India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP:భూగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటుకు రూ.1194 కోట్లతో టెండర్ దక్కించుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు APEPDCL నోటీసులు ఇచ్చింది. టెండర్ దక్కించుకుని ఏడాది గడుస్తున్నా పనులు మొదలు పెట్టకపోవడంపై ప్రశ్నించింది. నెలలో పనులు ప్రారంభించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించింది. కాగా నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తవకపోతే కేంద్రం గ్రాంట్ నిలిచిపోతుందని అధికారులు తెలిపారు.
TG: రాష్ట్రంలో స్త్రీలకు భద్రత కరవైందని, వరుస అత్యాచారాలు ఆందోళన కలిగిస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీలో చర్చించి 48 గంటలైనా గడవక ముందే 4 అత్యాచారాలు జరిగాయన్నారు. ఇవి ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటనలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా ఆపాలని ఆమె సూచించారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ నుంచి హీరోయిన్ కియారా అద్వానీ పోస్టర్ విడుదలైంది. ఆమె బర్త్‌డే సందర్భంగా మూవీ యూనిట్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. శంకర్ రూపొందిస్తున్న ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఎస్‌జే సూర్య, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు టాక్.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నూతన ఛైర్ పర్సన్‌గా ప్రీతి సుదాన్ నియమితులయ్యారు. ఈమె 1983 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అఫీసర్. గతంలో ఆమె యూపీఎస్సీ సభ్యురాలిగా ఉన్నారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ కార్యదర్శితోపాటు వివిధ పదవులు నిర్వర్తించారు.
TG: 2014లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.369 కోట్ల మిగులుతో బీఆర్ఎస్‌కు రాష్ట్రాన్ని అప్పగించిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తాము కాంగ్రెస్‌కు రూ.5,944 కోట్ల రెవెన్యూ మిగులుతో అప్పగించినట్లు అసెంబ్లీలో తెలిపారు. బడ్జెట్‌లో మిగులు ఉందని చెబుతూనే జీతాలకు అప్పులు తెస్తున్నామని ఆర్థికమంత్రి చెబుతున్నారని అన్నారు. మంత్రుల మాటలు తప్పో.. బడ్జెట్‌లోని లెక్కలు తప్పో.. స్పష్టం చేయాలని ఆయన కోరారు.
వాహనం కొన్న 90 రోజుల్లో రిజిస్ట్రేషన్, ఛాసిస్ నంబర్లను ఫాస్టాగ్ నంబర్‌తో అప్‌లోడ్ చేయాలి. లేదంటే ఫాస్టాగ్ హిట్‌లిస్టులో ఉంటుంది. ఆ తర్వాత 30 రోజుల గడువులోనూ చేయకపోతే బ్లాక్‌లిస్టులో పెడతారు. 3 నుంచి ఐదేళ్ల క్రితం జారీ చేసిన అన్ని ఫాస్టాగ్స్‌కి KYC పూర్తి చేయాలి. KYC చేస్తున్నప్పుడు వాహనం ముందు, పక్కవైపు ఫొటోలు స్పష్టంగా అప్‌లోడ్ చేయాలి. ఇందుకోసం అక్టోబర్ 31 వరకు సదరు సంస్థలకు NPCI సమయం ఇచ్చింది.
కేరళ విపత్తులో వయనాడ్‌లోని చూరల్మల గ్రామం పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. దీనికి ప్రధాన కారణం ఆ గ్రామానికి కొద్ది దూరంలోని ముండక్కైలో కొండ చరియలు విరిగిపడటమే. దీంతో ఆ ప్రాంతంలో ప్రవహిస్తున్న ఎరువఝంజీ నది భారీ వర్షాలకు ఉప్పొంగి తన దిశను మార్చుకుంది. ఈ క్రమంలో తన దారిలో వచ్చిన గ్రామంతో సహా అన్నింటినీ ధ్వంసం చేసింది. ఈ బీభత్సానికి అడుగుల మేర బురద పేరుకుపోగా, అక్కడక్కడా శిథిలాలు మిగిలాయి.
AP: విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల MLC ఉపఎన్నిక స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. గతంలో MLCగా గెలిచిన వంశీకృష్ణ శ్రీనివాస్‌పై అనర్హత వేటు పడటంతో ఈ స్థానం ఖాళీ అయ్యింది. ఆగస్టు 6న నోటిఫికేషన్ రానుండగా, ఆగస్టు 13 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 14న పరిశీలన, 16న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. అదే నెల 30న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు బై ఎలక్షన్ జరగనుంది.
టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరో ఘనత సాధించారు. టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు అందుకున్న రెండో ప్లేయర్‌గా స్కై (5) నిలిచారు. ఈ క్రమంలో బాబర్ ఆజమ్, షకీబ్, వార్నర్(5)ను సమం చేశారు. శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో ఆయన ఈ ఘనత సాధించారు. అగ్ర స్థానంలో కోహ్లీ (7) ఉన్నారు. కాగా నిన్నటి మ్యాచ్‌లో సూర్య బౌలింగ్‌లో అదరగొట్టారు. చివరి ఓవర్‌లో 2 వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పారు.
TG: అంగన్‌వాడీ టీచర్లు, కార్యకర్తలకు మంత్రి సీతక్క గుడ్ న్యూస్ చెప్పారు. రిటైరయ్యే టీచర్లకు ప్రస్తుతం రూ.లక్ష ఇస్తుండగా, ఇకపై రూ.2 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే కార్యకర్తలకు రూ.50వేల నుంచి రూ.లక్షకు పెంచి ఇస్తామని వెల్లడించారు. ప్రతిపాదనలకు ఇప్పటికే ఆర్థిక శాఖకు పంపినట్లు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.