India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రాకు మరో గోల్డ్ ఖాయమే అనిపిస్తోంది. అర్హత పోటీల్లో అతడు ఈటెను 89.33 మీటర్లు విసిరి No.1గా అవతరించారు. 2, 3 స్థానాల్లోని పీటర్స్ అండర్సన్ 0.71, జూలియన్ వెబర్ 1.58 మీ.లతో వెనకబడ్డారు. అంటే నీరజ్ ఫైనల్లో ఈ ప్రదర్శనే రిపీట్ చేసినా ఏదో ఓ పతకం వస్తుంది. ఇక ఒలింపిక్స్ బెస్ట్ 90.57మీ.తో పోలిస్తే అతడు 1.24మీ. వెనకబడ్డారు. అతడా రికార్డు బద్దలు కొట్టాలన్నదే భారతీయుల కోరిక. మీ Comment
AP: జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్నా మాజీ సీఎం జగన్‌కు అభద్రతాభావం పోలేదని మంత్రి నారా లోకేశ్ ఎక్స్‌లో ఎద్దేవా చేశారు. ‘ప్రస్తుతం జగన్‌కు 58 మంది సెక్యూరిటీ, 10 మంది సాయుధ గార్డులు, రెండు ఎస్కార్ట్ టీమ్స్, రెండు ల్యాండ్ క్రూయిజర్, బుల్లెట్ ప్రూఫ్ కారు ఉంది. ఇంకా 986 మందితో భద్రత ఎందుకు అడుగుతున్నారు?’ అని లోకేశ్ ప్రశ్నించారు.
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ మూవీ ట్రైలర్ రేపు సాయంత్రం 7:11 గంటలకు విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ద్వారా ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. హరీశ్ శంకర్ రూపొందిస్తున్న ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఆగస్టు 15న మూవీ విడుదల కానుంది.
తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా CM రేవంత్ US పర్యటన కొనసాగుతోంది. తాజాగా CMతో స్వచ్ఛ్ బయో సంస్థ ఛైర్మన్ ప్రవీణ్ భేటీ అయ్యారు. TGలో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆయన అంగీకారం తెలిపారు. రాష్ట్రంలో జీవఇంధన ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అటు అసెట్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ సర్వీసెస్‌లో కీలకమైన ఆర్సీజియం సంస్థ HYDలో తమ కంపెనీ విస్తరణకు ప్రభుత్వంతో MOU చేసుకుంది.
పారిస్ ఒలింపిక్స్‌లో కొవిడ్-19 కలకలం రేపుతోంది. దాదాపు 40 మంది క్రీడాకారులకు కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లు WHO రిపోర్టుల్లో తేలింది. బ్రిటిష్ స్విమ్మర్ ఆడమ్ పీటీ, ఆస్ట్రేలియా రన్నర్ లానీ పాలిస్టర్ తదితరులు ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఒలింపిక్స్ ముగింపునకు మరికొన్ని రోజులు ఉండటంతో కేసుల సంఖ్య పెరగొచ్చని WHO అంచనా వేస్తోంది.
<<-se>>#Olympics2024<<>>
పారిస్ ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్ గెలిచే అవకాశాన్ని త్రుటిలో చేజార్చుకున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్ తన ఓటమిపై తాజాగా స్పందించారు. ‘ఈ ఒలింపిక్స్ ప్రయాణం నా గౌరవాన్ని పెంచింది. అలాగే నా హృదయాన్ని ముక్కలు చేసింది. గెలిచేందుకు శాయశక్తులా ప్రతి ఔన్సు బలంతో పోరాడాను. కానీ విజయానికి కాస్త దూరంలో పడిపోయాను’ అని ట్వీట్ చేశారు. తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పారు.
AP: ఈ జగన్‌కు ఏమైందంటూ టీడీపీ Xలో వ్యంగ్యంగా స్పందించింది. ప్రతిపక్ష హోదా లేదు కానీ హోదా కావాలని, సీఎం పదవి లేదు కానీ ఆ స్థాయి సెక్యూరిటీ కావాలని ఆయన కోర్టుకు వెళ్లారని ఎద్దేవా చేసింది. ‘నిన్నటి వరకు ప్రతిపక్ష హోదా, ఇవాళ సీఎం స్థాయి సెక్యూరిటీ కావాలంటున్నాడు. అయ్యా సైకియాట్రిస్టులు తన పొజిషన్ ఏంటో ఆయనకు అర్థమయ్యేలా చెప్పండయ్యా’ అని TDP సెటైర్లు వేసింది. ఈ ట్వీట్‌పై YCP ఫ్యాన్స్ ఫైరవుతున్నారు.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా అసిస్టెంట్ జహంగీర్ ఆలమ్ పేరిట రూ.284 కోట్ల ఆస్తులున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన యూఎస్‌లో నివసిస్తున్నట్లు సమాచారం. హసీనా ఆస్తుల విలువ రూ.3.14 కోట్లు కాగా, ఆమె అసిస్టెంట్ ఆస్తుల విలువ రూ.284 కోట్లు ఉండటం బంగ్లాలో చర్చనీయాంశంగా మారింది. కాగా తనకు ఆరెకరాల భూమి ఉందని, అందులో పండే పంటల ద్వారా ఆదాయం వస్తుందని హసీనా గత ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
పుస్తక పఠనంతో ఒత్తిడి తగ్గడంతో పాటు నిద్ర మెరుగుపడుతుందంటారు. అందుకే చాలామంది ఖాళీ సమయాన్ని పుస్తకాలు చదివేందుకు కేటాయిస్తారు. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ‘భగవద్గీత’ చదివేందుకు ఇష్టపడుతున్నారు. ‘best selling telugu books’లో ఈ గ్రంథమే ప్రథమ స్థానంలో ఉంది. దీని తర్వాత ‘నేను మీ బ్రహ్మానందం’, ‘శ్రీ గురు చరిత్ర’, ‘వెన్నెల్లో ఆడపిల్ల’, ‘ఒక యోగి ఆత్మకథ’, ‘కన్యాశుల్కం’ ఉన్నాయి.
TG: MBBS ప్రవేశాల్లో స్థానికతపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై విమర్శలు రావడంతో మంత్రి దామోదర స్పందించారు. 9వ తరగతి నుంచి 12 వరకు రాష్ట్రంలో చదివిన విద్యార్థులను గత ప్రభుత్వ GO ఆధారంగా స్థానికులుగా కొనసాగిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 6 నుంచి 12వ తరగతి వరకు ఒకేచోట 4 ఏళ్లు చదివిన వారికి స్థానికత కల్పించే నిబంధన వర్తించదని ఆయన స్పష్టం చేశారు. జూన్ 2వ తేదీతో దీనికి సంబంధించిన గడువు ముగిసిందన్నారు.
Sorry, no posts matched your criteria.