News October 19, 2024
అధికారం పోయినా వారికి అహంకారం తగ్గలేదు: మంత్రి కోమటిరెడ్డి
TG: పోరాటాలకు మారు పేరు నల్గొండ జిల్లా అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో జిల్లా పాత్ర కీలకమని చెప్పారు. జిల్లా ప్రజలది దొరలు చెప్తే వినే రక్తం కాదన్నారు. బీఆర్ఎస్‌లా కాకుండా తాము చేసేదే చెప్పి అధికారంలోకి వచ్చామన్నారు. అధికారం పోయినా బీఆర్ఎస్ నేతలకు అహంకారం తగ్గలేదని దుయ్యబట్టారు. రాష్ట్రాభివృద్ధి కోసమే సీఎం పర్యటనలు చేస్తున్నారన్నారు.
Similar News
News November 13, 2024
‘మిషన్ ఇంపాజిబుల్’లో బాలీవుడ్ బ్యూటీ?
బాలీవుడ్ బ్యూటీ అవనీత్ కౌర్ హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్‌ని కలిశారు. ‘మిషన్ ఇంపాజిబుల్’ సెట్లో ఆయనతో కలిసి ఫొటో దిగారు. క్రూజ్‌ను కలవడం కలలా ఉందని ఆమె ఇన్‌స్టాలో పోస్టు చేయగా బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఆశ్చర్యపోతున్నారు. దానిపై మిషన్ ఇంపాజిబుల్ ఇన్‌స్టా పేజీ కూడా స్పందించింది. కాగా అవనీత్ ఈ మూవీతో హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం మొదలైంది.
News November 13, 2024
నేడు ఇండియాVSసౌతాఫ్రికా కీలక మ్యాచ్
4 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, సౌతాఫ్రికా మధ్య 3వ T20 నేడు జరగనుంది. జొహనెస్‌బర్గ్‌లో రాత్రి 8.30గంటలకు ప్రారంభం అవుతుంది. కాగా తొలి మ్యాచ్‌లో భారత్ గెలిస్తే, రెండో టీ20లో సౌతాఫ్రికా గెలిచింది. ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌పై పట్టుబిగించాలని ఇటు మెన్ ఇన్ బ్లూ, అటు ప్రొటీస్ పట్టుదలతో ఉన్నాయి. ఈ పిచ్ కాస్త పేస్‌కు అనుకూలించే ఛాన్సుంది.
News November 13, 2024
రాహుల్‌కు ఫ్రాడ్.. రేవంత్‌కు ఫ్రెండ్: KTR
TG: అదానీ విషయంలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టత లేదని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. ‘‘అదానీ ఫ్రాడ్’ అని రాహుల్ గాంధీ అంటుంటే, ‘అదానీ నాకు ఫ్రెండ్’ అని రేవంత్ అంటున్నారు. గుజరాత్ మోడల్ బేకార్ అని రాహుల్ అంటే గుజరాత్ మోడల్ బెహతరీన్(అద్భుతం) అని రేవంత్ అంటున్నారు. అదానీ ఫ్రాడ్ అని రాహుల్ అంటుంటే అలాంటి ఫ్రాడ్ దగ్గరికి కాంగ్రెస్ CM రేవంత్ వెళుతున్నారు’’ అని ఇండియా టుడేతో ఇంటర్వ్యూలో KTR అన్నారు.