News October 23, 2024

‘దానా’ తుఫాను.. ఆ పేరెవరు పెట్టారంటే?

image

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘దానా’ తుఫాను వల్ల దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని IMD ఇప్పటికే హెచ్చరించింది. ఆ తుఫానుకు దానా అని నామకరణం చేసిన దేశం ఖతర్. ప్రపంచ వాతావరణ సంస్థ(WMO) రూపొందించిన ఉష్ణమండల తుఫాను నామకరణ విధానం ప్రకారం ఖతర్ ఈ పేరు పెట్టింది. దానా అనే పదానికి అరబిక్‌లో ‘ఉదారత’ అని అర్థం.

Similar News

News November 3, 2024

హెజ్బొల్లాకు మరో షాక్ ఇచ్చిన ఇజ్రాయెల్

image

హెజ్బొల్లా కీలక సభ్యుడు జాఫర్ ఖాదర్ ఫార్‌ను దక్షిణ లెబనాన్‌లో మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. హెజ్బొల్లాకు చెందిన నాసర్ బ్రిగేడ్ రాకెట్, మిస్సైల్స్ యూనిట్‌కు జాఫర్ టాప్ కమాండర్‌‌గా ఉన్నట్లు తెలిపింది. గతంలో ఇజ్రాయెల్‌పై జరిగిన మిస్సైల్స్ దాడుల వెనుక ఇతడే ఉన్నట్లు పేర్కొంది. కాగా ఇటీవల హెజ్బొల్లా చీఫ్‌లుగా పనిచేసిన ఇద్దరిని IDF హతమార్చిన విషయం తెలిసిందే.

News November 3, 2024

జార్ఖండ్‌లో ఇండియా కూటమి సీట్ల షేరింగ్ ఇలా..

image

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇండియా కూటమి మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. CM హేమంత్ సోరెన్ నేతృత్వంలోని JMM 43, కాంగ్రెస్ 30, RJD 6, వామపక్షాలు 3 చోట్ల పోటీ చేయనున్నాయి. షేరింగ్ ఫార్ములా ప్రకారం ధన్వర్, చత్రాపూర్, విశ్రంపూర్ స్థానాల్లో ఇండియా కూటమి పార్టీల మధ్య స్నేహపూర్వక పోటీ ఉండనుంది. మొత్తం 82 సీట్లున్న జార్ఖండ్ అసెంబ్లీకి ఈనెల 13, 20న రెండు విడతల్లో ఎలక్షన్స్ జరగనున్నాయి.

News November 3, 2024

వదిలేసిన ఆటగాళ్లను మళ్లీ దక్కించుకుంటాం: LSG కోచ్

image

గత IPL సీజన్‌లో తమ టీమ్ తరఫున ఆడిన ప్లేయర్స్‌లో చాలామందిని మళ్లీ వేలంలో దక్కించుకునేందుకు ప్రయత్నిస్తామని LSG కోచ్ జస్టిన్ లాంగర్ తెలిపారు. ఎన్నో చర్చలు, జాగ్రత్తల తర్వాతే రిటెన్షన్ లిస్ట్ తయారు చేశామని చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో అత్యంత ప్రతిభావంతులైన ప్లేయర్లను రిటైన్ చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. కాగా పూరన్‌తో పాటు రవి బిష్ణోయ్, మయాంక్, మోసిన్ ఖాన్, బదోనీని LSG అట్టిపెట్టుకుంది.