news

News July 30, 2024

మనూ భాకర్‌ను అభినందించిన PM, AP CM

image

పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన భారత షూటర్ మనూ భాకర్‌ను PM మోదీ, ఏపీ CM చంద్రబాబు అభినందించారు. ఈ విజయం ఆమె అంకిత భావానికి నిదర్శమని మోదీ ప్రశంసించారు. 10M ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ విభాగంలో సరబ్‌జోత్‌తో కలిసి మనూ కాంస్యం గెలవడం అభినందనీయమన్నారు. అటు 124ఏళ్ల చరిత్రలో ఓ భారత ఒలింపియన్ ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించడం ఇదే తొలిసారి అని CBN కొనియాడారు.

News July 30, 2024

విద్యుత్ కమిషన్ ఛైర్మన్‌గా లోకుర్

image

TG: విద్యుత్ కమిషన్ ఛైర్మన్‌గా జస్టిస్ మదన్ బీ లోకుర్‌ను ప్రభుత్వం నియమించింది. గత ఛైర్మన్ జస్టిస్ <<13639787>>నర్సింహారెడ్డి<<>> ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని BRS అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆయన స్థానంలో కొత్త వారిని నియమించాలని సుప్రీం కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం తాజాగా లోకుర్‌ను నియమించింది. గతంలో ఏపీ హైకోర్టు సీజేగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆయన పనిచేశారు.

News July 30, 2024

రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లేనట్లేనా?: షర్మిల

image

AP: ప్రతి ఒక్కరూ ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల అన్నారు. ‘కూటమి సర్కారు ఆరోగ్యశ్రీని నిలిపివేసే ఆలోచన చేస్తుందా? రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లేనట్లేనా? పెండింగ్ బిల్లులపై ఎందుకు నిర్లక్ష్యం?’ అని Xలో ప్రశ్నల వర్షం కురిపించారు. రూ.1,600 కోట్ల బకాయిలు విడుదల చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.

News July 30, 2024

స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు

image

దేశవ్యాప్తంగా నిన్న పెరిగిన గోల్డ్ రేట్స్ ఇవాళ కాస్త తగ్గాయి. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.210 తగ్గి రూ.68,950కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.200 తగ్గి రూ.63,200గా నమోదైంది. సిల్వర్ రేట్ కూడా కేజీకి రూ.500 దిగి రూ.84,500కు చేరింది. హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని మిగతా ప్రాంతాల్లోనూ ఇవే ధరలున్నాయి.

News July 30, 2024

ఆ రూ.15 వేల కోట్లు అప్పే: జీవీఎల్

image

AP: అమరావతి నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన రూ.15 వేల కోట్లు అప్పేనని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు తెలిపారు. కానీ ఆ అప్పును కేంద్రం చెల్లిస్తుందా? రాష్ట్రం చెల్లిస్తుందా అనే దానిపై క్లారిటీ లేదని చెప్పారు. ఈ అప్పు తీర్చేందుకు కనీసం 30 ఏళ్లు పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా ఇటీవల ప్రకటించిన కేంద్ర బడ్జెట్‌లో అమరావతి నిర్మాణానికి కేంద్రం రూ.15 వేల కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే.

News July 30, 2024

అతివేగంగా వెళ్లే వారిపై FIR.. ఎక్కడంటే?

image

అతివేగంగా వాహనాన్ని నడిపి ప్రమాదాలకు కారణం అవుతున్న వారిపై కేసులు నమోదు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధమైంది. ఆగస్టు 1 నుంచి రాష్ట్రంలో ఎక్కడైనా 130KMPH వేగాన్ని మించి డ్రైవింగ్ చేసిన వారిపై FIR నమోదు చేయనున్నారు. 90 శాతం రోడ్డు ప్రమాదాలు అతివేగం కారణంగానే జరుగుతున్నాయని ADG అలోక్ కుమార్ తెలిపారు.

News July 30, 2024

మినిమమ్ బ్యాలెన్స్ ఫైన్.. ₹8500 కోట్లు పొందిన PSBలు

image

అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయనందుకు బ్యాంకులు జరిమానా విధిస్తుంటాయి. 2020-2024 మధ్య ప్రభుత్వ రంగ బ్యాంకులు (PSB) పెనాల్టీ ద్వారా రూ.8500 కోట్లు పొందినట్లు లోక్‌సభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. FY2023-24లో అధికంగా రూ.2331 కోట్లు పెనాల్టీల రూపంలో PSBలు పొందాయి. 2020 తర్వాత అతిపెద్ద బ్యాంకు SBI దీనిని తొలగించినప్పటికీ ఇతర బ్యాంకుల వసూళ్లు 34% పెరగడం గమనార్హం.

News July 30, 2024

నేను పార్టీ మారలేదు: బండ్ల

image

TG: తిరిగి బీఆర్ఎస్‌లో <<13737919>>చేరిక<<>> సందర్భంగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను బీఆర్ఎస్‌లోనే ఉన్నా. పార్టీ మారలేదు. కాంగ్రెస్ కండువా వేసుకోలేదు. దేవుడి గుడికి సంబంధించిన కండువా వేశారు. త్వరలోనే కేసీఆర్‌ను కలుస్తా’ అని ఆయన వ్యాఖ్యానించారు.

News July 30, 2024

BREAKING: ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం

image

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో కాంస్య పతకం దక్కింది. 10మీ. ఎయిర్ పిస్టల్ షూటింగ్‌లో మిక్స్‌డ్ విభాగంలో మను భాకర్, సరబ్‌జోత్ సింగ్ జోడీ బ్రాంజ్ మెడల్ కొల్లగొట్టారు. అంతకుముందు ఉమెన్స్ సింగిల్స్ షూటింగ్‌లో మను భాకర్ కాంస్యం దక్కించుకున్న విషయం తెలిసిందే.
<<-se>>#Olympics2024<<>>

News July 30, 2024

అకౌంట్లలో డబ్బులు జమ

image

TG: రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత రైతు రుణమాఫీ చేసింది. అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి బటన్ నొక్కి అన్నదాతల అకౌంట్లలో డబ్బులు జమ చేశారు. దీంతో రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు రుణం ఉన్న రైతుల ఖాతాల్లో నగదు జమ అయింది. రెండో విడతలో మొత్తం 6.40లక్షల మంది రైతుల రుణమాఫీ కోసం ప్రభుత్వం రూ.6,190 కోట్లు వెచ్చించింది. తొలి విడతలో రూ.లక్ష లోపు రుణం ఉన్న రైతులకు మాఫీ చేసింది.