news

News August 2, 2024

GYMNASTICS: రియో ఒలింపిక్స్ నాటి మెరుపులు ఏవీ?

image

దీపా కర్మాకర్.. రియో ఒలింపిక్స్‌ ఫైనల్స్‌లో మారుమోగిన పేరు ఇది. అత్యంత కష్టమైన ‘ప్రొడోనోవా’ను ఆమె సునాయసంగా చేసిన తీరుపై ప్రశంసలు కురిశాయి. కానీ ఈ మెరుపులు ఆ తర్వాత కొనసాగలేదు. టోక్యో ఒలింపిక్స్‌లో ప్రణతి నాయక్ ప్రదర్శన నిరాశపర్చింది. ఈసారి ఒక్క జిమ్నాస్ట్ కూడా లేకపోవడం విచారకరం. వివిధ విభాగాల్లో 55 మెడల్స్ సాధించే అవకాశం ఉన్నా భారత్ ఈ క్రీడను ప్రోత్సహించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

News August 2, 2024

మంత్రుల మార్ఫింగ్ వీడియోపై కేసు

image

TG: రాష్ట్ర మంత్రుల మార్ఫింగ్ వీడియోపై హైదరాబాద్ సీసీఎస్‌లో కేసు నమోదైంది. నిన్న అసెంబ్లీలో మంత్రి సీతక్క మాట్లాడుతుండగా వెనకాలే కూర్చున్న పొన్నం ప్రభాకర్‌తో మరో ఎమ్మెల్యే మాట్లాడుతున్న దృశ్యాలను కొందరు మార్ఫ్ చేశారు. దీనిపై సీఎం రేవంత్ సైతం ఘాటుగా <<13752916>>స్పందించారు<<>>.

News August 2, 2024

గాయాల నుంచి కోలుకుని గోల్డ్ కొల్లగొట్టి!

image

పారిస్: US జిమ్నాస్ట్ సైమన్ బైల్స్ రెండు బంగారు పతకాలు సాధించి అదరగొట్టారు. ఆల్ అరౌండ్ కేటగిరీలో (టీమ్, ఇండివిడ్యువల్) రాణించారు. బ్రెజిల్ అథ్లెట్ రెబెకాకు పోటీగా ఆమె చేసిన ప్రదర్శనపై ప్రశంసలు కురుస్తున్నాయి. 2016లో గోల్డ్ గెలిచిన బైల్స్ గాయంతో గత ఒలింపిక్స్‌కు దూరమయ్యారు. ఈ విజయంతో ఆమె ఖాతాలో ఒలింపిక్ గోల్డ్స్ సంఖ్య 6కు చేరింది. ఓ 27ఏళ్ల మహిళా జిమ్నాస్ట్ గోల్డ్ గెలవడం 72ఏళ్లలో ఇదే తొలిసారి. <<-se>>#Olympics2024<<>>

News August 2, 2024

YCPదే బలం.. విజయం ఎవరిదో?

image

AP: విశాఖ స్థానిక సంస్థల MLC <<13760138>>ఎన్నికలు<<>> ఆగస్టు 30న జరగనున్నాయి. మున్సిపల్ కౌన్సిలర్లు, ZPTC, MPTCలు, ఎక్స్‌అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం 841 ఓట్లు ఉన్నాయి. అందులో YCPకి 615 ఓట్ల బలం ఉంటే.. TDP-జనసేన-బీజేపీకి 215 ఓట్లు ఉన్నాయి. 11 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. YCP బలంగానే కనిపిస్తున్నా.. స్థానిక సంస్థల ప్రతినిధులు అధికార కూటమి వైపు మొగ్గుతారనే ప్రచారం నడుస్తోంది. దీంతో ఈ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది.

News August 2, 2024

ఏపీ మెట్రో రైలు ఎండీగా రామకృష్ణారెడ్డి

image

AP: మెట్రో రైలు ఎండీగా రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా రాష్ట్రంలో మెట్రో ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టి సారించింది. ముందుగా విశాఖలో ప్రజా రవాణా సౌకర్యాన్ని మెరుగుపర్చేందుకు మెట్రో రైలు నిర్మాణంపై ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇటీవల విశాఖ పర్యటనలో మెట్రో డిజైన్లు, డీపీఆర్, నిర్మాణ పనులపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు.

