news

News October 19, 2024

మహారాష్ట్ర Seat Sharing: కాంగ్రెస్‌పై శివసేన సెటైర్లు

image

పోలింగ్‌కు నెలరోజులే ఉంది. అయినా మహారాష్ట్ర MVA కూటమిలో సీట్ల పంపకం కొలిక్కిరావడం లేదు. ఎవరికి వారు తామే ఎక్కువ సీట్లలో పోటీచేయాలని భావిస్తున్నారు. పరస్పరం పరోక్షంగా సెటైర్లు వేసుకుంటున్నారు. విదర్భలో ఎక్కువ సీట్లు తమకే ఇవ్వాలని శివసేన UBT అడుగుతోంది. కాంగ్రెస్ నేత నానా పటోలే అందుకు ససేమిరా అంటున్నారు. దీంతో ఆయనుంటే అసలు సీట్ల చర్చకే రాలేమని, లోకల్ లీడర్స్‌కు ఆ స్థాయిలేదని SS చెప్పడం గమనార్హం.

News October 19, 2024

GST Rates: మంత్రుల ప్రతిపాదన.. తగ్గేవి, పెరిగేవి ఇవే!

image

అదనంగా రూ.22వేల కోట్ల ఆదాయం సృష్టించడమే లక్ష్యంగా ట్యాక్స్ రేట్ల మార్పునకు GST GoM ప్రతిపాదించినట్టు తెలిసింది. రూ.25K కన్నా విలువైన రిస్ట్ వాచెస్, రూ.15K కన్నా ఎక్కువుండే షూ, Sin Goodsపై GSTని 18 నుంచి 28%కి పెంచాలని సూచించింది. రూ.10K కన్నా తక్కువుండే సైకిళ్లు, ఎక్సర్‌సైజ్ బుక్స్‌పై GSTని 12 నుంచి 5%, 20Ltr మించిన ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌పై 18 నుంచి 5%కు తగ్గించాలని ప్రతిపాదించింది.

News October 19, 2024

టెస్టుల్లో 550 సెంచరీలు చేసిన భారత క్రికెటర్లు

image

టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు భారత క్రికెటర్లు చేసిన సెంచరీల సంఖ్య 550కి చేరింది. తాజాగా NZతో టెస్టులో సర్ఫరాజ్ ఖాన్ చేసిన సెంచరీ 550వది. తొలి సెంచరీని 1933లో లాలా అమర్నాథ్, 50వ సెంచరీ పాలీ ఉమ్రిగర్, 100,150వ సెంచరీలు సునీల్ గవాస్కర్, 200th అజహరుద్దీన్, 250th, 300th సచిన్ టెండూల్కర్, 350th వీవీఎస్ లక్ష్మణ్, 400th రాహుల్ ద్రవిడ్, 450th అజింక్య రహానే, 500వ సెంచరీ విరాట్ కోహ్లీ చేశారు.

News October 19, 2024

గ్రూప్-1 అభ్యర్థుల డిమాండ్ న్యాయమైనదే: బండి సంజయ్

image

TG: గత బీఆర్ఎస్ ప్రభుత్వంలాగే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ‘గ్రూప్-1 రద్దు చేయమని అడగట్లేదు. వాయిదా వేయాలని కోరుతున్నాం. జీవో 29తో అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందనేది వాస్తవం. రిజర్వేషన్ల రద్దుకు కుట్ర జరుగుతోందని అభ్యర్థులు భయపడుతున్నారు. అభ్యర్థుల డిమాండ్ న్యాయమైనదే. వారిపై లాఠీఛార్జ్ జరగడం చూసి బాధనిపిస్తోంది’ అని ప్రెస్‌మీట్‌లో వ్యాఖ్యానించారు.

News October 19, 2024

తప్పు చేయలేదు..క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు: సల్మాన్ తండ్రి

image

తన కొడుకు కృష్ణజింకల్ని ఎప్పుడూ చంపలేదని నటుడు సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్ తెలిపారు. ‘కృ‌ష్ణజింకల్ని కాదు కదా మేమెప్పుడూ బొద్దింకల్ని కూడా చంపలేదు. సల్మాన్‌కు జంతువులంటే చాలా ఇష్టం. తన పెంపుడు కుక్క చనిపోతేనే రోజుల తరబడి ఏడ్చాడు. అలాంటిది కృష్ణజింకల్ని చంపుతాడా? మా కుటుంబం తుపాకీని ఎప్పుడూ వాడలేదు. తప్పే చేయని సల్మాన్ క్షమాపణ ఎందుకు చెబుతాడు? ఆ ప్రసక్తే లేదు’ అని స్పష్టం చేశారు.

