India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ధనవంతులను పెళ్లి చేసుకుని, ఆ తర్వాత ఏదో సాకుతో విడాకులు తీసుకోవడం కర్ణాటకకు చెందిన మహిళకు పరిపాటిగా మారింది. భర్తపై గృహ హింస కేసు పెట్టి డబ్బులతో ఉడాయించేది. ఇలా ఆరేళ్లలో ఏడు వివాహాలు చేసుకుంది. ఏడో భర్త ఆమె మోసాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జడ్జి మహిళపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ భర్తతోనూ ఎక్కువ రోజులు ఉండకపోవడంలో ఆమె తప్పే కనిపిస్తోందని మండిపడ్డారు. తదుపరి విచారణను వాయిదా వేశారు.
తమ స్కూటర్లు, క్యాబ్ సేవల్లో సొంత మ్యాప్స్‌ను ప్రవేశపెట్టనున్నట్లు ఓలా ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకోసం తమ డేటాను కాపీ చేసిందని మ్యాప్‌మైఇండియా ఆరోపిస్తోంది. ఈ విషయంలో ఓలాపై న్యాయపోరాటం చేస్తామని వెల్లడించింది. ఎస్1 ప్రో స్కూటర్లలో నావిగేషన్ కోసం మ్యాప్‌మైఇండియాతో ఓలా ఒప్పందం కుదుర్చుకుంది. తమ డేటాను కాపీ చేసి అగ్రిమెంట్ రూల్స్‌ను ఓలా ఉల్లంఘించిందని మ్యాప్‌మైఇండియా ఆరోపిస్తోంది.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నుంచి మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ రేపటితో ముగియనుంది. మొత్తం 8,326 పోస్టులకు అక్టోబర్-నవంబర్‌లో ఆన్‌లైన్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. MTS పోస్టులకు 18-25 ఏళ్లు, హవల్దార్ పోస్టులకు 18-27 ఏళ్ల వయసు ఉండాలి. రిజర్వేషన్లను బట్టి వయో సడలింపు ఉంది. టెన్త్ పాసైన వారు అర్హులు. వెబ్‌సైట్: <
కేరళలో కొండచరియలు విరిగిపడిన <<13735967>>ఘటనపై<<>> ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేరళ సీఎం విజయన్‌తో మాట్లాడి అవసరమైన సాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు మోదీ ట్వీట్ చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడూ సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సానుభూతి తెలియజేశారు. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలను ఆదేశించినట్లు Xలో పేర్కొన్నారు.
‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుకు నటి మీనా మద్దతు పలికారు. 18 యూట్యూబ్ ఛానళ్లను రద్దు చేయించిన విష్ణుకు ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో ధన్యవాదాలు తెలిపారు. ఇండస్ట్రీ సమగ్రతను కాపాడటంలో మీ కృషి అభినందనీయమని పేర్కొన్నారు. కాగా మీనాపై కూడా పలు యూట్యూబ్ ఛానళ్లు దుష్ప్రచారం చేశాయి. 47 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకోబోతున్నారని రూమర్స్ వ్యాప్తి చేయడంతో సదరు యూట్యూబ్ ఛానళ్లపై మీనా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆర్బీఐలో 94 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. జనరల్ ఆఫీసర్లు-66, DEPR ఆఫీసర్లు-21, DSIM ఆఫీసర్లు-7 పోస్టులున్నాయి. 60% మార్కులతో డిగ్రీ/ 55% మార్కులతో పీజీ పాసైన వారు అర్హులు. వయసు 21-30 ఏళ్లు(రిజర్వేషన్ బట్టి సడలింపు). దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు 16. ఎంపికైన వారికి ప్రారంభ వేతనం రూ.55,200 ఉంటుంది.
వెబ్‌సైట్: <
TG: పీసీసీ చీఫ్ ఎంపిక ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ వచ్చే నెల 2న విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. 14న తిరిగి వస్తారు. ఆ తర్వాతే చీఫ్ పేరును ప్రకటించొచ్చని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. లంబాడా సామాజికవర్గానికి చెందిన మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పేరు దాదాపు ఖరారైనట్లు పేర్కొన్నాయి. ఇక వెనుకబడిన వర్గాల నేతలకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా ఇవ్వనున్నట్లు సమాచారం.
ఝార్ఖండ్‌లో జరిగిన రైలు <<13736050>>ప్రమాదంలో<<>> ఇద్దరు మరణించినట్లు అధికారులు తెలిపారు. 20 మంది గాయపడినట్లు పేర్కొన్నారు. కాగా పట్టాలు తప్పిన గూడ్స్ రైలును అదే లైనులో వచ్చిన హౌరా-ముంబై ట్రైన్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
AP: తిరుమల శ్రీవారి పుష్కరిణిని ఎల్లుండి నుంచి నెల రోజుల పాటు మూసివేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. నీటిని తొలగించి పైపులైన్ల మరమ్మతులు, ఇతర పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఆగస్టు 1 నుంచి 31 వరకు పుష్కరిణి హారతి ఉండదన్నారు. కాగా స్వామి వారి పుష్కరిణిలో నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించేందుకు అత్యుత్తమ రీసైక్లింగ్ వ్యవస్థ అందుబాటులో ఉంది.
TG: మొదటి దశ రుణమాఫీపై 1.20 లక్షల ఫిర్యాదుల అందినట్లు వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు తెలిపారు. ఆధార్, బ్యాంక్ ఖాతాలో ఒకే విధంగా పేరు లేకపోవడం, 0 నుంచి స్టార్ట్ అయ్యే బ్యాంక్ అకౌంట్లకు రుణమాఫీ కాలేదన్నారు. RBI వివరాల ప్రకారం ఈ టెక్నికల్ సమస్యలను పరిష్కరించడానికి కొంత సమయం పడుతుందన్నారు. వాటిని సరిచేసి RBI నుంచి నిధులు వెనక్కి రాగానే తిరిగి ఆయా రైతుల అకౌంట్లలో జమ చేస్తామని స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.