news

News August 4, 2024

నవీన్ పొలిశెట్టి, ప్రకాశ్‌రాజ్‌కు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు

image

* ఉత్తమ నటుడు(క్రిటిక్స్)- నవీన్ పొలిశెట్టి(మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి)
* ఉత్తమ నటుడు(క్రిటిక్స్)- ప్రకాశ్‌రాజ్(రంగమార్తాండ)
* బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ ఫీమేల్- శ్వేతా మోహన్(మాస్టారు.. మాస్టారు)
* బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ మేల్- శ్రీరామచంద్ర(ఓ రెండు ప్రేమ మేఘాలిలా..)
* బెస్ట్ లిరిక్స్- అనంత్ శ్రీరామ్(ఓ రెండు ప్రేమ మేఘాలిలా..)

News August 4, 2024

11,062 టీచర్ పోస్టుల భర్తీపై BIG UPDATE

image

TG:11,062 టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహిస్తున్న DSC పరీక్షలు రేపటితో ముగియనున్నాయి. ఈ నెలాఖరులో ఫలితాలను విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. తొలుత ప్రాథమిక కీ విడుదల చేసి, అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఫైనల్ కీని ప్రకటించనున్నారు. ఆ తర్వాత జనరల్ ర్యాంకింగ్ లిస్టును వెల్లడిస్తారు. అనంతరం సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపడతారు. అటు 1:3 చొప్పున సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.

News August 4, 2024

మనూ భాకర్‌కు అరుదైన గౌరవం

image

ఒలింపిక్ డబుల్ మెడలిస్ట్ మనూ భాకర్‌కు అరుదైన గౌరవం లభించనుంది. ఈ నెల 11న జరిగే ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో మను ఫ్లాగ్ బేరర్‌గా వ్యవహరించనున్నట్లు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తెలిపింది. పురుష పతాకధారి ఎవరనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. కాగా పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించి మను చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. 10మీ. ఎయిర్ పిస్టల్ సింగిల్, మిక్స్‌డ్ విభాగాల్లో ఆమె కాంస్య పతకాలు సాధించారు. <<-se>>#Olympics2024<<>>

News August 4, 2024

జనరల్ బోగీ ఎక్కితే చుక్కలే..!

image

కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల రైల్వే సామాన్యులకు దూరమవుతోంది. ధనిక వర్గాలకే ప్రాధాన్యమిచ్చేలా AC బోగీలు పెంచుతూ, జనరల్ బోగీలు తగ్గించడంతో ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జనరల్ బోగీలను 4 నుంచి ఒకటికి తగ్గించడంతో ప్రయాణం నరకమైంది. ఒకే ఒక్క బోగీ కావడంతో ప్రయాణికులతో కిక్కిరిసిపోయి సీట్ల కోసం గొడవలు జరుగుతున్నాయి. కొంతమంది టాయిలెట్ల వరకూ కూర్చుని మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు.

News August 4, 2024

ఇది కష్టానికి దక్కిన ఫలితం: KTR

image

TG: ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ చిత్రంగా ‘బలగం’ నిలవడంపై మాజీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. మూవీని అద్భుతంగా తెరకెక్కించిన వేణు బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ అందుకున్నందుకు అభినందనలు తెలియజేశారు. ఇది వేణుతో పాటు అతడి టీమ్‌ కష్టానికి దక్కిన ఫలితమని కొనియాడారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశిస్తున్నట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు.

News August 4, 2024

100 రోజుల్లో అన్నీ సెట్ చేస్తాం: సీఎం చంద్రబాబు

image

AP: గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం పరిస్థితి అతలాకుతలమైందని సీఎం చంద్రబాబు మీడియా చిట్‌చాట్‌లో వ్యాఖ్యానించారు. 100 రోజుల్లో అన్నీ గాడిలో పెడతామని హామీ ఇచ్చారు. ‘రికార్డులన్నీ తారుమారు చేశారు. రెవెన్యూ శాఖపై ప్రత్యేక దృష్టి పెడతాను. రీ సర్వే అస్తవ్యస్తంగా జరగడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సాధ్యమైనంత త్వరగా వీలైనన్ని సమస్యల్ని పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని పేర్కొన్నారు.

News August 4, 2024

రేవంత్ US పర్యటన తర్వాత క్యాబినెట్ విస్తరణ?

image

TG: CM రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన అనంతరం మంత్రివర్గ విస్తరణ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 14న రేవంత్ రాష్ట్రానికి చేరుకుని, ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి AICC అగ్రనేతలతో చర్చించనున్నట్లు టాక్. క్యాబినెట్‌లో 6 ఖాళీలుండగా, ప్రస్తుతానికి నలుగురిని తీసుకోనున్నట్లు సమాచారం. మిగతా 2 బెర్తులను వివిధ సమీకరణాల ప్రకారం భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. క్యాబినెట్ విస్తరణ తర్వాత PCC చీఫ్‌ను కూడా నియమిస్తారట.

News August 4, 2024

కేసు ఉన్నా ఉద్యోగం నుంచి తొలగించకూడదు: హైకోర్టు

image

AP: క్రిమినల్ కేసు ఉన్న ఉద్యోగిని ఉద్యోగం నుంచి తీసేయడానికి వీల్లేదని హైకోర్టు తీర్పునిచ్చింది. అధికారిక విధులు నిర్వర్తించడానికి కేసు ఏమాత్రం అడ్డంకి కాదని స్పష్టం చేసింది. నేరం నిరూపణ అయ్యేవరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి నిర్దోషే అని పేర్కొంది. విచారణ జరపకుండా శిక్ష విధించడం చెల్లదని తెలిపింది. ఓ అంగన్‌వాడీ వర్కర్‌ను కేసు నెపంతో ఉద్యోగం నుంచి తొలగించడంతో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

News August 4, 2024

శ్రీశైలానికి కొనసాగుతున్న వరద

image

శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీ వరద కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఇన్ ఫ్లో 4,50,064 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 5,22,318 క్యూసెక్కులుగా ఉంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.20 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. మరోవైపు భారీ వరద వస్తుండటంతో నాగార్జున సాగర్ గేట్లు ఇవాళ ఓపెన్ చేయనున్నారు.

News August 4, 2024

APPLY NOW.. 44,288 ఉద్యోగాలు

image

దేశ వ్యాప్తంగా పోస్టాఫీసుల్లోని 44,228 బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ ఉద్యోగాల భర్తీకి <<13636461>>దరఖాస్తుల<<>> స్వీకరణ కొనసాగుతోంది. రేపటి(ఆగస్టు 5)తో గడువు ముగుస్తుంది. 6 నుంచి 8వ తేదీ వరకు దరఖాస్తుల్లో మార్పులు చేసుకోవచ్చు. టెన్త్ పాసైన 18 నుంచి 40 ఏళ్లలోపు వారు అర్హులు. ఏపీలో 1355, TGలో 981 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరిన్ని వివరాలకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.