News October 21, 2024
కాసేపట్లో వర్షం
TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరో గంటలో హైదరాబాద్ నగరంలోని తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని తెలంగాణ వెదర్‌మ్యాన్ తెలిపారు. అలాగే భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల జిల్లాల్లో వానలు పడుతాయని అంచనా వేశారు. ఇప్పటికే వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వర్షాలు కురిశాయి.
Similar News
News November 14, 2024
రేపు సెలవు ఇవ్వాలని విజ్ఞప్తి
TG: కార్తీక పౌర్ణమి సందర్భంగా కులగణన సర్వేకు రేపు సెలవు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘం PRTU డిమాండ్ చేసింది. సర్వేలో పాల్గొన్న టీచర్లను కొందరు అధికారులు వేధిస్తున్నారని, సర్వే గడువును పొడిగించాలని CSకు విజ్ఞప్తి చేసింది. కొన్నిచోట్ల ఉ.7-రా.9 వరకు, సెలవు దినాల్లో ఉ.7-సా.6 గంటల వరకు సర్వేలో ఉండాలని అధికారులు ఆదేశించడం సరికాదని పేర్కొంది. అత్యవసర, ఆరోగ్యరీత్యా సెలవు పెట్టుకునే అవకాశం ఇవ్వాలని CSను కోరింది.
News November 14, 2024
జగనన్నా క్షమించు.. లోకేశన్నా కాపాడు: శ్రీరెడ్డి
AP: తన వల్ల YCPకి చెడ్డపేరు వచ్చిందని, మాజీ CM జగన్ క్షమించాలని నటి శ్రీరెడ్డి కోరారు. ప్రత్యర్థులపై తాను వాడిన భాషతో పార్టీకి నష్టం జరిగిందని, ఇకపై YCPకి దూరంగా ఉంటానని లేఖ రాశారు. మరోవైపు, తన కుటుంబాన్ని కాపాడాలని మంత్రి లోకేశ్‌ను కోరారు. కూటమి పార్టీలు, నేతలపై జుగుప్సాకరంగా మాట్లాడి తప్పు చేశానని, సారీ చెబుతున్నట్లు రాసుకొచ్చారు. శ్రీరెడ్డిపై రాజమండ్రి, అనకాపల్లి, విజయవాడలో కేసులు నమోదయ్యాయి.
News November 14, 2024
జిన్‌పింగ్‌తో భేటీ కానున్న బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ నెల 16న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ కానున్నారు. పెరూలో జరుగుతున్న APEC సదస్సులో ఇద్దరు నేతలు విడిగా భేటీ అవుతారని తెలుస్తోంది. బైడెన్ హయాంలో వీరి మధ్య ఈ సమావేశం మూడోది, ఆఖరిది కావడం గమనార్హం. చైనాను వ్యతిరేకించే ట్రంప్ వచ్చే జనవరిలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో ఈ భేటీ ఆసక్తికరంగా మారింది.