News October 20, 2024
TODAY HEADLINES
☛ గ్రూప్-1 మెయిన్స్ యథాతథం: సీఎం రేవంత్
☛ గ్రూప్-1 అభ్యర్థులకు మద్దతుగా బండి సంజయ్ ర్యాలీ
☛ అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు పున:ప్రారంభం
☛ జనసేనలో చేరిన ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి
☛ ప్రభుత్వం చేస్తున్న తప్పులు ప్రజల ప్రాణాల మీదకు వస్తున్నాయి: YS జగన్
☛ INDvsNZ: సెంచరీ చేసిన సర్ఫరాజ్ ఖాన్
☛ వయనాడ్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థిగా నవ్య హరిదాస్
Similar News
News November 3, 2024
2 రోజుల్లో ఎన్నికలు.. కమలా హారిస్ ఎమోషనల్ పోస్ట్
అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్, డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘మా అమ్మ శ్యామలా గోపాలన్ హారిస్ 19 ఏళ్ల వయసులో ఇండియా నుంచి అమెరికా వచ్చారు. ఆమె ధైర్యం, అంకితభావం వల్లే ప్రస్తుతం నేనిలా ఉన్నా’ అని ట్వీట్ చేశారు. కాగా, అమెరికాలో ప్రవాస భారతీయ ఓటర్లు 26 లక్షల వరకు ఉన్నారు. ఈ ఎన్నికల్లో వారు కీలకంగా మారనున్నారని విశ్లేషకుల అభిప్రాయం.
News November 3, 2024
HDFC ఖాతాదారులకు ALERT
డిజిటల్ అరెస్టుల మోసాలపై తమ ఖాతాదారులకు HDFC కీలక సూచనలు చేసింది. ‘నిజమైన ప్రభుత్వ అధికారులెవరూ ఫోన్లలో బ్యాంకు వివరాలు అడగరు. కాల్ చేసి మీ ఆధార్, పాన్ ఈ-కేవైసీ, బ్యాంక్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ అడిగినా స్పందించొద్దు. డెబిట్, క్రెడిట్ కార్డుల నంబర్లు, CVV, పిన్, OTPలాంటివి షేర్ చేయొద్దు. మీకు వచ్చే లింకులు, వెబ్‌సైట్ల పేర్లలో తప్పులుంటాయి. వాటిని గమనిస్తే సైబర్ మోసాలను అడ్డుకోవచ్చు’ అని తెలిపింది.
News November 3, 2024
ఉచిత సిలిండర్‌పై BIG UPDATE
AP: ఉచిత సిలిండర్ పథకానికి అర్హతపై ప్రజల్లో నెలకొన్న సందేహాలకు అధికారులు సమాధానాలిచ్చారు. తప్పనిసరిగా ఆధార్, రేషన్ కార్డు, గ్యాస్ కనెక్షన్ ఉంటేనే లబ్ధి పొందగలరని చెప్పారు. అయితే కుటుంబ సభ్యులలో ఎవరి పేరిట కనెక్షన్ ఉందో ఆ వ్యక్తి పేరు రేషన్ కార్డులో ఉంటే సరిపోతుంది. భార్య పేరుతో రేషన్ కార్డు, భర్త పేరిట గ్యాస్ కనెక్షన్ ఉన్నా పథకం వర్తిస్తుంది. ఇక గ్యాస్ రాయితీ పొందాలంటే ఈ-కేవైసీ తప్పనిసరి.