News February 27, 2025
ఘోరం: ఆగి ఉన్న బస్సులో యువతిపై అత్యాచారం

పుణేలో ఢిల్లీ ‘నిర్భయ’ తరహా ఘటన జరిగింది. ఆగి ఉన్న బస్సులో యువతి(26)పై ఓ మృగాడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని దత్తాత్రేయ రాందాస్‌గా గుర్తించారు. పోలీసులు అతడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. సతారా జిల్లా ఫల్తాన్‌కు చెందిన యువతి పుణేలోని ఆసుపత్రిలో కౌన్సిలర్‌గా పనిచేస్తోంది. ఊరికి వెళ్లేందుకు స్వర్గేట్ బస్టాండ్‌కు వచ్చింది. బస్సు పక్కన నిలిపి ఉందని ఆమెను తీసుకెళ్లిన నిందితుడు రేప్ చేశాడు.
Similar News
News March 25, 2025
క్రికెటర్ తమీమ్ ఆరోగ్యం ఎలా ఉందంటే?

బంగ్లాదేశ్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం ఆయన డాక్టర్లతో మాట్లాడుతున్నారు. తమీమ్‌కు గుండెపోటు వచ్చినప్పుడు వైద్యులు దాదాపు 22 నిమిషాలపాటు CPR చేశారు. అనంతరం మూడుసార్లు DC షాక్ ఇచ్చారు. వెంటనే స్టెంట్లు అమర్చారు. దీంతో తమీమ్ మృత్యువు నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. కాగా నిన్న ఓ మ్యాచ్ సందర్భంగా తమీమ్ గుండెపోటుతో మైదానంలోనే కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే.
News March 25, 2025
Stock Markets: 800 పాయింట్లు పడ్డ సెన్సెక్స్

స్టాక్‌మార్కెట్లు మరోసారి ఒడుదొడుకులకు లోనయ్యాయి. ఇంట్రాడే గరిష్ఠ స్థాయుల నుంచి కనిష్ఠానికి పడిపోయాయి. సెన్సెక్స్ 78,741 నుంచి మధ్యాహ్నం 800PTS మేర కుంగి 77,912 వద్ద కనిష్ఠాన్ని టచ్ చేసింది. ప్రస్తుతం 78,023 (47) వద్ద చలిస్తోంది. నిఫ్టీ 23,869 నుంచి 23,627కు పడిపోయింది. 23,687 (30) వద్ద ట్రేడవుతోంది. సూచీకి 23800 వద్ద స్ట్రాంగ్ రెసిస్టెన్సీ ఉంది. ట్రంప్ టారిఫ్స్‌తో నెగటివ్ సెంటిమెంటు పెరిగింది.
News March 25, 2025
ఢిల్లీ గెలుపుపై కెవిన్ పీటర్సన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

లక్నోపై విజయం తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్ కెవిన్ పీటర్సన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘థ్రిల్లింగ్ మ్యాచ్ తర్వాత నిద్రలోంచి మేల్కొంటే పొందే అనుభవం అద్భుతం. ఇది సెలబ్రేట్ చేసుకోవాల్సిన మ్యాచ్. ఢిల్లీ జట్టు పోరాడుతూనే ఉంటుంది. మన గోల్‌ను చేరుకునేందుకు బ్యాట్, బాల్, ఫీల్డ్‌లో మనం చాలా మెరుగుపరుచుకోవాలని నాకు తెలుసు. దయచేసి మాతో ప్రయాణాన్ని ఆస్వాదించండి’ అని కెవిన్ ట్వీట్‌లో రాసుకొచ్చారు.