India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహారాష్ట్రలో ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీని హత్య చేసిన షూటర్స్‌లో ఒకడైన UPకి చెందిన ధర్మరాజ్ రాజేశ్ కశ్యప్ గురించి ఆసక్తికర విషయం తెలిసింది. అతను టెన్త్ క్లాస్‌లో 78శాతం మార్కులు సాధించినట్లు ధర్మరాజ్ సోదరుడు తెలిపారు. నాడు ధర్మరాజ్‌ను మెడిసిన్ చదివించాలని తల్లిదండ్రులు భావించినట్లు చెప్పాడు. అయితే గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ను చూసి ఆకర్షితుడయ్యాడని, డబ్బు కోసం తప్పుదారి పట్టాడని పేర్కొన్నారు.
TG: కాంగ్రెస్ MLC జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు గంగారెడ్డిని <<14421491>>హత్య<<>> చేసిన నిందితుడు సంతోష్ జగిత్యాల గ్రామీణ PSలో చేసిన రీల్ వైరల్‌గా మారింది. దీనిపై కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. అయితే ఆ వీడియో గతంలోనిదని పోలీసులు వివరణ ఇచ్చారు. తనకు ప్రాణహాని ఉందని గంగారెడ్డి ఫిర్యాదు చేసినా సంతోష్‌తో ఉన్న సన్నిహిత సంబంధాలతో పోలీసులు పట్టించుకోలేదని INC నేతలు ఆరోపించారు. అందుకు ఈ వీడియోనే సాక్ష్యమని మండిపడ్డారు.
తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం బలపడి తుఫాన్‌గా మారింది. ఇది రేపటికి తీవ్ర తుఫాన్‌గా రూపాంతరం చెందనుంది. ప్రస్తుతం గంటకు 18కి.మీ వేగంతో ఇది కదులుతోందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ సైక్లోన్‌కు ‘దానా’గా నామకరణం చేశారు. విశాఖ తూర్పు ఆగ్నేయ దిశగా 724కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.
రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఇండస్ట్రీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు విషెస్ తెలుపుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆ కట్ అవుట్ చూసి అన్నీ నమ్మేయాలి డ్యూడ్. అతను ప్రేమించే పద్ధతి చూసి, తిరిగి అమితంగా ప్రేమించేస్తాం. హ్యాపీ బర్త్ డే డార్లింగ్ ప్రభాస్. మీకు ఈ ఏడాది మరింత ప్రేమ, కీర్తి, సంతోషం లభించాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు.
మన దగ్గర ఎన్నికల ప్రచారానికి వెళితే బీరు, బిర్యానీ, డబ్బు ఇస్తారనేది ఏ పార్టీ ఒప్పుకోకపోయినా అదే నిజం. అయితే అమెరికాలో మాత్రం కాస్త భిన్నంగా ఉంటుందని అక్కడి భారతీయులంటున్నారు. ప్రచారానికి వచ్చిన వారికి భోజనం, ప్రయాణ ఖర్చులు ఇస్తారని చెబుతున్నారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లి డబ్బు తీసుకోవాలనే ఆలోచన ఎవరికీ ఉండదంటున్నారు. పైగా ‘ఫండ్ రైజింగ్ మీటింగ్స్’ పేరుతో జనాల నుంచే డబ్బు తీసుకుంటారంటున్నారు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి మహ్మద్ షమీ అందుబాటులో లేకపోతే అతని స్థానంలో మయాంక్ యాదవ్‌ను తీసుకోవాలని మాజీ క్రికెటర్ బ్రెట్‌లీ సూచించారు. ‘150kmph+ వేగంతో వేసే బౌలర్‌ను ఏ బ్యాటర్ ఎదుర్కోలేరు. IPLలో యంగ్ బౌలర్లను దగ్గరుండి చూశా. మయాంక్ తన మొదటి IPLలోనే 157kmph వేగంతో వేశాడు. 135-140kmphతో వచ్చే బంతులు ఓకే కానీ 150kmph వేగాన్ని బ్యాటర్ ఫేస్ చేయలేడు. షమీకి సరైన రిప్లేస్‌మెంట్ మయాంకే’ అని అభిప్రాయపడ్డారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘దానా’ తుఫాను వల్ల దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని IMD ఇప్పటికే హెచ్చరించింది. ఆ తుఫానుకు దానా అని నామకరణం చేసిన దేశం ఖతర్. ప్రపంచ వాతావరణ సంస్థ(WMO) రూపొందించిన ఉష్ణమండల తుఫాను నామకరణ విధానం ప్రకారం ఖతర్ ఈ పేరు పెట్టింది. దానా అనే పదానికి అరబిక్‌లో ‘ఉదారత’ అని అర్థం.
AP: కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులో డ్రోన్ హబ్ ఏర్పాటు చేయడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయని ప్రభుత్వం చెబుతోంది. ఈ డ్రోన్ రంగంలో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులు, 12,500 మందికి ఉపాధి కల్పించేలా ముసాయిదా డ్రోన్ పాలసీని ప్రకటించింది. దీనిపై కూటమి పార్టీలు, నిపుణుల సూచనలు తీసుకొని అవసరమైతే మార్పులు చేస్తామంది. నవంబర్ వరకు ఫైనల్ పాలసీని తీసుకొస్తామని చెప్పింది.
AP: దీపావళి నుంచి ప్రారంభించే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై TDP కీలక ప్రకటన చేసింది. ‘ఏటా 3 గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచితంగా ఇస్తారు. ఈ నెల 24 నుంచి బుకింగ్ మొదలవుతుంది. 31 నుంచి సరఫరా చేస్తారు. ఒక్కో సిలిండర్‌పై రూ.851 రాయితీ ప్రభుత్వం చెల్లిస్తుంది. 2 రోజుల్లోనే వినియోగదారుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బు జమ అవుతుంది’ అని ఓ ఫొటోను పంచుకుంది. అటు ఇవాళ్టి క్యాబినెట్ భేటీలో ప్రభుత్వం దీనిపై ప్రకటన చేయనుంది.
ఒంటరితనంతో ప్రస్తుత రోజుల్లో ఎంతో మంది బాధపడుతున్నారు. ఉద్యోగాలు చేస్తున్న యువత సైతం దీని బారిన పడుతున్నారు. అయితే ఇలా సామాజిక సంబంధాలు సరిగా లేక అసంతృప్తితో బతికేవారు డిమెన్షియా బారిన పడే అవకాశం 30% పెరిగిందని పరిశోధనలో తేలింది. 6 లక్షల మందిపై జరిపిన అధ్యయనంలో శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని తేల్చారు. డిమెన్షియాతో వ్యక్తి ఆలోచనలు, జ్ఞాపకశక్తి, నిర్ణయాలు తీసుకోవడం వంటివి ప్రభావితం అవుతాయని తెలిపారు.
Sorry, no posts matched your criteria.