News February 3, 2025
క్రీడలకు కేంద్రం ఎంత కేటాయించిందంటే?

2025-26 ఏడాదికి కేంద్రం బడ్జెట్ విడుదల చేయగా అందులో క్రీడా మంత్రిత్వ శాఖకు రూ.3,794.30 కోట్లు కేటాయించింది. దీనితో చైనా బడ్జెట్‌ను పోల్చుతూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. చైనా ప్రభుత్వం రూ.27,741 కోట్లు క్రీడల కోసమే కేటాయించింది. క్రీడాకారులకు సరైన వసతులు కల్పించేలా బడ్జెట్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. 2024 ఒలింపిక్స్‌లో చైనాకు 91 మెడల్స్ వస్తే, ఇండియాకు 6 మాత్రమే వచ్చిన విషయం తెలిసిందే.
Similar News
News February 14, 2025
ఘోరం: యువకుడిని చంపి ముక్కలుగా చేసి..

AP: రాష్ట్రంలో మరో దారుణ ఘటన జరిగింది. ప్రకాశం జిల్లా కంభంలో శ్యాంబాబు(30) అనే యువకుడిని దుండగులు ఘోరంగా హత్య చేశారు. మృతదేహాన్ని ముక్కలుగా చేసి వాటిని బస్తాల్లో కుక్కి నక్కలగండి పంట కాలువలో పడేశారు. ఈ హత్య వెనుక సమీప బంధువులే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 14, 2025
Good News: హోల్‌సేల్ రేట్లు తగ్గాయ్..

భారత టోకు ధరల ద్రవ్యోల్బణం (WPI) జనవరిలో 2.31 శాతానికి తగ్గింది. 2024 డిసెంబర్లో ఇది 2.37%. గత ఏడాది జనవరిలో ఇది 0.27 శాతమే కావడం గమనార్హం. ఆహార వస్తువుల ధరలు తగ్గడమే ఇందుకు కారణమని కామర్స్ మినిస్ట్రీ తెలిపింది. ఫుడ్ ప్రొడక్ట్స్, టెక్స్‌టైల్స్ తయారీ, క్రూడ్ పెట్రోల్, గ్యాస్ ధరలు మాత్రం పెరుగుతున్నట్టు పేర్కొంది. డిసెంబర్లో 8.89గా ఉన్న WPI ఫుడ్ ఇండెక్స్ విలువ జనవరిలో 7.47కు దిగొచ్చిందని తెలిపింది.
News February 14, 2025
అకౌంట్లోకి రూ.15,000.. రేపే లాస్ట్

కొత్తగా ఉద్యోగంలో చేరే వారికి కేంద్ర ప్రభుత్వం ELI(ఎంప్లాయీస్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీం) అమలు చేస్తోంది. దీనికి అర్హత సాధించిన వారు ఫిబ్రవరి 15లోగా UAN యాక్టివేషన్, బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో సీడింగ్ తప్పనిసరిగా పూర్తి చేయాలి. అలా చేస్తే ఒక నెల జీతం(గరిష్ఠంగా ₹15000) 3 వాయిదాల్లో అందిస్తోంది. ఇది ఉద్యోగి ఖాతాలో జమ అవుతుంది. అయితే చాలామంది ఉద్యోగులు UAN యాక్టివేషన్, ఆధార్ సీడింగ్‌పై ఆసక్తి చూపడం లేదు.