India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తన జీవితమంతా నటనకే అంకితమని హీరోయిన్ జాన్వీకపూర్ అన్నారు. తొలి సినిమా నుంచి ఇప్పటి వరకు ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తాను రిస్క్‌తో కూడిన పాత్రలను ఎంచుకోవడానికి ఇష్టపడుతానన్నారు. అందులో తన నటన చూసి ఆశ్చర్యపోవాలని అనుకుంటానని చెప్పారు. ప్రతి సినిమాలో దర్శకుడు కోరుకునేది 100శాతం ఇవ్వడానికి ప్రయత్నిస్తానని పేర్కొన్నారు.
TG: పట్టాదారు పాస్‌బుక్ లేకున్నా రుణమాఫీ వర్తిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. అలాంటి రైతుల ఇళ్ల వద్దకే అధికారులు వెళ్లి వివరాలు సేకరిస్తారని తెలిపారు. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు లోన్లు తీసుకున్న వారికి మాఫీ వర్తిస్తుందన్నారు. గత ప్రభుత్వం పంట వేయని భూములకు రూ.25వేల కోట్లు మాఫీ చేసిందని విమర్శించారు. అటు పంట వేసిన వారికే రైతు భరోసా ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈజిప్టుకు చెందిన ఫెన్సర్ నడా హఫీజ్ ఏడు నెలల గర్భంతో ఒలింపిక్స్ బరిలో నిలిచారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలిపారు. సోమవారం జరిగిన పోటీల్లో అమెరికా ఫెన్సర్ ఎలిజబెత్ టార్టకోవ్స్కీపై గెలిచి ప్రీక్వార్టర్స్‌కు ప్రవేశించారు. కానీ అక్కడ సౌత్ కొరియా ఫెన్సర్ జోన్ హయూంగ్ చేతిలో ఓటమిపాలయ్యారు. కాగా 26 ఏళ్ల నడా ఇప్పటివరకు మూడుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు. ఆమె మాజీ జిమ్నాస్ట్ కూడా.
<<-se>>#Olympics2024<<>>
కేరళలోని వయనాడ్‌లో భారీ వర్షాలు, వరదల్లో 600 మంది వలస కార్మికుల ఆచూకీ గల్లంతైంది. ముండక్కైలో ఉన్న తేయాకు, కాఫీ తోటల్లో పనిచేసేందుకు వీరంతా బెంగాల్, అస్సాం నుంచి వచ్చారు. హారిసన్ మలయాళీ ప్లాంటేషన్ లిమిటెడ్‌లో పనిచేస్తున్న వీరి ఆచూకీ తెలియడం లేదని సంస్థ GM బెనిల్ తెలిపారు. మొబైల్ నెట్‌వర్క్ పనిచేయకపోవడంతో వారిని సంప్రదించలేకపోతున్నామన్నారు. ఆ ప్రాంతంలో 65 గృహాలు కొట్టుకుపోయినట్లు సమాచారం.
పలు దేశాల్లోని అఫ్గాన్ రాయబార కార్యాలయాలతో తమకు సంబంధం లేదని తాలిబన్లు తేల్చిచెప్పారు. గత సర్కారు పాలనలో వాటి నుంచి జారీ చేసిన వీసాలు, పాస్‌పోర్టులు, పత్రాలను తాము అనుమతించమని స్పష్టం చేశారు. విదేశాల్లోని అఫ్గాన్ పౌరులు అక్కడి ‘ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గానిస్థాన్’ కార్యాలయాలను సంప్రదించాలని సూచించారు. 2021లో తాలిబన్ల పాలన మొదలైనా ఇప్పటి వరకు వారిని ఏ దేశమూ అధికారికంగా గుర్తించలేదు.
HYD మెట్రో ప్రయాణికులకు నిరాశే ఎదురైంది. ఇవాళ్టి నుంచి ఉ.5.30 గంటలకే మెట్రో సేవలు ప్రారంభం అవుతాయని అధికారులు చెప్పినా, క్షేత్రస్థాయిలో అమలు కాలేదు. ఇవాళ ఉ.6 గంటల తర్వాతే నాగోల్‌లో తొలి రైలు బయల్దేరింది. ఉ.5.40 తర్వాతే మెట్రో సిబ్బంది విధులకు హాజరయ్యారు. టైమింగ్స్ మార్పుపై తమకు అధికారిక ఆదేశాలు రాలేదని సిబ్బంది చెబుతున్నారు. అటు ఉ.5.30కే రైళ్లు స్టార్ట్ చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
TG: కాంగ్రెస్ వచ్చాక రైతుల ఆత్మహత్యలు పెరిగాయని BRS MLA పల్లా రాజేశ్వరరెడ్డి ఆరోపించారు. వాటిపై మంత్రులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘వరి విస్తీర్ణంలో 2014లో 14వ స్థానంలో ఉన్న తెలంగాణను మా హయాంలో నంబర్ వన్ చేశాం. వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ ఇప్పుడు కేవలం సన్నాలకు మాత్రమే ఇస్తామంటోంది. రుణమాఫీకి రూ.41 వేల కోట్లని చెప్పి బడ్జెట్‌లో రూ.25వేల కోట్లు పెట్టింది’ అని మండిపడ్డారు.
TG: ఆగస్టు 5 నుంచి 13 వరకు గ్రామాల్లో ‘స్వచ్ఛదనం-పచ్చదనం’ పేరుతో పారిశుద్ధ్యం, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామని మంత్రి సీతక్క అసెంబ్లీలో ప్రకటించారు. గ్రామాలకు నిధులు ఇవ్వడం లేదన్న BRS ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలను ఆమె ఖండించారు. తాము అధికారంలోకి వచ్చాక గ్రామ పంచాయతీలకు రూ.378 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వం నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు కేటాయించలేదని దుయ్యబట్టారు.
AP: ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ కమిటీల ఎన్నికలకు విద్యాశాఖ షెడ్యూల్ ప్రకటించింది. పేరెంట్స్ కమిటీల పదవీకాలం పూర్తవడంతో ఎన్నికకు చర్యలు తీసుకోవాల్సిందిగా విద్యాశాఖ కార్యదర్శి శశిధర్ ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టు 1న ఛైర్మన్, వైస్ ఛైర్మన్, సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసి ఓటర్ల జాబితా ప్రకటించాలని ఆదేశించారు. 8న కమిటీ సభ్యుల ఎన్నిక, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎంపిక చేపట్టాలని పేర్కొన్నారు.
TG: భూమిని మాత్రమే నమ్ముకున్న రైతులు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నారని CPI MLA కూనంనేని సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పిల్లలకు పెళ్లిళ్లు కావడం కష్టంగా ఉందని, దీనిపై అన్నదాతల వ్యథలు వర్ణనాతీతమన్నారు. తెలంగాణలోనూ ఈ పరిస్థితికి కారణమేంటో పరిశీలించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి ఆయన సూచించారు. అటు సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల <<13739164>>సమస్యలనూ<<>> సభలో ప్రస్తావించారు.
Sorry, no posts matched your criteria.