news

News August 4, 2024

ఇమానే ఖెలీఫ్ అమ్మాయే: ఆమె తండ్రి

image

అల్జీరియా బాక్సర్ ఇమానే ఖెలీఫ్ అమ్మాయేనని ఆమె తండ్రి ఒమర్ ఖెలీఫ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లను ఆయన వీడియోలో ప్రదర్శించారు. ‘నా బిడ్డ ఆడపిల్లగానే పెరిగింది. కష్టపడటం, ధైర్యంగా ఉండటం నేర్పా. ఒలింపిక్స్ వరకు రావడానికి ఆమె చాలా శ్రమించింది. ఇటలీ బాక్సర్ కంటే నా కూతురు బలంగా ఉంది కాబట్టే సులువుగా గెలిచింది’ అని ఆయన వివరించారు. కాగా <<13756877>>ఇమానే<<>> సెమీస్‌కు చేరుకుని పతకం ఖాయం చేసుకున్నారు.

News August 4, 2024

కేరళకు రూ.25లక్షల సాయం ప్రకటించిన అల్లు అర్జున్

image

కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి సంభవించిన విపత్తుపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఈ ఘటన చాలా బాధాకరం. కేరళ నాకు ఎంతో ప్రేమను పంచింది. ఈ విపత్కర పరిస్థితుల్లో కేరళ CM రిలీఫ్ ఫండ్‌కు రూ.25లక్షలు <<13769196>>విరాళంగా<<>> ఇస్తున్నా. కేరళ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అని Xలో ట్వీట్ చేశారు.

News August 4, 2024

అవార్డులపై నాకు ఆసక్తి లేదు: హీరో నాని

image

అవార్డులపై తనకు ఆసక్తి లేదని హీరో నాని అన్నారు. ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ వేడుకల్లో ఆయన మాట్లాడారు. ‘ఒకప్పుడు స్టేజీపై అవార్డులు అందుకోవాలని కోరికగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ కోరిక సన్నగిల్లింది. ప్రస్తుతం నా సినిమాలో నటించే నటులు, టెక్నీషియన్లు, దర్శక నిర్మాతలు అవార్డులు తీసుకుంటే చూడాలనుంది. ఇప్పుడు కూడా నా దర్శకులు శౌర్యువ్, శ్రీకాంత్ ఓదెల అవార్డులు తీసుకుంటుంటే చూడడానికి వచ్చా’ అని ఆయన పేర్కొన్నారు.

News August 4, 2024

కాసేపట్లో మ్యాచ్.. శ్రీలంకకు బిగ్ షాక్

image

భారత్-శ్రీలంక మధ్య ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు రెండో వన్డే జరగనుంది. అయితే మ్యాచ్‌కు ముందే అతిథ్య లంకకు బిగ్ షాక్ తగిలింది. తొడ కండరాలు పట్టేయడంతో ఆ జట్టు కీలక ప్లేయర్ హసరంగ మిగతా రెండు వన్డేలకు దూరమైనట్లు లంక బోర్డు ప్రకటించింది. కాగా తొలి మ్యాచ్ టైగా ముగించడంలో హసరంగ కీలకపాత్ర పోషించాడు. కోహ్లీ, రాహుల్, కుల్దీప్‌ను ఔట్ చేసి భారత్‌ను దెబ్బకొట్టాడు.

News August 4, 2024

వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు క్యాబినెట్ ఆమోదం?

image

వక్ఫ్ బోర్డు అధికారాలను కుదించే సవరణ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. శుక్రవారమే క్యాబినెట్ సవరణల్ని ఆమోదించింది. త్వరలో పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టనున్నారు. వక్ఫ్ చట్టం(1954)లో 40కి పైగా సవరణల్ని కేంద్రం తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో సాయుధ బలగాలు, రైల్వే తర్వాత మూడో అతి పెద్ద భూ యజమాని(9.4 లక్షల ఎకరాలు) వక్ఫ్ బోర్డే.

