India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పాలస్తీనా బందీలను శనివారం మధ్యాహ్నంలోగా హమాస్ విడుదల చేయాలని, లేకపోతే కాల్పుల విరమణ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని ఇజ్రాయెల్‌కు US అధ్యక్షుడు ట్రంప్ సూచించారు. బందీలు విడుదల కాని పక్షంలో విధ్వంసం మళ్లీ మొదలవుతుందని హెచ్చరించారు. మరోవైపు, గాజాను సొంతం చేసుకుంటామన్న ట్రంప్ ప్రతిపాదనను పాలస్తీనియన్లు తిరస్కరిస్తున్నారు. వారికి అరబ్ దేశాలు మద్దతిస్తున్నాయని ఈజిప్ట్ విదేశాంగ శాఖ USకు తెలిపింది.

AP: ఇవాళ వైసీపీ ముఖ్య నేతలతో మాజీ సీఎం జగన్ తాడేపల్లిలో సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీకి పార్టీ జిల్లాల అధ్యక్షులు, ముఖ్య నేతలు హాజరవుతారు. పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. అలాగే జగన్ జిల్లాల టూర్‌పై కూడా ఈ సమావేశంలో స్పష్టత వస్తుందని సమాచారం. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలపై నేతలతో జగన్ చర్చిస్తారు.

BHEL(భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్) 400 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 150 ఇంజినీర్ ట్రైనీ, 250 సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు సంబంధిత విభాగంలో డిగ్రీ/ఇంజినీరింగ్/ఇంజినీర్ డిప్లొమా చదివి ఉండాలి. వయసు 27 ఏళ్లు మించకూడదు. నెల జీతం రూ.32,000 నుంచి రూ.1,60,000 వరకు ఉంటుంది. ఈ నెల 28లోగా అభ్యర్థులు రూ.1,072 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. https://cdn.digialm.com

న్యూజిలాండ్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ మరో రికార్డు కొల్లగొట్టారు. వన్డేల్లో అత్యంత వేగంగా 7,000 పరుగులు చేసిన రెండో ప్లేయర్‌గా కేన్ నిలిచారు. 159 ఇన్నింగ్సుల్లోనే ఆయన ఈ ఫీట్ సాధించారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ (161 ఇన్నింగ్సులు) రికార్డును విలియమ్సన్ అధిగమించారు. ఫాస్టెస్ట్ 7,000 రన్స్ రికార్డు హషీమ్ ఆమ్లా (150 ఇన్నింగ్సులు) పేరిట ఉంది. ఈ ముగ్గురి తర్వాత డివిలియర్స్ (166 ఇన్నింగ్సులు) ఉన్నారు.

AP: పాడేరు ఏజెన్సీ బంద్‌పై మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పందించారు. ‘1/70 చట్టాన్ని సవరించే ఆలోచన ప్రభుత్వానికి లేదు. దీనిపై వైసీపీ చేస్తోన్న దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు. గిరిజనులు ఆందోళన చెందొద్దు. ఈ చట్టంపై అవాస్తవాలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ చట్టాన్ని మరింత పకడ్బందీగా రక్షించేందుకు కట్టుబడి ఉన్నాం’ అని ఆమె వ్యాఖ్యానించారు.

TG: కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులపై అయోమయం వీడింది. పౌరసరఫరాల శాఖ నిర్ణయంతో నిన్నటి నుంచి మీసేవ కేంద్రాల్లో దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. కులగణన లేదా ప్రజాపాలన లేదా ప్రజావాణిలో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఒక్కో దరఖాస్తుకు రూ.50 మాత్రమే వసూలు చేయాలని మీసేవ నిర్వాహకులను ప్రభుత్వం ఆదేశించింది.

TG: యాసంగి పంటలు, ఉష్ణోగ్రతల పెరుగుదలతో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరిగింది. FEB 7న రికార్డ్ స్థాయిలో 15,920మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగింది. లెక్కల ప్రకారం రాష్ట్రంలో 8K మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఢిల్లీ, పంజాబ్, హరియాణా, UP, రాజస్థాన్ నుంచి మిగతాది కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. డిమాండ్ పెరుగుతుండటంతో అందుకు తగ్గ ఏర్పాట్లపై నేడు Dy.CM భట్టి అధికారులతో భేటీ కానున్నారు.

AP: మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి రోజైన ఫిబ్రవరి 14వ తేదీని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. జయంతి నిర్వహణకు ఆయన సొంత జిల్లా కర్నూలుకు రూ.3లక్షలు విడుదల చేసింది. అలాగే అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం జరపడానికి రూ.లక్ష చొప్పున విడుదల చేస్తూ సాంఘిక సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 1960, జనవరి 11 నుంచి 1962, మార్చి 12 వరకు సంజీవయ్య ఉమ్మడి ఏపీకి రెండో సీఎంగా సేవలు అందించారు.

భూమి బదలాయింపు చట్టం-1959ను 1970లో 1/70 <<15423562>>చట్టంగా<<>> మార్చారు. దీని ప్రకారం గిరిజనుల భూమిని గిరిజనేతరులకు బదిలీ చేయడం నిషిద్ధం. గిరిజనులు, గిరిజనులు సభ్యులుగా ఉండే కో-ఆపరేటివ్ సొసైటీకి తప్ప వేరే వారికి స్థిరాస్తిని అమ్మడం, కొనడం, బహుమతిగా ఇవ్వడం వంటి బదలాయింపులు చేయరాదు. 1978లో చేసిన మార్పు ప్రకారం భూమి బదలాయింపు చట్టాన్ని ఉల్లఘించిన వారిని అరెస్టు చేసి జైలుకు కూడా పంపవచ్చు.

TG: రాష్ట్రంలో బీర్ల ధరల పెంపు నిర్ణయం నేటి నుంచే అమల్లోకి రానుంది. ప్రస్తుతమున్న ధరలపై 15% పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ₹150గా ఉన్న లైట్ బీరు ధర వ్యాట్, ఎక్సైజ్ సుంకం కలుపుకొని ₹180 వరకు, స్ట్రాంగ్ బీరు ధర ₹160 నుంచి ₹200 వరకు పెరిగే ఛాన్సుంది. పక్క రాష్ట్రాల్లో ధరలు అధికంగా ఉండటం, బేసిక్ ధర పెంచాలని బీర్ల కంపెనీల డిమాండ్, ధరల నిర్ణయ కమిటీ సూచన మేరకు రేట్లు పెంచినట్లు తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.