news

News August 8, 2024

NCP మొత్తాన్ని తీసుకొచ్చేవాడిని: అజిత్ పవార్

image

బీజేపీ, శివ‌సేన త‌న‌కు CM ప‌ద‌వి ఆఫ‌ర్ చేసుంటే మొత్తం NCPని త‌న‌వెంట‌ తీసుకొచ్చేవాడిన‌ని మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ ప‌వార్ వ్యాఖ్యానించారు. సీఎం ఏక్‌నాథ్ షిండే బ‌యోగ్ర‌ఫీ విడుద‌ల సంద‌ర్భంగా ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. రాజకీయాల్లో తాను ఏక్‌నాథ్ షిండే, దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ కంటే సీనియ‌ర్‌ అని చెప్పుకొచ్చారు.

News August 8, 2024

కేరళ సీఎంకు చెక్కు అందించిన చిరంజీవి

image

కేరళ సీఎం పినరయి విజయన్‌తో మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు. వయనాడ్ బాధితులను ఆదుకునేందుకు రూ.కోటి విరాళానికి సంబంధించిన చెక్‌ను సీఎంకు చిరు అందించారు. బాధితులకు అందుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు. కాగా వయనాడ్ బాధితులను ఆదుకునేలా రామ్‌చరణ్, తాను కలిసి బాధితులకు రూ.కోటి సాయం చేస్తామని ఇటీవల చిరు ప్రకటించారు.

News August 8, 2024

సోమరిపోతులు అవుతున్నాం.. కాస్త నడవండి!

image

స్టాన్‌ఫోర్ట్ యూనివర్సిటీ తాజా అధ్యయనంలో ఇండోనేషియా, సౌదీతో పాటు ఇండియా వంటి దేశాల్లోని ప్రజలు సోమరిపోతులయ్యారని తేలింది. 46 దేశాల్లోని 70,000 మంది స్మార్ట్‌ఫోన్లను ట్రాక్ చేయగా ఈ విషయం వెల్లడైంది. ఇండోనేషియన్లు సగటున రోజుకు 3,513 అడుగులు మాత్రమే నడిస్తే సౌదీలో 3,807 అడుగులేస్తున్నారు. ఇక 4,297 అడుగులతో ఇండియా మూడోస్థానంలో ఉంది. నగర ప్రజలు మోటారు వాహనాలపై ఎక్కువ ఆధారపడుతున్నట్లు తేలింది.

News August 8, 2024

రేపే ఫలితాలు

image

TG: రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిధిలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్(CPGET-2024) ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొ.లింబాద్రి, ఓయూ రిజిస్ట్రార్ ప్రొ.లక్ష్మీనారాయణతో కలిసి మ.3.30 గంటలకు రిలీజ్ చేస్తారు. ఫలితాలను ఉస్మానియా యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.

News August 8, 2024

ఆరోగ్య, జీవిత బీమా పన్నుపై కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటన

image

ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియంలపై వస్తున్న జీఎస్టీ రెవెన్యూలో 73-74 శాతం రాష్ట్రాల‌కే ద‌క్కుతోంద‌ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తెలిపారు. జీఎస్టీ శ‌కం ప్రారంభానికి ముందే రాష్ట్రాలు మెడిక‌ల్ ఇన్సూరెన్స్‌పై ప‌న్నులు విధించాయ‌న్నారు. ఆరోగ్య, జీవిత బీమాపై విధించిన 18 శాతం ప‌న్నును తొలగించాల‌నే డిమాండ్లు అధిక‌మ‌వ్వ‌డంపై ఆమె ఈ వ్యాఖ్య‌లు చేశారు.

