India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు MLAలు, కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, రాజీనామా చేసిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు. అలాగే వేతన బకాయిలను చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా, ఎన్డీయే సర్కారు వచ్చినప్పటి నుంచి వాలంటీర్లను పక్కనబెట్టింది. వారి సేవలను మరో రూపంలో వినియోగించుకుంటుందా? పూర్తిగా తొలగిస్తుందా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
తయారీ రంగంలో చైనా చాలా ముందుందని ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అన్నారు. ఆ దేశంతో పోటీ పడేందుకు భారత్ ముందున్న సవాళ్లపై ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. మాన్యుఫ్యాక్చరింగ్ వృద్ధికి దేశంలో మెరుగైన ప్రభుత్వ పాలన, మద్దతు అవసరమని నొక్కి చెప్పారు. చైనా ఇప్పటికే ప్రపంచ కర్మాగారంగా మారిందని, దాదాపు 90% వస్తువులు అక్కడే తయారు చేస్తున్నట్లు తెలిపారు. అందుకే దాని GDP భారత్ కంటే 6 రెట్లు ఎక్కువ ఉందని పేర్కొన్నారు.
AP: పలు జిల్లాల్లో రేపు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. కాకినాడ, కృష్ణా, NTR, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఆర్చరీలో దక్షిణ కొరియా ప్లేయర్లు పతకాల పంట పండిస్తున్నారు. 1984 నుంచి ఇప్పటివరకు ఆ దేశం 27 గోల్డ్ మెడల్స్ గెలుచుకుంది. పిల్లలకు ప్రైమరీ స్కూల్ దశ నుంచే ఆర్చరీ నేర్పుతారు. ఒక్కో పిల్లాడు రోజుకు 300 నుంచి 500 వరకు బాణాలు వదులుతూ ప్రాక్టీస్ చేస్తాడు. టోర్నమెంట్లలో పాల్గొనేందుకు ఎలాంటి ఫీజు తీసుకోరు. ఉచితంగా పరికరాలు అందజేస్తారు. ఒలింపిక్స్-2024లో కొరియా ఉమెన్ టీమ్ ఇప్పటికే ఓ గోల్డ్ మెడల్ గెలిచింది.
ఉత్తరకొరియా అధ్యక్షుడు, నియంత కిమ్ జాంగ్ ఉన్ తన లగ్జరీ కారులో స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. సినాయ్జూ, యిజు పట్టణాల్లో నడుము లోతు నీటిలో ప్రయాణించి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. కొద్ది రోజులుగా ఆ దేశాన్ని కుంభవృష్టి వర్షాలు వణికిస్తున్నాయి. చాలా ప్రాంతాలు జలదిగ్బంధమవగా ఎమర్జెన్సీ ప్రకటించారు. అయితే విమానాలు, హెలికాప్టర్లు ఉండగా కిమ్ కారులోనే ఎందుకు వెళ్లారనేది మాత్రం సస్పెన్స్.
హీరో ధనుష్‌తో పాటు అడ్వాన్సులు తీసుకొని షూటింగ్‌లు పూర్తిచేయని నటీనటులపై తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆంక్షలు విధించింది. పెండింగ్‌లో ఉన్న సినిమాలను పూర్తి చేశాకే కొత్తవాటికి కాల్ షీట్స్ ఇవ్వాలని తెలిపింది. ఇకపై ఏ హీరో, హీరోయిన్ కూడా అడ్వాన్సులు తీసుకోవద్దని పేర్కొంది. నిర్మాతల ఫిర్యాదుతో ధనుష్ వ్యవహారంపై అసోసియేషన్ సీరియస్ అయింది. తమను సంప్రదించాకే ఆయనతో సినిమా తీయాలని సూచించింది.
* ఐపీవో ఆగస్టు 2న మొదలై 6న ముగుస్తుంది
* ఐపీవో విలువ ₹ 6,145 కోట్లు
* షేర్ల ధర శ్రేణి ₹72-76. ఉద్యోగులకు ₹7 డిస్కౌంట్ ఉంటుంది
* 75% QIP, 10% రిటైల్ ఇన్వెస్టర్లు, 15% నాన్ ఇన్‌స్టిట్యూషనల్స్‌కు రిజర్వు
* గరిష్ఠంగా ₹14,820తో 195 షేర్లకు బిడ్ వేయొచ్చు
* FY23లో ఆదాయం ₹ 2,630 కోట్లు
* FY24లో ఆదాయం 90% వృద్ధిచెంది ₹5,009 కోట్లకు పెరిగింది
* E-స్కూటర్ల మార్కెట్లో ఓలా 50% వాటా సొంతం చేసుకుంది
TG: రాష్ట్రంలోని రైతులకు రేపు రెండో విడత రుణమాఫీ కానుంది. అసెంబ్లీ ప్రాంగణంలో CM రేవంత్ ఈ మాఫీ ప్రక్రియను ప్రారంభిస్తారు. CM బటన్ నొక్కగానే రైతుల రుణ ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమ చేస్తుంది. ఈ విడతలో రూ.లక్ష నుంచి రూ.1.50లక్షల మధ్య రుణాలు మాఫీ కానున్నాయి. ఈసారి ప్రభుత్వం రూ.7వేల కోట్లు వెచ్చిస్తోంది. దీంతో ఆరున్నర లక్షలమంది రైతులు లబ్ధి పొందనున్నారు.
పారిస్ ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ మెన్స్ డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్ క్వార్టర్స్‌కు చేరారు. దీంతో ఒలింపిక్స్ చరిత్రలో ఈ విభాగంలో క్వార్టర్ ఫైనల్‌కు చేరిన తొలి భారత జోడీగా రికార్డు సృష్టించారు. రేపు ఇండోనేషియాకు చెందిన అథ్లెట్లతో పోటీ పడనున్నారు. ఇండోనేషియా జోడీ చేతిలో ఫ్రాన్స్ పెయిర్ ఓడిపోవడంతో భారత జోడీకి క్వార్టర్స్ బెర్తు ఖరారైంది. <<-se>>#OLYMPICS2024<<>>
అగ్నిపథ్‌పై రాహుల్, రాజ్‌నాథ్ మధ్య సంవాదం జరిగింది. పింఛన్ల గురించి ప్రస్తావిస్తూ ఈ పథకం జవాన్లు, వారి కుటుంబాల ఆర్థిక రక్షణ, గౌరవాన్ని లాగేసుకుందని రాహుల్ ఆరోపించారు. ఇది యువతపై ప్రభుత్వ వ్యతిరేకతను ప్రతిబింబిస్తోందన్నారు. ప్రతిపక్ష నేత బడ్జెట్‌పై అపోహలు సృష్టిస్తున్నారని రాజ్‌నాథ్ సింగ్ విమర్శించారు. అగ్నిపథ్‌పై ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, ఎన్నిసార్లు చెప్పినా మారడం లేదన్నారు.
Sorry, no posts matched your criteria.