News August 2, 2024
ఇకపై గ్రామాల్లో జూనియర్ రెవెన్యూ ఆఫీసర్లు
TG: రాష్ట్రంలోని 10,954 గ్రామాల్లో జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ల(JRO)ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఈ సేవలు అందించేందుకు VRO, VRAలు ఉండేవారు. గత సర్కార్ ఆ వ్యవస్థలను పూర్తిగా రద్దు చేసి వారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేసింది. ఇప్పుడు వారినే కాంగ్రెస్ ప్రభుత్వం JROలుగా నియమించనుంది. దీనివల్ల ఆర్థిక భారం తప్పడంతో పాటు కొత్తగా నియామక ప్రక్రియ చేపట్టాల్సిన అవసరం ఉండదు.
Similar News
News December 13, 2024
జేసీబీ వ్యాఖ్యల ఎఫెక్ట్.. సిద్ధార్థ్ మూవీకి షాక్?
హీరో సిద్ధార్థ్ నటించిన ‘మిస్ యూ’ ఈరోజు రిలీజైంది. తమిళనాడులో ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తున్నా తెలంగాణలో మాత్రం టికెట్స్ కొనుగోలు జరగట్లేదని సినీవర్గాలు పేర్కొన్నాయి. హైదరాబాద్ సిటీ అడ్వాన్స్ బుకింగ్స్‌లో నిన్నటి వరకు కేవలం 50 టికెట్లే బుక్ అయినట్లు వెల్లడించాయి. సుదర్శన్‌లో 5 టికెట్లు బుక్కయ్యాయి. ‘పుష్ప-2’ ఈవెంట్‌పై ఆయన చేసిన<<14838054>> జేసీబీ<<>> వ్యాఖ్యలే దీనికి కారణం అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
News December 13, 2024
BREAKING: RBI హెడ్ క్వార్టర్స్‌కు బాంబు బెదిరింపులు
ముంబైలోని ఆర్బీఐ ప్రధాన కార్యాలయాన్ని పేల్చివేస్తామంటూ ఆగంతుకులు బెదిరించారు. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్‌కు బెదిరింపు మెయిల్ చేశారు. రష్యన్ భాషలో ఈ మెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలోని పలు స్కూళ్లకు కూడా ఇవాళ వరుస బాంబు బెదిరింపులు వచ్చాయి. వీటన్నింటిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News December 13, 2024
నేడు భారీ వర్షాలు
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దక్షిణ తమిళనాడు వద్ద గురువారం అర్ధరాత్రి తీరం దాటింది. కాగా, ఇవాళ ఉదయం బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో నేడు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయంది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడే అవకాశమున్నట్లు పేర్కొంది. అటు, అల్పపీడనం తీరం దాటిన సందర్భంగా TNలో భారీ వర్షాలు పడుతున్నాయి.