News March 5, 2025

సంప్రదాయమేనా? సర్‌ప్రైజ్ ఉంటుందా?

image

TG: కాంగ్రెస్‌లో MLA కోటా MLC పదవులకు రెడ్డి సామాజికవర్గం నుంచి ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సిట్టింగ్ MLC జీవన్ రెడ్డి పేర్లు విన్పిస్తున్నాయి. One Leader One Post నిర్ణయంతో నరేందర్‌ను, ఇప్పటికే చాలా ఛాన్సులు పొందారని జీవన్‌ను రెడ్డి నేతలు వ్యతిరేకిస్తున్నారు. సీనియార్టీ సంప్రదాయాన్ని కాదని OLOPతో పాటు యువరక్తంపై మొగ్గు చూపితే సామ రామ్మోహన్ రెడ్డి వంటి వారికీ సర్‌ప్రైజ్ ఛాన్స్ రావచ్చు.

Similar News

News April 13, 2026

ఎరువుల వాడకంలో నిపుణుల సూచనలు

image

వేసవిలో భూసార పరీక్షలు నిర్వహించి ఫలితాల ఆధారంగా సిఫార్సు చేసిన ఎరువులను వాడాలి. రసాయన ఎరువులతో పాటు సేంద్రియ, జీవన, పచ్చిరొట్ట పైర్ల ఎరువులను వాడటం వల్ల ఎరువుల సమతుల్యత జరిగి పంట దిగుబడి పెరుగుతుంది. నీటి నాణ్యత, పంటకాలం, పంటల సరళిని బట్టి ఎరువులను వేయాలి. సమస్యాత్మక భూముల్లో జిప్సం, సున్నం, పచ్చిరొట్ట ఎరువులు, సూక్ష్మపోషకాలను వేసి నేలలో లోపాలను సరిచేసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు

News April 13, 2026

తగ్గిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.380 తగ్గి రూ.1,52,460కు చేరింది. అలాగే 22 క్యారెట్ల పసిడి ధర రూ.350 పతనమై రూ.1,39,750 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ రేటు రూ.5వేలు తగ్గి రూ.2,60,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో కాస్త తేడాలుండొచ్చు.

News April 13, 2026

పందుల నుంచి పంటను కాపాడే ద్రావణం!

image

కొందరు రైతులు పందుల బారి నుంచి తమ పంటను రక్షించుకోవడానికి కుళ్లిన కోడిగుడ్లను నీటిలో కలిపి పంట చుట్టూ చల్లుతున్నారు. ఈ ద్రావణం నుంచి వచ్చే సల్ఫర్ వాసన పందులకు చాలా అసహ్యంగా అనిపించడంతో పాటు పంట సహజ వాసనను వాటికి రానివ్వదు. దీంతో పందులు ఆ ప్రాంతానికి రావడానికి ఇష్టపడవని నిపుణులు చెబుతున్నారు. అయితే వర్షం పడినా లేదా వారం తర్వాత వాసన తగ్గిపోతే ఈ ద్రావణాన్ని పొలం చుట్టూ మళ్లీ చల్లాల్సి ఉంటుంది.