News August 8, 2024

రూ.1,00,000 సాయం.. దరఖాస్తుకు మరో ఛాన్స్

image

TG: రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం <>దరఖాస్తు<<>> గడువును ఆగస్టు 12వ తేదీ వరకు పొడిగించారు. రాష్ట్రానికి చెందిన యువత సివిల్స్ ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధిస్తే ఈ స్కీం కింద రూ.లక్ష సాయాన్ని సింగరేణి తరఫున ప్రభుత్వం అందిస్తుంది. గత నెల 20వ తేదీన CM రేవంత్, డిప్యూటీ CM భట్టి విక్రమార్క ప్రారంభించారు. గతంలో విధించిన దరఖాస్తు గడువు ఈ నెల 6తో ముగియగా, అభ్యర్థుల విజ్ఞప్తితో తాజాగా మళ్లీ పొడిగించారు.

News August 8, 2024

బాబులా హామీలు ఇవ్వాలని నాపై ఒత్తిడి తెచ్చారు: జగన్

image

AP: MLC ఎన్నికలో మెజార్టీ లేకున్నా TDP పోటీ చేస్తోందంటే ఓటర్లను కొనుగోలు చేసి గెలవాలని చూస్తున్నారని YCP నేతల సమావేశంలో మాజీ CM జగన్ ఆరోపించారు. ‘CMగా ఉన్న వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. కానీ చంద్రబాబులో అలాంటి విలువలు లేవు’ అని విమర్శించారు. ఎన్నికల్లో బాబులా హామీలు ఇవ్వాలని తనపై ఒత్తిడి తెచ్చారని గుర్తు చేశారు. మాట నిలబెట్టుకోకపోతే ప్రజల్లో తలెత్తుకోలేమనే మోసపూరిత హామీలు ఇవ్వలేదన్నారు.

News August 8, 2024

వయనాడ్ ప్రళయం.. ప్రజల్ని కాపాడిన చిలుక!

image

కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిన ప్రమాదంలో చిక్కుకోకుండా ఓ చిలుక కొందరిని రక్షించింది. ప్రమాదానికి ముందురోజు వినోద్ అనే వ్యక్తి తన చిలుక (కింగిని)తో సోదరి ఇంటికి వచ్చారు. అయితే ఒక్కసారిగా అది బిగ్గరగా అరుస్తూ పంజరాన్ని నోటితో పొడుస్తూ ప్రకృతి విపత్తుపై హెచ్చరించింది. వెంటనే వినోద్ తేరుకొని పొరుగువారిని అలర్ట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయేలా చేశారు. మూగజీవులకు విపత్తులను పసిగట్టే గుణం ఉంటుంది.

News August 8, 2024

వావ్.. అనస్తీషియా లేకుండా కిడ్నీ మార్పిడి

image

శరీరంలో ఎంతో ముఖ్యమైన కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేసే సమయంలో రోగి మేలుకొని వైద్యులతో కబుర్లు చెప్పాడు. ఏంటి నమ్మశక్యంగా లేదా? అమెరికాలోని ఇల్లినాయిస్‌కు చెందిన 74 ఏళ్ల హ్యారీ స్టాక్‌హౌస్‌కు వైద్యులు ఇటీవల కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేశారు. శస్త్రచికిత్స సమయంలో పైకి లేపినప్పటికీ తనకు నొప్పిగా అనిపించలేదని అతడు చెప్పారు. నార్త్‌వెస్టర్న్ మెడిసిన్‌లో అనస్తీషియా లేకుండానే కిడ్నీ ఆపరేషన్ చేయడం ఇది మూడోసారి.

News August 8, 2024

స్మార్ట్ ఫోన్ యూజర్లకు బిగ్ వార్నింగ్

image

ఆండ్రాయిడ్ వెర్షన్లు 12, 12L, 13, 14 వాడుతున్న స్మార్ట్ ఫోన్లు హ్యాకింగ్‌కు గురయ్యే ముప్పు ఉందని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(CERT-In) హెచ్చరించింది. వీటిలో హానికర మాల్వేర్‌ను సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ గుర్తించినట్లు తెలిపింది. దీనివల్ల ఫోన్లు హ్యాకై, వ్యక్తిగత సమాచారం చోరీ అయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. వెంటనే ఆండ్రాయిడ్ వెర్షన్లను అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.

error: Content is protected !!