India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
పెంపుడు జంతువుగా కుక్కను పెంచుకోవడం సాధారణమైపోయింది. ఇది మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతోంది. స్టాటిస్టా కన్జూమర్ ఇన్‌సైట్స్ సర్వే ప్రకారం మెక్సికోలో అత్యధికంగా ప్రతి 10 మందిలో ఏడుగురు పెంచుకుంటున్నట్లు తేలింది. తర్వాతి స్థానాల్లో బ్రెజిల్ (62%), ఇండియా (55%), USA (51%), స్పెయిన్ (45%), ఇటలీ (44%), UK (41%) ఉన్నారు. కాగా, అమెరికన్లు 36% పిల్లిని, 7% మంది చేపలను పెంచుకుంటున్నారు.
స్టార్‌డమ్ అనేది వేషధారణతో కాక వ్యక్తిత్వంతో వస్తుందని బాలీవుడ్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ వ్యాఖ్యానించారు. త్రీ ఇడియట్స్ సినిమా కథను వినిపించేందుకు తాను ఆమిర్ ఖాన్ వద్దకు వెళ్లినప్పుడు ఆయన చాలా సింపుల్‌గా కనిపించారని వెల్లడించారు. ‘చాలా సాధారణ దుస్తులు, చిరిగిపోయిన రబ్బరు చెప్పులు ఆమిర్ వేసుకున్నారు. ఒక నటుడికి భద్రత ఉండాలి. సింపుల్‌గా ఉన్నా ధీమాగా ఉండగలగటమే స్టార్‌డమ్’ అని స్పష్టం చేశారు.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
తేది: అక్టోబర్ 20, ఆదివారం
బ.తదియ: ఉదయం 6.46 గంటలకు
చవితి: తెల్లవారుజామున 4.17 గంటలకు
కృత్తిక: ఉదయం 8.31 గంటలకు
వర్జ్యం: రాత్రి 11.24- 12.53 గంటల వరకు
దుర్ముహూర్తం: సాయంత్రం 4.08-4.55 గంటల వరకు
☛ గ్రూప్-1 మెయిన్స్ యథాతథం: సీఎం రేవంత్
☛ గ్రూప్-1 అభ్యర్థులకు మద్దతుగా బండి సంజయ్ ర్యాలీ
☛ అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు పున:ప్రారంభం
☛ జనసేనలో చేరిన ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి
☛ ప్రభుత్వం చేస్తున్న తప్పులు ప్రజల ప్రాణాల మీదకు వస్తున్నాయి: YS జగన్
☛ INDvsNZ: సెంచరీ చేసిన సర్ఫరాజ్ ఖాన్
☛ వయనాడ్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థిగా నవ్య హరిదాస్
టెస్టు మ్యాచ్‌లో నాలుగోరోజు రిషభ్ పంత్ 99 పరుగులకు ఔటైన సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని ఓ నెటిజన్ ముందుగానే పోస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అంత ముందుగా, కచ్చితత్వంతో అతడెలా చెప్పాడన్నది మిస్టరీగా మారింది. నువ్వు మ్యాచ్ ఫిక్సర్‌వా అంటూ కొంతమంది, నా జాతకం చెప్పు బాస్ అంటూ మరికొంతమంది అతడి ట్వీట్ కింద కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది మాత్రం నీవల్లే రిషభ్ ఔటయ్యారంటూ మండిపడుతున్నారు.
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రేపు కర్వా చౌత్ వేడుక జరుపుకోనున్నారు. గత ఏడాది ఈ పండుగకు రూ.15వేల కోట్ల మేర వ్యాపారం జరగగా, ఈసారి అది రూ.22 వేల కోట్లకు పెరగొచ్చని వ్యాపారులు అంచనా వేశారు. ఢిల్లీలోనే రూ.4వేల కోట్ల మేర వ్యాపారం జరగొచ్చని అభిప్రాయపడ్డారు. ఎర్రగాజులు, సంప్రదాయ దుస్తులు, పూజాసామగ్రి, లాకెట్లు, మెట్టెలు, ఆభరణాల వంటివాటికి డిమాండ్ నెలకొందని వివరించారు.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరుగుతున్న తొలి పోలీస్ డ్యూటీ మీట్‌కు హాజరుకావడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ‘రాష్ట్రాన్ని కంటికి రెప్పలా కాపాడే ఖాకీ సైనికులు, పెట్టుబడుల సాధనకు భరోసా కల్పించే శాంతిభద్రతకు ప్రతినిధులు, దేశానికే గర్వకారణం తెలంగాణ పోలీసులు’ అంటూ ఓ ట్వీట్‌లో కొనియాడారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం, ప్రజాపాలన అన్న హాష్ ట్యాగ్‌లను దానికి జోడించారు.
TG: పోలీసుల పిల్లలకు నాణ్యమైన విద్య అందించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ‘ఇందుకోసం యంగ్ ఇండియా పోలీస్ స్కూలు నిర్మిస్తాం. వచ్చే ఏడాది 1-5 క్లాసులతో దీనిని ప్రారంభిస్తాం. ఒక్కో ఏడాది ఒక్కో తరగతి పెంచుకుంటూ డిగ్రీ వరకు విద్య అందిస్తాం’ అని HYDలో పోలీస్ డ్యూటీ మీట్ ముగింపు కార్యక్రమంలో మాట్లాడారు.
Sorry, no posts matched your criteria.