News October 19, 2024
GST Rates: మంత్రుల ప్రతిపాదన.. తగ్గేవి, పెరిగేవి ఇవే!
అదనంగా రూ.22వేల కోట్ల ఆదాయం సృష్టించడమే లక్ష్యంగా ట్యాక్స్ రేట్ల మార్పునకు GST GoM ప్రతిపాదించినట్టు తెలిసింది. రూ.25K కన్నా విలువైన రిస్ట్ వాచెస్, రూ.15K కన్నా ఎక్కువుండే షూ, Sin Goodsపై GSTని 18 నుంచి 28%కి పెంచాలని సూచించింది. రూ.10K కన్నా తక్కువుండే సైకిళ్లు, ఎక్సర్‌సైజ్ బుక్స్‌పై GSTని 12 నుంచి 5%, 20Ltr మించిన ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌పై 18 నుంచి 5%కు తగ్గించాలని ప్రతిపాదించింది.
Similar News
News November 10, 2024
రాజస్థాన్‌లో కాలేజీలకు కాషాయ రంగులు.. కాంగ్రెస్ విమర్శలు
కాలేజీలకు కాషాయ రంగులు వేయాలన్న రాజస్థాన్ ప్రభుత్వ ఆదేశాలు ప్రతిపక్షాల ఆగ్రహానికి దారితీశాయి. కాయకల్ప్ పథకం ద్వారా శాంతియుత వాతావరణం సృష్టించేందుకు పైలెట్ ప్రాజెక్టుగా 20 కాలేజీలకు కాషాయ రంగులు వేయాలని విద్యాశాఖ ఆదేశించింది. అయితే విద్యను కాషాయీకరణ చేస్తున్నారని కాంగ్రెస్ మండిపడింది. విద్యా వ్యవస్థల్లో ఉన్న సమస్యలు వదిలేసి రాజకీయాల కోసం ప్రజల డబ్బులు వెచ్చిస్తారా అని విమర్శించింది.
News November 10, 2024
ఏపీలో పలువురు ఐఏఎస్‌లకు పోస్టింగ్, బదిలీలు
☞ ఆర్థికశాఖ కార్యదర్శిగా రోనాల్డ్ రాస్
☞ మున్సిపల్ & పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా కె.కన్నబాబు
☞ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీగా అనిల్ కుమార్ రెడ్డి
☞ కార్మికశాఖ, ఫ్యాక్టరీలు, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ అదనపు కార్యదర్శిగా గంధం చంద్రుడు
☞ వ్యవసాయ, సహకార శాఖ డిప్యూటీ సెక్రటరీగా డి.హరిత
News November 10, 2024
కులగణనకు మేము వ్యతిరేకం కాదు: బండి
TG: కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో కులగణన చేశారని, మళ్లీ అవసరం లేదని చెప్పారు. గత సర్వే నివేదిక ప్రస్తుత ప్రభుత్వానికి అందలేదా అని ప్రశ్నించారు. ఎక్కడికి వెళ్లినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.