India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ట్రంప్, కమల పోటీలో ఎవరు గెలిచినా భారత్, అమెరికా సంబంధాలు మరింత బలపడతాయని USISPF సీఈవో ముకేశ్ అఘి అన్నారు. US జియో పొలిటికల్ లక్ష్యాలు, చైనా దూకుడు నియంత్రణకు భారతే కీలకం అన్నారు. ‘నిజమే, చైనా సమీపంలో వియత్నాం, కాంబోడియా, థాయ్‌లాండ్ ఉన్నాయి. కానీ భారత్ చేకూర్చే ప్రయోజనం మరెక్కడా దొరకదు. సరఫరా గొలుసు అంతరాయాలు ఉండొద్దంటే వారే కీలకం. పైగా చాలా కంపెనీలకు అదే మార్కెట్‌గా మారింది’ అని ఆయన వెల్లడించారు.
వైద్యురాలిపై హత్యాచారం కేసులో పాలనా యంత్రాంగం వ్యవహరించిన తీరు అస్సలు బాగాలేదని బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ అన్నారు. ప్రజల్లో న్యాయం జరుగుతుందన్న నమ్మకం పోయిందని పేర్కొన్నారు. అందుకే తీవ్ర ఆందోళనలు జరుగుతున్నాయని వెల్లడించారు. ‘బెంగాల్లో తప్పు మీద తప్పు జరుగుతోంది. ప్రభుత్వం ప్రజలకు నమ్మకం కలిగించాలి. దోషులను శిక్షించాలి. చట్టం చేస్తే సరిపోదు. పక్కాగా అమలు చేయడం మరింత ముఖ్యం’ అని తెలిపారు.
ఈ ఏడాది చవితి తిథి సెప్టెంబర్ 6, 7 తేదీల్లో ఉంటుందని పండితులు తెలిపారు. అయితే ధృక్ సిద్ధాంతం ప్రకారం 7నే (శనివారం) వినాయక చవితి జరుపుకోవాలని సూచిస్తున్నారు. ఉ.11.03 గంటల నుంచి మ.1.30 గంటల మధ్యలో గణేశుడి విగ్రహ ప్రతిష్ఠాపనకు శుభ ముహూర్తం ఉందని పేర్కొన్నారు. సాయంత్రం 6.22 గంటల నుంచి రా.7.30 మధ్యలో వరసిద్ధి వినాయక వ్రత సంకల్పం చేసుకోవచ్చని చెబుతున్నారు.
AP: కృష్ణా నదిలో వరద తగ్గుతుండగా ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉప్పొంగుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుతం 12.2 అడుగుల వద్ద నీటి మట్టం ఉండగా, 10.39 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
AUSతో జరగనున్న 3 T20ల సిరీస్‌కు ENG కెప్టెన్‌గా ఫిల్ సాల్ట్ నియమితులయ్యారు. జోస్ బట్లర్ గాయం వల్ల దూరమవడంతో సాల్ట్‌కు అవకాశం దక్కింది. ఇతను 31 T20ల్లో 165.11 స్ట్రైక్ రేటుతో 885 రన్స్ చేశారు. ఈ నెల 11, 13, 15 తేదీల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి.
టీమ్: ఫిల్ సాల్ట్(C), ఆర్చర్, జాకబ్, బ్రైడన్, జోర్డాన్, సామ్ కరన్, హల్, జాక్స్, లివింగ్‌స్టోన్, సాకిబ్, మౌస్లీ, ఓవర్‌టన్, రషీద్, టోప్లీ, జాన్ టర్నర్
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులు మట్టి వినాయకులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచిస్తోంది. కొన్నిచోట్ల వివిధ వస్తువులతో తయారుచేసిన గణనాథులను సైతం ప్రతిష్ఠిస్తుంటారు. విశాఖపట్నంలోని గాజువాక ప్రాంతంలో మాత్రం ఇండియాలోనే తొలిసారి బెల్లంతో 75 అడుగుల ఎత్తులో భారీ గణపయ్యను రూపొందిస్తున్నారు. రాజస్థాన్ నుంచి స్పెషల్‌గా 20 టన్నుల బెల్లాన్ని తీసుకొచ్చారు. దీనికి రూ.50లక్షల వరకు ఖర్చయినట్లు తెలుస్తోంది.
ఉక్రెయిన్ వివాదంపై లక్ష్మణ రేఖను దాటొద్దని అమెరికాను రష్యా హెచ్చరించింది. వారికి ఆయుధాలు పంపిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని సంకేతాలిచ్చింది. ‘ఆయుధాల సరఫరాతో US సొంత గీత దాటింది. మేం గీత దాటితే ఎలా ఉంటుందో వాళ్లు అర్థం చేసుకోవాలి. అదెక్కడుందో వారికి బాగా తెలుసు. రష్యాతో పరస్పర సంయమనం కోల్పోతే వారికే ప్రమాదం. ఇప్పటికీ అక్కడ కాస్త తెలివైనోళ్లు ఉన్నారనుకుంటా’ అని రష్యా మంత్రి సెర్గీ లావ్రోవ్ అన్నారు.
AP: వరద బాధిత ప్రాంతాల్లో సెప్టెంబర్ నెల విద్యుత్ బిల్లుల వసూలు వాయిదా వేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ‘ప్రతి ఇంటికీ ఎలక్ట్రిషియన్, ప్లంబర్, మెకానిక్ అవసరం కాబట్టి వారు ఇష్టానుసారం వసూలు చేయకుండా చూస్తాం. ఒక ధర నిర్ణయిస్తాం. అవసరమైతే రాయితీ ఇస్తాం. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుంటే మనుషుల్ని పంపిస్తాం’ అని తెలిపారు.
AP: ఉమ్మడి పశ్చిమగోదావరి జడ్పీ ఛైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఆమె భర్త ప్రసాదరావు వైసీపీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు వైసీపీ చీఫ్ జగన్‌కు లేఖ పంపారు. జిల్లా అభివృద్ధి కోసం తాము జనసేనలో చేరనున్నట్లు ప్రకటించారు. ఇటీవల ఏలూరు జిల్లాలో మాజీ మంత్రి ఆళ్ల నాని, మేయర్ నూర్జహాన్ దంపతులు, 19 మంది కార్పొరేటర్లు వైసీపీని వీడిన విషయం తెలిసిందే.
TG: భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో 7వేల ఇళ్లు కూలిపోయాయని ప్రభుత్వానికి కలెక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు. కొన్ని పూర్తిగా, కొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయని తెలిపారు. దీంతో బాధితులకు ఇందిరమ్మ గృహాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కూలిన ఇళ్లలో ఎక్కువగా ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోనే ఉన్నాయి. ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కింద స్థలం ఉంటే ₹5లక్షలు, లేని వారికి స్థలం+₹5లక్షలు ఇస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది.
Sorry, no posts matched your criteria.