News October 19, 2024

IAS అధికారి అమోయ్‌కు ఈడీ నోటీసులు

image

తెలంగాణకు చెందిన IAS అమోయ్ కుమార్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఉన్న సమయంలో భూ కేటాయింపుల వ్యవహారంలో భారీగా అవినీతి, అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో ఈడీ ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగానే ఆయనకు నోటీసులు పంపింది.

News October 19, 2024

నారా లోకేశ్ ఆగ్రహం

image

AP: విశాఖ పర్యటనలో భాగంగా నెహ్రూ బజార్ ప్రాంతీయ గ్రంథాలయం ఆకస్మిక తనిఖీకి వెళ్లిన మంత్రి లోకేశ్ ఉ.9.45 గంటలకూ ఓపెన్ కాకపోవడంపై ఫైరయ్యారు. నిర్వహణ తీరుపై మండిపడ్డారు. గ్రంథాలయాల నిర్వహణ, పర్యవేక్షణ కోసం ఓ స్పెషల్ ఆఫీసర్‌ను నియమించాలని నిర్ణయించారు. విద్యార్థులు, నిరుద్యోగులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావడానికి దేశంలోనే బెస్ట్ మోడల్‌ను అధ్యయనం చేసి APలో అమలు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

News October 19, 2024

అంపైర్లతో రోహిత్ శర్మ వాగ్వాదం

image

బ్యాడ్ లైట్ కారణంగా భారత్-న్యూజిలాండ్ <<14399404>>మ్యాచ్‌ను <<>>అంపైర్లు నిలిపివేశారు. బుమ్రా 4 బంతులు వేసిన అనంతరం స్టేడియం చుట్టూ నల్లమబ్బులు కమ్మేయడంతో ఇవాళ్టి ఆటను ఆపేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ, ఇతర భారత ప్లేయర్లు అంపైర్లతో వాగ్వాదానికి దిగారు. వర్షం పడకున్నా మ్యాచ్ నిలిపివేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ కాసేపటికే స్టేడియంలో కుండపోత వర్షం ప్రారంభమైంది.

News October 19, 2024

గిన్నిస్ వరల్డ్ రికార్డు పేజీపై మెగాస్టార్‌పై కథనం

image

భారతీయ సినిమా రంగంపై చిరంజీవి చెరగని ముద్ర వేశారంటూ గిన్నిస్ వరల్డ్ రికార్డు అధికారిక పేజీలో ఆయనపై ఓ స్పెషల్ స్టోరీ పబ్లిష్ చేసింది. సినీ పరిశ్రమలో అత్యంత విజయవంతమైన నటుడిగా నిలిచారని, 143 సినిమాల్లో 537 పాటల్లో విభిన్న డాన్సులతో ఆకట్టుకున్నారని ప్రశంసించింది. సినిమాలపై చిరంజీవి ప్రభావం తరతరాలుగా మారి, ఆయనను భారతీయ సినిమాకు ఒక చిహ్నంగా మార్చిందంటూ మెగాస్టార్ కెరీర్ హైలైట్స్‌ను GWR పంచుకుంది.

News October 19, 2024

ప్రభుత్వం చేస్తున్న తప్పులు ప్రజల ప్రాణాల మీదకు వస్తున్నాయి: జగన్

image

AP: కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులు ప్రజల ప్రాణాల మీదకు వస్తున్నాయని మాజీ సీఎం జగన్ అన్నారు. ‘రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలింది. విజయనగరం జిల్లా గుర్లలో ప్రబలిన అతిసార ఘటనలే దీనికి ఉదాహరణ. 11 మంది చనిపోయినా ప్రభుత్వం నిద్ర వీడడం లేదు. ఆస్పత్రులున్నా స్థానిక స్కూళ్లలో బెంచీల మీద చికిత్స అందించడం దారుణం. ఇప్పటికైనా డయేరియా బాధిత గ్రామాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి’ అని ట్వీట్ చేశారు.