News October 21, 2024
యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు సీఎం రేవంత్ శంకుస్థాపన

TG: రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఏర్పాటుకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలోని పోలీస్, ఎక్సైజ్, ఫైర్, ఎస్‌పీఎఫ్ ఉద్యోగుల పిల్లలకు ఈ స్కూలులో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను ప్రభుత్వం అందించనుంది.
Similar News
News November 9, 2025
మంచి మనసు చాటుకున్న శ్రీచరణి

వరల్డ్ కప్ విజయంలో కీలకపాత్ర పోషించిన తెలుగమ్మాయి శ్రీచరణి తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఆమె ట్రైనింగ్ పొందిన కడప క్రికెట్ అకాడమీలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. శ్రీచరణిని అభినందిస్తూ కడప టీడీపీ అధ్యక్షుడు, కమలాపురం MLA రూ.10 లక్షలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. వాటిని అకాడమీలో ట్రైనింగ్ పొందుతున్న అండర్-14 క్రికెట్ టీమ్ ప్రోత్సాహానికి కేటాయించాలని శ్రీచరణి కోరారు.
News November 9, 2025
ఓట్ చోరీ కవరింగ్ కోసమే SIR: రాహుల్

దేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం దాడికి గురవుతున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ‘భారీగా ఓట్ల దొంగతనం జరుగుతోంది. హరియాణాలో మాదిరే MP, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలో జరిగింది. ఇది BJP, ECల వ్యవస్థ. నా దగ్గర మరిన్ని ఆధారాలు ఉన్నాయి. త్వరలోనే బయటపెడతా’ అని తెలిపారు. ‘ఓట్ చోరీ అనేది ప్రధాన సమస్య. దాన్ని కప్పిపుచ్చేందుకు, ఎన్నికల దుర్వినియోగాన్ని వ్యవస్థీకృతం చేసేందుకే <<18119730>>SIR<<>>’ అని ఆరోపించారు.
News November 9, 2025
NIEPVDలో ఉద్యోగాలు

డెహ్రాడూన్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ విజ్యువల్ డిజబిలిటిస్ (<


