news

News July 24, 2024

జగన్ కేసుపై రోజువారీ విచారణ చేపట్టండి: హైకోర్టు

image

AP: వైఎస్ జగన్ ఆస్తులకు సంబంధించి నమోదైన కేసులపై రోజువారీ విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టు మరోసారి సీబీఐ కోర్టుకు స్పష్టం చేసింది. ఈనెల 3న ఇచ్చిన ఉత్తర్వుల అమలుపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ కేసు విచారణను సత్వరం పూర్తి చేయాలన్న మాజీ మంత్రి హరిరామజోగయ్య పిటిషన్‌పై ఈ మేరకు ధర్మాసనం స్పందించింది. తదుపరి విచారణను ఆగస్టు 20కి వాయిదా వేసింది.

News July 24, 2024

కమలా హారిస్ ఎంట్రీ.. ట్రంప్‌కు తగ్గిన ఆదరణ: సర్వే

image

అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్‌కు డెమోక్రాట్ల మద్దతు లభించడంతో ట్రంప్ ఆదరణ 2% తగ్గినట్లు రాయిటర్స్ సర్వేలో తేలింది. ఈనెల 15-16 మధ్య నిర్వహించిన పోలింగ్‌లో 44%తో ఇద్దరూ సమానంగా నిలిచారు. అయితే తాజాగా ట్రంప్‌కు మద్దతుగా పడిన ఓట్ల సంఖ్య 42%కు తగ్గింది. కాగా అంతకుముందు నిర్వహించిన సర్వేలో కమల కంటే ట్రంప్‌కు ఒక్క శాతమే ఎక్కువ ఆదరణ ఉండేది.

News July 24, 2024

వైట్‌హౌస్‌కు తిరిగొచ్చిన బైడెన్

image

US అధ్యక్షుడు జో బైడెన్ తన క్వారంటైన్ ముగించుకుని వైట్‌హౌస్‌కు తిరిగొచ్చారు. కరోనా సోకడంతో కొన్ని రోజులు ఆయన నివాసంలోనే సెల్ఫ్ ఐసొలేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయనకు పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు. వైరస్ లక్షణాలు ఏవీ ఇప్పుడు కనబడటం లేదని తెలిపారు. కాగా బైడెన్ క్వారంటైన్‌లో ఉండగానే ప్రెసిడెంట్ అభ్యర్థిత్వం నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు.

News July 24, 2024

షమీ ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు: స్నేహితుడు

image

కెరీర్, వ్యక్తిగత జీవితంలో ఇబ్బంది పడుతున్న దశలో షమీని సూసైడ్ థాట్స్ వెంటాడాయని అతని ఫ్రెండ్ ఉమేశ్ కుమార్ తెలిపారు. ‘షమీ అప్పుడు నాతోనే ఉండేవాడు. మ్యాచ్ ఫిక్సింగ్‌ ఆరోపణలు వచ్చిననాడు కుంగిపోయాడు. ఆ రాత్రి నేను నీరు తాగేందుకు కిచెన్‌లోకి వెళ్తుండగా బాల్కనీ వద్ద నిలబడి ఉన్నాడు. నా ఫ్లాట్ 19న అంతస్తు. నాకు విషయం అర్ధమైంది. క్లీన్ చిట్ వచ్చిన రోజు ఎంతో సంతోష పడ్డాడు’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

News July 24, 2024

‘ఆదాయ పన్ను’ వెనుక ఉన్న ఈ స్టోరీ తెలుసా?

image

కేంద్రం ఏటా ఈరోజును (జులై 24) ఆదాయం పన్ను దినోత్సవంగా నిర్వహిస్తూ వస్తోంది. ఆదాయ పన్నుపై ప్రజలకు అవగాహన పెంచడమే దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం. మరి ఇదే రోజు ఎందుకు? ‘ఆదాయ పన్ను’ అనే కాన్సెప్ట్‌ను భారత్‌కు బ్రిటిషర్లు పరిచయం చేసేది ఇదే రోజున కాబట్టి. సిపాయి తిరుగుబాటుతో కలిగిన నష్టం, పెరుగుతున్న సైనిక ఖర్చు దృష్ట్యా 1860లో సర్ జేమ్స్ విల్సన్ దీనిని తీసుకొచ్చారు. అలా ఆదాయ పన్ను విధానం మొదలైంది.

News July 24, 2024

గోదావరి ప్రజల పాలిట భగీరథుడు

image

AP: పచ్చని పొలాలతో కళకళలాడే గోదావరి జిల్లాల పరిస్థితి 1852కి ముందు మరోలా ఉండేది. అతివృష్టి, అనావృష్టి ప్రజలను పీడించేవి. అలాంటి సమయంలో వచ్చిన ఆర్థర్ కాటన్ అనే ఇంగ్లీష్ దొర ధవలేశ్వరం ఆనకట్ట నిర్మించి ఆ ప్రాంతాల స్వరూపాన్నే మార్చేశాడు. అందుకే ‘నిత్య గోదావరీ స్నాన పుణ్యదో యో మహమతిః స్మరామి ఆంగ్లేయ దేశీయం కాటనుం తం భగీరథం’ అని ఆ కాటన్ దొరను గోదావరి జిల్లాల ప్రజలు పూజిస్తుంటారు! నేడు ఆయన వర్ధంతి.

News July 24, 2024

ఏపీకి భారీ కేటాయింపులు.. కేంద్రానికి పవన్ థ్యాంక్స్

image

AP: రాష్ట్రానికి బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. విభజన హామీల అమలు, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడం అత్యవసరమన్న పవన్, కేంద్రం చొరవతో రాష్ట్ర అభివృద్ధికి ముందడుగు పడిందన్నారు. రాజధాని అవసరాన్ని గుర్తించి అమరావతికి ₹15వేల కోట్లు కేటాయించడం హర్షణీయం అని పేర్కొన్నారు. ఈ నిర్ణయాలు ఏపీ ప్రజల ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగా ఉన్నాయన్నారు.

News July 24, 2024

జులై 24: చరిత్రలో ఈరోజు

image

1936: నటుడు, దర్శకుడు మొదలి నాగభూషణ శర్మ జననం
1899: బ్రిటిష్ సైనికాధికారి, ఇంజినీర్ సర్ ఆర్ధర్ కాటన్ మరణం
1970: స్వాతంత్ర్య సమరయోధుడు కేవీ రంగారెడ్డి మరణం
1971: కవి గుర్రం జాషువా మరణం
2014: సాహిత్య విమర్శకుడు చేకూరి రామారావు మరణం
>> ఆదాయ పన్ను దినోత్సవం

News July 24, 2024

నీతి ఆయోగ్ మీటింగ్‌కు నాలుగు రాష్ట్రాల సీఎంలు దూరం

image

బడ్జెట్ కేటాయింపులపై నిరసనగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు నీతి ఆయోగ్ సమావేశానికి గైర్హాజరు కానున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సుఖు మీటింగ్‌కు దూరం కానున్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ సైతం నీతి ఆయోగ్‌ సమావేశంలో పాల్గొనడం లేదని తెలిపారు. కాగా ఈనెల 27న పీఎం మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం జరగనుంది.

News July 24, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.