India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: తాము అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే 50 వేల ఉద్యోగాలిచ్చామని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ‘ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ హామీ ఏమైంది? ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తూ ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నారు. పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలను జిరాక్స్ సెంటర్లలో అమ్మకానికి పెట్టిన చరిత్ర BRSది. జీవో 29ను ఫిబ్రవరిలోనే ఇచ్చారు. విపక్షాల ఇంతకాలం ఎందుకు మాట్లాడలేదు?’ అని నిలదీశారు.
ఉత్తరప్రదేశ్‌లోని జాన్‌పూర్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బీజేపీ కార్పొరేటర్ తహ్సీన్ షాహిద్ కుమారుడు మహ్మద్ అబ్బాస్ హైదర్, పాకిస్థాన్‌కు చెందిన ఆంద్లీప్ జారా అనే యువతిని ఆన్‌లైన్‌లో నిఖా చేసుకున్నారు. హైదర్‌కు వీసా లభించకపోవడం, అటు జారా తల్లి అనారోగ్యంతో ICUలో ఉండటంతో ఆన్‌లైన్‌లోనే పెళ్లి చేసుకున్నట్లు హైదర్ తెలిపారు. తన భార్యకు త్వరలోనే భారత వీసా లభిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
TG: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్‌కి రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లేందుకు ఆయన శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న సమయంలో ఓ కారు కాన్వాయ్ మధ్యలోకి వచ్చింది. దీంతో కాన్వాయ్‌లోని ఓ వాహనం సడన్ బ్రేక్ వేయడంతో కాన్వాయ్‌లోని మూడు వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో భద్రతా సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ సత్య కృష్ణన్ టాలీవుడ్ సినీ అభిమానులకు సుపరిచితురాలే. నటనతోనే కాకుండా తన వాయిస్‌తో ఆమె బాగా పాపులర్ అయ్యారు. అయితే ఇప్పుడు సత్య కూతురు అనన్య కృష్ణన్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేశ్ హీరోగా తెరకెక్కుతున్న కేసీఆర్(కేశవచంద్ర రమావత్) చిత్రంలో అనన్య లీడ్ రోల్‌లో కనిపించనున్నారు. త్వరలోనే ఈ మూవీ విడుదల కానుంది.
1833: శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి వ్యవస్థాపకుడు ఆల్‌ఫ్రెడ్ నోబెల్ జననం
1902: స్వాతంత్ర్య సమరయోధుడు అన్నాప్రగడ కామేశ్వరరావు జననం
1947: ప్రముఖ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు జననం
1967: క్రీడాకారిణి అశ్వినీ నాచప్ప జననం
1992: హీరోయిన్ శ్రీనిధి శెట్టి జననం
1996: ప్రముఖ చిత్రకారుడు పాకాల తిరుమల్ రెడ్డి మరణం
✦పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వంపై భారత్‌కు రష్యా మద్దతుగా నిలిచింది. ‘భారత్, బ్రెజిల్‌తో సహా ఆఫ్రికా దేశాలకు కౌన్సిల్‌లో శాశ్వత సభ్యత్వం ఉండాలి. మెజార్టీ వర్గం తరఫున ప్రాతినిధ్యం ఉండటం ఎంతో అవసరం’ అని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ స్పష్టం చేశారు. చైనా మినహా ఈ మండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న బ్రిటన్, US, ఫ్రాన్స్ దేశాలు ఇప్పటికే భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఉండాలని ఉద్ఘాటించాయి.
తేది: అక్టోబర్ 21, సోమవారం
ఫజర్: తెల్లవారుజామున 4:58 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:11 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:01 గంటలకు
అసర్: సాయంత్రం 4:13 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 5:50 గంటలకు
ఇష: రాత్రి 7.04 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
కేరళలోని వయనాడ్ ఉపఎన్నిక బరిలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నిలిచిన సంగతి తెలిసిందే. ప్రత్యక్ష రాజకీయాల్లో అరంగేట్రం చేయబోతున్న తన కూతురు ప్రియాంక కోసం పార్టీ మాజీ చీఫ్ సోనియా గాంధీ ప్రచారం చేయనున్నారు. OCT 22న జరిగే రోడ్ షోలో రాహుల్, ప్రియాంకతో కలిసి ఆమె పాల్గొంటారు. కాగా కేరళలోని పాలక్కాడ్, చెలక్కర అసెంబ్లీ, వయనాడ్ MP స్థానాలకు NOV 13న పోలింగ్, 23న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
AP: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు ఆయనతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఆయనకు వివరించినట్లు లోకేశ్ Xలో తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తోందని అన్నారు.
Sorry, no posts matched your criteria.