారి ఓ కుక్క తన పాత్రకు డబ్బింగ్ చెప్పింది. కన్నడ మూవీ ‘నాను మత్తు గుండ-2’లో నటుడు రాకేశ్ అడిగతో పాటు లాబ్రాడర్ జాతికి చెందిన శునకం ‘సింబా’ పాత్రలో లీడ్ రోల్ పోషిస్తోంది. రఘు హాసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం డబ్బింగ్ వర్క్ జరుగుతోంది. సింబా పాత్రకు శునకం సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. ఈ మూవీ కన్నడ, తెలుగు, హిందీ తదితర భాషల్లో రిలీజ్ కానుంది.
కోల్‌కతా ట్రైనీ డాక్టర్(31)పై హత్యాచార <<13822185>>ఘటనలో<<>> సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అత్యాచారానికి ముందు నిందితుడు సంజయ్ రాయ్ ఆసుపత్రి వెనకాల మద్యం తాగుతూ పోర్న్ వీడియోలు చూశాడు. అత్యంత దారుణంగా ఆమెను రేప్ చేయడంతో ప్రైవేట్ భాగాల నుంచి బ్లీడింగ్ అయినట్లు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తేలింది. ఇక సంజయ్‌కి ఇప్పటికే 4 పెళ్లిళ్లు కాగా అతడి టార్చర్ భరించలేక ముగ్గురు భార్యలు వదిలిపెట్టి వెళ్లిపోయారు.
2013లో మొదలైన IPE- ప్లస్ ఫండ్ వన్ అదానీ స్టాక్స్‌లో అసలు పెట్టుబడే పెట్టలేదని 360 వన్ (గతంలో IIFL వెల్త్) వెల్లడించింది. హిండెన్‌బర్గ్ ఆరోపణలపై స్పందించింది. 2019లో క్లోజ్ చేసే సమయానికి ఫండ్ AUM $48 మిలియన్లకు చేరిందని, ఇందులో 90% బాండ్లలోనే మదుపు చేశామంది. ఈ వ్యవహారాలను ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్ చూశారని, ఇతరుల జోక్యానికి తావులేదని స్పష్టం చేసింది. మాధబీ, ధవళ్‌కు ఫండ్‌లో1.5% వాటా ఉండేదని పేర్కొంది.
ఉపరితల ఆవర్తనం, బలమైన నైరుతి రుతుపవనాల వల్ల తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే 2 రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిర్మల్, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కొత్తగూడెం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే ఛాన్స్ ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక హైదరాబాద్‌లో సాయంత్రం వేళ చిరుజల్లులు పడే ఆస్కారం ఉందని పేర్కొంది.
AP: అన్నమయ్య(D) నందలూరు(మ) అరవపల్లిలో ఓ పెళ్లి మండపంలో యువతి హల్‌చల్ చేసింది. తనను ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకుంటున్నాడని ఆరోపిస్తూ వరుడు సయ్యద్‌పై యాసిడ్ పోసేందుకు ప్రయత్నించి, కత్తితో దాడి చేసింది. ఈ ఘటనలో వరుడికి స్వల్పంగా గాయాలయ్యాయి. పెళ్లి పందిరిలో యువతి దాడి నేపథ్యంలో సయ్యద్ వివాహం నిలిచిపోగా.. వ్యవహారం పోలీసుల వరకూ చేరింది. దాడి చేసిన యువతిని వారు అదుపులోకి తీసుకున్నారు.
ఒలింపిక్స్‌లో పతకాన్ని పొందేందుకు వినేశ్ ఫొగట్ పూర్తి అర్హురాలని మాజీ క్రికెటర్ గంగూలీ అభిప్రాయపడ్డారు. ‘రూల్స్ ఏంటో నాకు స్పష్టంగా తెలియదు కానీ ఆమె ఫైనల్స్‌కు వెళ్లారంటే కచ్చితంగా మెడల్ పొందేందుకు అర్హత సాధించినట్లే. అది ఏ పతకమైనా ఓకే. అనర్హత సరైనదా కాదా అనేది పక్కన పెడితే, మెడల్‌కు వినేశ్ పూర్తి అర్హురాలు’ అని పేర్కొన్నారు. కాగా వినేశ్ అనర్హతపై ఆర్బిట్రేషన్ కోర్టు ఈ నెల 13న తీర్పు ఇవ్వనుంది.
Sorry, no posts matched your criteria.