News August 4, 2024

‘ఇండియన్2’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

image

కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన ‘ఇండియన్2’ మూవీ OTT రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. OTT ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఆగస్టు 9 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళంలో ప్రసారమవుతుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ ఓ పోస్టర్ ద్వారా తెలిపింది. శంకర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్, సిద్ధార్థ్ సహా పలువురు కీలకపాత్రలు పోషించారు.

News August 4, 2024

విరాట్ కోహ్లీని ఊరిస్తున్న రికార్డులు

image

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్‌ విరాట్ కోహ్లీని పలు రికార్డులు ఊరిస్తున్నాయి. ఇవాళ లంకతో జరగబోయే రెండో వన్డేలో 92 రన్స్ సాధిస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో 27 వేల పరుగులు పూర్తి చేసుకుంటారు. అదే జరిగితే ఈ మైలు రాయి చేరిన నాలుగో క్రికెటర్‌గా విరాట్ రికార్డులకెక్కుతారు. అలాగే 128 రన్స్ చేస్తే వన్డేల్లో 14 వేల పరుగులు పూర్తి చేసుకున్న మూడో ప్లేయర్‌గా ఘనత సాధిస్తారు.

News August 4, 2024

హెచ్1 బీ వీసాదారులకు భారీ ఊరట

image

హెచ్1 బీ వీసాదారులకు భారీ ఊరట లభించింది. వారి జీవిత భాగస్వాములు కూడా పని చేసేందుకు అవకాశమిచ్చే నిబంధనను సవాలు చేస్తూ ‘సేవ్ జాబ్స్ USA’ అనే సంస్థ వేసిన పిటిషన్‌ను కొలంబియా కోర్టు కొట్టివేసింది. భాగస్వాములకు ఉద్యోగాలివ్వరాదని, స్థానికులకే ఛాన్సులివ్వాలని కోరుతూ సంస్థ పిటిషన్‌లో కోరింది. దాన్ని తోసిపుచ్చిన కోర్టు, నిబంధనల విషయంలో DHSకి ఇమిగ్రేషన్ చట్టం విస్తృత అధికారాలను కల్పిస్తుందని పేర్కొంది.

News August 4, 2024

చదువు కోసమైనా సరే.. కొట్టడం క్రూరత్వమే: హైకోర్టు

image

చదువు, క్రమశిక్షణ కోసమైనా సరే పిల్లల్ని కొట్టడం క్రూరత్వమని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు పేర్కొంది. అక్కడి సర్‌గుజా జిల్లాలో టీచర్ కొట్టడంతో ఓ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. దీంతో టీచర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. క్రమశిక్షణ కోసం దండించానని తనపై కేసు కొట్టేయాలని ఆమె కోరగా కోర్టు నిరాకరించింది. ‘పిల్లలు జాతికి సంపద. వారికి ప్రేమతో నేర్పించాలి కానీ క్రూరత్వంతో కాదు’ అని తేల్చిచెప్పింది.

News August 4, 2024

అవును.. అప్పట్లో వివాహేతర బంధంలో ఉన్నా: కమలా హారిస్ భర్త

image

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ కంటే ముందు ఆమె భర్త డౌగ్ ఎమ్హోఫ్‌కు కెర్స్టిన్ ఎమ్హోఫ్ అనే మహిళతో పెళ్లైంది. ఆ సమయంలో మరొకరితోనూ ప్రేమ వ్యవహారం నడిపినట్లు డౌగ్ తెలిపారు. ‘కొన్ని తప్పుల వల్ల ఇబ్బంది పడ్డాం. కానీ ఆ తర్వాత నా తప్పుకి బాధ్యత వహించాను’ అని వివరించారు. డౌగ్ ఓ గొప్ప తండ్రి అని కొనియాడుతూ కెర్స్టిన్ ఓ ప్రకటన విడుదల చేశారు. 2009లో వీరిద్దరూ విడిపోగా, 2014లో కమలతో డౌగ్ పెళ్లైంది.