News August 2, 2024

టీజీ సెట్ పరీక్ష తేదీల్లో మార్పు

image

TG: రాష్ట్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు నిర్వహించే తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్-2024 పరీక్ష తేదీలు మారాయి. ఆగస్టు 28, 29, 30, 31 తేదీల్లో నిర్వహించాల్సి ఉండగా సెప్టెంబర్ 10 నుంచి 13 వరకు పరీక్షలుంటాయి. దరఖాస్తులు ఎడిట్ చేసుకునేందుకు 23, 24 తేదీల్లో అవకాశం ఉంటుంది. UGC NET సవరించిన పరీక్షల షెడ్యూల్‌‌ను ప్రకటించిన నేపథ్యంలో ఈ పరీక్షలను వాయిదా వేశారు.

News August 2, 2024

అవయవదానానికి అంగీకరిస్తూ మంత్రి సంతకం

image

AP: అవయవదానం చేసిన వారి అంత్యక్రియల్లో కలెక్టర్, SP పాల్గొని వీరవందనం చేసేలా మార్పులు తెస్తామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. విజయవాడలో జీవన్ దాన్‌పై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. తన అవయవదానానికి అంగీకరిస్తూ సంతకం చేశారు. ‘అవయవదానానికి మతాచారాలు అడ్డొస్తున్నాయని అంటున్నారు. ఏ దేవుడు అయినా పరులకు మంచి చేయమనే చెబుతాడు. వేల మందికి పునర్జన్మ ఇచ్చేందుకు ప్రజలు ముందుకు రావాలి’ అని పిలుపునిచ్చారు.

News August 2, 2024

Mutual Funds: అస్సలు చేయకూడని తప్పులివి

image

* స్పష్టమైన లక్ష్యం లేకపోవడం
* రిస్క్‌ను పట్టించుకోకపోవడం
* పరిస్థితులను బట్టి కాకుండా ఫండ్ గత ప్రదర్శన ఆధారంగా భవిష్యత్తు రాబడిని అంచనా వేయడం
* ట్యాక్సులు, రుసుములు, ఖర్చులు పట్టించుకోకపోవడం
* పర్యవేక్షణ లోపం, రీ బ్యాలెన్స్ చేయకపోవడం
* షార్ట్ టర్మ్ మార్కెట్ ట్రెండ్స్‌ అనుసరించడం
* మితిమీరిన డైవర్సిఫికేషన్ లేదా అస్సలు చేయకపోవడం
* భావోద్వేగంతో పెట్టుబడి పెట్టడం
* దీర్ఘకాల దృక్పథం, ఓర్పు లేకపోవడం

News August 2, 2024

ఎలక్టోరల్ బాండ్లపై విచారణకు సుప్రీం కోర్టు ‘నో’

image

ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్‌పై విచారణ కోసం SIT ఏర్పాటు చేయాలని దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఇందులో ప్రభుత్వాలు-ప్రైవేటు కంపెనీల మధ్య క్విడ్ ప్రో కో(ఇచ్చి పుచ్చుకోవడం) జరుగుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ పథకంలో భాగంగా దేశంలోని పలు పార్టీలకు ప్రైవేటు సంస్థలు భారీగా విరాళాలు ఇచ్చిన విషయం వెలుగులోకి రావడంతో ఈ ఆరోపణలు మొదలయ్యాయి.

News August 2, 2024

అన్నప్రసాదాల నాణ్యతపై దృష్టి: TTD ఈవో

image

AP: తిరుమలలో దళారీ వ్యవస్థ నిరోధానికి చర్యలు తీసుకుంటున్నామని EO శ్యామలరావు తెలిపారు. అన్నప్రసాదాల నాణ్యతపై దృష్టి సారించామన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీవాణి దర్శన టికెట్లు పరిమితం చేశామన్నారు. గతంలో సర్వదర్శనం టోకెన్లు నెలకు 1.07 లక్షల జారీ చేస్తే జులైలో 1.47 లక్షలు టోకెన్లు ఇచ్చామని చెప్పారు. కాగా ఇప్పటికే నాసిరకం నెయ్యి సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్‌ను TTD బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది.