India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: ACA (ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్) అధ్యక్షుడు శరత్‌చంద్రారెడ్డి నాయకత్వంలోని అపెక్స్ కౌన్సిల్ మూకుమ్మడిగా రాజీనామా చేసింది. దీంతో ACAను రాజకీయాలకు అతీతంగా ప్రక్షాళన చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. TDP MP కేశినేని చిన్ని ACA ప్రక్షాళన పనులు చూస్తున్నారట. ఈ నెల 4న విజయవాడలో జరిగే SGMలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. MSK ప్రసాద్, JC పవన్ ACAలో కీలకంగా వ్యవహరించనున్నట్లు సమాచారం.
TG: రాష్ట్రంలోని 10,954 గ్రామాల్లో జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ల(JRO)ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఈ సేవలు అందించేందుకు VRO, VRAలు ఉండేవారు. గత సర్కార్ ఆ వ్యవస్థలను పూర్తిగా రద్దు చేసి వారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేసింది. ఇప్పుడు వారినే కాంగ్రెస్ ప్రభుత్వం JROలుగా నియమించనుంది. దీనివల్ల ఆర్థిక భారం తప్పడంతో పాటు కొత్తగా నియామక ప్రక్రియ చేపట్టాల్సిన అవసరం ఉండదు.
లావణ్య తమను ఇబ్బందులకు గురిచేస్తోందని నటుడు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు మాదాపూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. తమ ఇద్దరికీ పలు అనారోగ్య సమస్యలున్నాయని తెలిపారు. ఆమె తమ ఇంటికి వచ్చి తలుపులు బాది, కేకలు వేసి న్యూసెన్స్ చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. లావణ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశారని లావణ్య ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
AP: రైతుల కోసం నేటి నుంచి సూక్ష్మసేద్య పథకం మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైతు తన వాటా డబ్బు చెల్లిస్తే, వెంటనే పరికరాలు బిగించేలా కొత్త పథకాన్ని అమలు చేయనుంది. ఈ ఏడాది 2.50 లక్షల ఎకరాల్లో సూక్ష్మసేద్యం అమలుకు తొలుత అధికారులు నిర్ణయించారు. ఉద్యాన రంగాన్ని ప్రోత్సహించాలన్న CM ఆదేశాలతో 7.50 లక్షల ఎకరాలకు పెంచారు. పరికరాలు సమకూర్చేలా 33 కంపెనీల ప్రతినిధులతో అధికారులు భేటీ అయ్యారు.
ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్ల పాటు నిర్విరామంగా ఎన్నో పోరాటాలు చేసిన MRPS అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు. ‘ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్లు తగ్గిపోతున్నాయి. ప్రైవేట్ వ్యవస్థలో అవకాశాలు పెరిగిపోతున్నాయి. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాల్సి ఉంది. అణగారిన వర్గాల హక్కులను పరిరక్షించేలా ఎస్సీ, ఎస్టీ, బీసీవర్గాల ప్రయోజనాల కోసం పనిచేద్దాం’ అని ఆయన పిలుపునిచ్చారు.
AP: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు ఆయనను ఏ1 ముద్దాయిగా చేర్చారు. ప్రస్తుతం వంశీ తన కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్‌లో నివసిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయనను అరెస్ట్ చేయడానికి మూడు స్పెషల్ టీమ్స్ హైదరాబాద్ వెళ్లినట్లు సమాచారం. మరోవైపు వంశీ అమెరికా వెళ్లిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో నెలకొని ఉంది శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి పచ్చమాత ఆలయం. మూలవిరాట్టు ఉదయం తెల్లగా, మధ్యాహ్నం పసుపుగా, సాయంత్రం నీలంగా కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని 7 శుక్రవారాలు దర్శించుకుంటే ఆర్థిక బాధలన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఇప్పుడున్న ఆలయాన్ని 1100 ఏళ్ల క్రితం గోండ్వానా పాలకులు నిర్మించారని స్థానికులు చెబుతున్నారు. అమ్మవారి పాదాలపై సూర్యకిరణాలు పడుతుండటం ఇక్కడి మరో విశేషం.
తెలంగాణలో 2 రోజులు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఏపీలో మన్యం, అల్లూరి, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, రాయలసీమ జిల్లాల్లో నేడు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని APSDMA హెచ్చరించింది.
దేశంలోని 36 రాష్ట్రాలు/UTలలో 31 జీఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్ బెంచ్‌లను ఏర్పాటు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులిచ్చింది. ఏపీలో విజయవాడ కేంద్రంగా బెంచ్, విశాఖలో సర్క్యూట్ బెంచ్ ఉండనుంది. తెలంగాణకు హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తారు. గోవా, మహారాష్ట్రకు 3, యూపీకి 3, గుజరాత్, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు, బెంగాల్‌లకు రెండు చొప్పున, మిగిలిన రాష్ట్రాలకు ఒక్కో బెంచ్ ఉంటుంది.
SC, ST వర్గీకరణపై <<13751609>>తీర్పు<<>> ఇస్తూ జస్టిస్ గవాయి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కొందరే రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నారు. ఈ రిజర్వేషన్లకూ క్రిమీలేయర్ వర్తింపజేయాలి. వీరిలో సంపన్నులను గుర్తించి, రిజర్వేషన్ల నుంచి తప్పించేలా విధానం రూపొందించాలి. రిజర్వేషన్‌తో అత్యున్నత స్థానాలకు చేరినవారు సొంతంగా ప్రయోజనాలు వదులుకోవాలి. వారికి, వారి పిల్లలకూ రిజర్వేషన్లు వర్తిస్తే మిగతా వారికి ఫలాలు అందవు’ అని అభిప్రాయపడ్డారు.
Sorry, no posts matched your criteria.