News February 11, 2025

నేడు వైసీపీ నేతలతో జగన్ సమావేశం

image

AP: ఇవాళ వైసీపీ ముఖ్య నేతలతో మాజీ సీఎం జగన్ తాడేపల్లిలో సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీకి పార్టీ జిల్లాల అధ్యక్షులు, ముఖ్య నేతలు హాజరవుతారు. పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. అలాగే జగన్ జిల్లాల టూర్‌పై కూడా ఈ సమావేశంలో స్పష్టత వస్తుందని సమాచారం. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలపై నేతలతో జగన్ చర్చిస్తారు.

Similar News

News March 21, 2025

IPL టీమ్స్.. వాటి ఓనర్లు!

image

*KKR – షారుఖ్, జూహీ చావ్లా, జయ్ మెహ్తా. *MI – ముకేశ్ & నీతా అంబానీ. *CSK – N. శ్రీనివాసన్, ఇండియా సిమెంట్స్. *SRH – కళానిధి మారన్ (సన్ టీవీ). *DC- సజ్జన్ జిందాల్ & పార్థ్ జిందాల్, GMR. *PBKS – ప్రీతి జింతా, మోహిత్ బర్మన్, కరణ్ పాల్. *RCB- యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్. *RR- మనోజ్ బడలే, లచ్లన్ ముర్దోచ్. *GT- టొరెంట్ గ్రూప్, CVC క్యాపిటల్ పార్ట్నర్స్. *LSG- సంజీవ్ గోయెంకా, RPSG గ్రూప్.

News March 21, 2025

కాసేపట్లో చెన్నైకి సీఎం రేవంత్ ప్రయాణం

image

TG: CM రేవంత్ కాసేపట్లో శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి చెన్నైకి ప్రయాణం కానున్నారు. డీలిమిటేషన్ అంశంపై తమిళనాడు CM స్టాలిన్ అధ్యక్షతన రేపు అక్కడ జరిగే బీజేపీయేతర దక్షిణాది నేతల భేటీలో ఆయన పాల్గొననున్నారు. ఇదే సభకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా హాజరుకానున్న నేపథ్యంలో అక్కడ ఇద్దరు నేతలూ ఒకే స్టాండ్ తీసుకుంటారా లేక విభేదిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.

News March 21, 2025

అలా జరిగితే ‘మ్యాడ్ స్క్వేర్’ రికార్డు!

image

నార్నె నితిన్, సంగీత్ శోభన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్ స్క్వేర్’ ఈనెల 28న విడుదల కానుంది. వారం రోజుల్లో విడుదలవనుండగా మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయకూడదని మేకర్స్ భావిస్తున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఇలా జరిగితే ట్రైలర్ లేకుండా రిలీజైన తొలి సినిమాగా రికార్డులకెక్కనుంది. కాగా, ‘మ్యాడ్ స్క్వేర్’పై భారీగా అంచనాలున్నాయి.

error: Content is protected !!