News February 11, 2025
పేదలు ధనికులవ్వంది అందుకే: జాక్ మా

వ్యాపారం చేయాలని ఉన్నా.. చాలా మంది ఉద్యోగాలకే మొగ్గుచూపుతారు. అలాంటి వారిపై చైనీస్ బిలియనీర్ జాక్ మా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కోతి ముందు పండ్లు&డబ్బు పెడితే అవి పండ్లనే తీసుకుంటాయి. మనుషులు కూడా వ్యాపారానికి బదులు జాబ్‌కే జై కొడతారు. ఎందుకంటే జీతం కంటే వ్యాపారంలో ఎక్కువ డబ్బులు వస్తాయని తెలియదు. పేదలు.. పేదలుగా ఉండటానికి ఇదో కారణం’ అని చెప్పారు. గతంలో చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరలవుతున్నాయి.
Similar News
News March 23, 2025
బడి, గుడి ఏదైనా బీఆర్ఎస్ ప్రభుత్వమే కట్టింది: కేటీఆర్

TG: కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందేనని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సీఎం రేవంత్ తెలంగాణలో దోచి ఢిల్లీకి కట్టబెడుతున్నారని ఆరోపించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ని ఏం అడిగినా శివం, శవం అంటూ ముచ్చట చెబుతున్నారని దుయ్యబట్టారు. బడి, గుడి ఏదైనా బీఆర్ఎస్ ప్రభుత్వమే కట్టిందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని పేర్కొన్నారు.
News March 23, 2025
పార్లమెంట్‌లో రేపు అరకు కాఫీ స్టాళ్లు ప్రారంభం

AP: ఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణంలో రేపటి నుంచి రెండు అరకు కాఫీ స్టాళ్లు అందుబాటులోకి రానున్నాయి. స్పీకర్ ఓం బిర్లా అనుమతితో లోక్‌సభ భవనాల డైరెక్టర్ కుల్ మోహన్ సింగ్ ఉత్తర్వులిచ్చారు. ఇటీవల అమరావతిలోని అసెంబ్లీ ప్రాంగణంలోనూ అరకు కాఫీ స్టాళ్లను స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రారంభించిన విషయం తెలిసిందే.
News March 23, 2025
వైసీపీని ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం: సోము వీర్రాజు

AP: 60 సీట్లు వచ్చినప్పుడు జగన్ అసెంబ్లీకి వెళ్లలేదని, ఇప్పుడు ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కావాలంటున్నారని BJP MLC సోము వీర్రాజు విమర్శించారు. YCPని ఖాళీ చేయడమే కూటమి లక్ష్యమని, ఆ పార్టీకి 20% ఓట్లు కూడా రాకుండా చేస్తామని పేర్కొన్నారు. జగన్‌కు మళ్లీ అధికారమిస్తే అభివృద్ధికి విఘాతం కలుగుతుందన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై మాట్లాడుతూ కార్మిక సంఘాల నాయకుల వల్లే అది నష్టపోయిందని ఆరోపించారు.