India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వచ్చే ఏడాదిలోపు ఆండ్రాయిడ్ ఫోన్లు, ట్యాబులు, కొన్ని శామ్‌సంగ్ వాచుల్లో ‘స్కూల్ టైమ్’ ఫీచర్‌ను గూగుల్ విస్తరించనుంది. పాఠశాల వేళల్లో పిల్లలు ఫోన్ అన్ లాక్ చేస్తే బ్లాక్ స్ర్కీన్ మాత్రమే చూపిస్తుంది. పేరెంట్స్ పర్మిషన్ ఇచ్చిన యాప్స్ మాత్రమే వారు చూడగల్గుతారు. తొలుత మేలో LTE స్మార్ట్‌వాచ్‌లో ఈ ఫీచర్‌ను పరిచయం చేశారు. త్వరలో YouTubeలో పిల్లల యాక్టివిటీని తెలుసుకోవచ్చు.
US తలసరి ఆదాయంలో 1/4 వంతుకు చేరాలంటే భారత్‌కు 75, ఇండోనేషియాకు 70, చైనాకు 10 ఏళ్లు పడుతుందని ప్రపంచ బ్యాంకు రిపోర్టు పేర్కొంది. 75% ప్రపంచ జనాభా ఉన్న 108 మధ్య ఆదాయ దేశాలు సంపన్నంగా మారాలంటే పెరిగే జనాభా, అప్పులు, జియో పొలిటికల్ సవాళ్లను అధిగమించాలని తెలిపింది. చాలా దేశాలు ఫస్ట్‌గేర్ వేసి హై స్పీడులో వెళ్లేందుకు యత్నిస్తున్నాయని, పెట్టుబడుల కోసం గత శతాబ్దపు పాఠాలపై ఆధారపడొద్దని సూచించింది.
AP: కౌలు రైతులను సహకార సంఘాల్లో సభ్యులుగా చేర్చి వారికి రుణాలు ఇవ్వాలని అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. సహకార సంఘాల్లో అవినీతిపై విచారణ జరిపిస్తామన్నారు. ఆప్కాబ్(APCOB)-డీసీసీబీ, సహకార సంఘాల ద్వారా మహిళా సంఘాలకు అధిక శాతం రుణాలను అందించాలని సూచించారు. వ్యవస్థలో లోపాలను సరిదిద్దాలని, డిజిటలైజేషన్‌తోనే అక్రమాలకు చెక్ పెట్టవచ్చని ఆప్కాబ్ సమావేశంలో వ్యాఖ్యానించారు.
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై BJP MP కంగన విమర్శలు చేశారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ వేషధారణలో రాహుల్ ఉన్నట్లు మార్ఫ్ చేసిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘కులం తెలియని వ్యక్తి కుల గణన చేయాలంటున్నారు’ అనే అర్థం వచ్చేలా క్యాప్షన్ పెట్టారు. కులాల పేరుతో దేశాన్ని చీల్చాలని చూస్తే మొదటికే మోసం వస్తుందన్నారు. కాగా ఆమె అటెన్షన్ కోసమే రాహుల్‌ను టార్గెట్ చేశారని కామెంట్స్ వస్తున్నాయి.
19298- జయసూర్య (శ్రీలంక)
18867- క్రిస్ గేల్ (వెస్టిండీస్)
18744- డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా)
16950- గ్రేమ్ స్మిత్ (సౌతాఫ్రికా)
16120- హెయిన్స్ (వెస్టిండీస్)
16119- సెహ్వాగ్ (భారత్)
15335- సచిన్ (భారత్)
15210- తమీమ్ ఇక్బాల్ (బంగ్లాదేశ్)
15110- కుక్ (ఇంగ్లండ్)
15039- రోహిత్ (భారత్)
TG: మూడు నెలల్లో LRS(లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్నారు. గత ప్రభుత్వం 2020 AUG 31-OCT 31 మధ్య LRS దరఖాస్తులు స్వీకరించిందన్నారు. నాలుగేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న 25.70లక్షల దరఖాస్తులకు పరిష్కారం చూపాలన్నారు. దళారుల ప్రమేయం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సివిల్ సర్వెంట్ కావాలనే లక్ష్యంతో రేయింబవళ్లు శ్రమించిన ఓ యువతి ఒత్తిడికి బలైపోయింది. ఢిల్లీలో శిక్షణ పొందుతున్న అంజలి అనే యువతి మూడు అటెంప్ట్‌లు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో కుంగిపోయిన ఆమె తల్లిదండ్రులను క్షమించమని కోరుతూ ఆత్మహత్య చేసుకుంది. ప్రైవేట్ హాస్టల్స్ రెంట్‌లు దండుకుంటున్నాయని సూసైడ్ నోట్‌లో పేర్కొంది. సివిల్స్ క్లియర్ కాకపోవడం, ఆర్థిక ఇబ్బందులతో ఆమెపై ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తోంది.
AP: నంద్యాల(D) చిన్నవంగలిలో మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు చనిపోయిన ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో గురుశేఖర్, అతని భార్య, ఇద్దరు కూతుళ్లు మృతిచెందగా, మరో కూతురు ప్రసన్న(15) అనాథగా మిగిలింది. ఆమెకు రూ.10లక్షల సాయం ప్రకటించిన సీఎం, ఆమెను సంరక్షిస్తున్న నానమ్మకు రూ.2లక్షలు అందిస్తామన్నారు. బాలిక సంరక్షణ, విద్య విషయంలో అండగా ఉంటామన్నారు.
పారిస్ ఒలింపిక్స్ ఆర్చరీ క్వార్టర్స్‌లో దీపికకు నిరాశే మిగిలింది. కొరియన్ ప్లేయర్ నామ్ సు హియాన్ చేతిలో 6-4 తేడాతో ఓడిపోవడంతో ఆమె సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. తొలి సెట్‌లో గెలుపొంది దీపిక రాణించినా రెండో సెట్‌లో ఓ సారి 6 పాయింట్లు రావడం, నాలుగో సెట్లో ఓ చోట ఏడు పాయింట్లే దక్కడం ఓటమికి కారణమయ్యాయి. <<-se>>#Olympics2024<<>>
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. CM ఏక్‌నాథ్ షిండేను శరద్ పవార్, రాజ్‌ఠాక్రే (MNS) వేర్వేరుగా కలిశారు. రాజకీయంగా కీలకమైన మరాఠా రిజర్వేషన్లు, ఇంటి నిర్మాణ ప్రాజెక్టులపై వీరు చర్చించారు. LS ఎన్నికల్లో BJPకి మద్దతిచ్చిన ఠాక్రే చాలా సందర్భాల్లో షిండేను విమర్శిస్తున్నారు. ఇక MVA కూటమి నుంచి పవార్ ఒక్కరే షిండేను కలుస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల ముందు వీరి చర్చలు ఆసక్తికరంగా మారాయి.
Sorry, no posts matched your criteria.