India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: మూసీ పరీవాహకంలో ఉండాలన్న సీఎం రేవంత్ <<14382694>>సవాల్‌ను<<>> బీఆర్ఎస్ నేత కేటీఆర్ స్వీకరించారు. మూడు నెలలు కాదు మూడేళ్లు ఉంటానని స్పష్టం చేశారు. తాను గతంలో మూసీ నింబోలి అడ్డాలోనే ఉన్నట్లు తెలిపారు. ఢిల్లీ పెద్దలకు డబ్బులు పంపాలంటే చందాలు వేసుకుని ఇస్తామని వ్యంగ్యంగా మాట్లాడారు. మూసీ ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని కోరారు. బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని పేర్కొన్నారు.
AP: నూతన మద్యం విధానంలో భాగంగా ఇటీవల తిరుపతిలో ప్రారంభమైన ఓ ప్రైవేటు మద్యం షాపు సోషల్ మీడియాలో వైరలవుతోంది. దాని పేరు ‘బడి వైన్స్’ అని ఉండటమే దీనికి కారణం. నాన్నలకూ ఓ బడి తెరిచారని, అక్కడ ‘మందు’ చదువులు చెబుతారేమో అని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఆ పేరు ఉద్దేశపూర్వకంగా పెట్టింది కాదని, ఆ షాపు యజమాని ఇంటి పేరే అదని పలువురు పేర్కొంటున్నారు.
TG: దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకే దఫాలో రూ.18వేల కోట్లు రుణమాఫీ చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. CM ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని మీడియా సమావేశంలో చెప్పారు. ఇంకా 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉందని, CM సూచనలతో రూ.2 లక్షల పైన రుణం ఉన్నవారు వడ్డీ చెల్లిస్తే మాఫీ చేస్తామన్నారు. కుటుంబ నిర్ధారణ జరిగి వైట్ రేషన్ కార్డు లేని 3 లక్షల ఖాతాలకు డిసెంబర్‌లోగా మాఫీ చేస్తామని పేర్కొన్నారు.
AP: విశాఖ మాజీ ఎంపీ, వైసీపీ నేత ఎంవీవీ సత్యనారాయణ ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. లాసన్స్ బే కాలనీ, మధురవాడ ఆఫీసుల్లో తనిఖీలు సాగుతున్నాయి. అలాగే ఆడిటర్ వెంకటేశ్వరరావు, అనుచరుల ఇళ్లు సహా మొత్తం 5 చోట్ల అధికారులు సోదాలు చేస్తున్నారు. భూకబ్జా ఆరోపణలు, హయగ్రీవ భూముల వివాదంలో ఆయనపై కేసులు నమోదైన విషయం తెలిసిందే.
భారత్ నుంచి పారిపోయిన వివాదాస్పద మత బోధకుడు జకీర్ నాయక్ పాకిస్థాన్‌లో పర్యటిస్తున్నాడు. అక్కడ లష్కర్ ఏ తోయిబా(LeT) ఉగ్రవాదులు ఇక్బాల్ హష్మీ, మహ్మద్ ధర్, నదీమ్‌లను కలుసుకున్నాడు. భారీ బందోబస్తు మధ్య లాహోర్‌లో నిర్వహించిన సభలో 1,50,000 మందిని ఉద్దేశించి ప్రసంగించాడు. 2016 మనీలాండరింగ్ కేసు తర్వాత అతను మలేషియాకు మకాం మార్చిన విషయం తెలిసిందే. అతని ‘పీస్ టీవీ’పై భారత్, బంగ్లా, శ్రీలంకలో నిషేధం ఉంది.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కు నోటీసులు ఇచ్చామని మహారాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఓటర్లను తికమకపెట్టేలా ఉన్న 1752 ఫేక్‌న్యూస్ పోస్టులను తొలగించాలని ఆదేశించామంది. ఇప్పటి వరకు FB 16, INSTA 28, X 251, YT 5 పోస్టులను డిలీట్ చేసినట్టు వెల్లడించింది. కోడ్ ఉల్లంఘనపై c-VIGIL యాప్ ద్వారా 420 ఫిర్యాదులు రాగా 414 పరిష్కరించామని తెలిపింది. రూ.10.64కోట్ల విలువైన నగదు, డ్రగ్స్, లిక్కర్ సీజ్ చేశామంది.
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో టన్నులకొద్దీ(4422) రన్స్. పదుల సంఖ్యలో సెంచరీలు(15), హాఫ్ సెంచరీలు(14). అయినా భారత జట్టులో చోటు కోసం పోరాటమే. అయితే తాజాగా అందివచ్చిన అవకాశాన్ని సర్ఫరాజ్ ఖాన్ అద్భుతంగా వినియోగించుకున్నారు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో కష్టాల్లో పడ్డ భారత్‌కు అండగా నిలిచారు. టెస్టుల్లో తన సెంచరీల ఖాతా ఓపెన్ చేశారు. జట్టులో స్థానం సుస్థిరం చేసుకునే దిశగా సాగుతున్నారు.
న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు వర్షం కారణంగా నిలిచిపోయింది. నాలుగో రోజు తొలి సెషన్‌లో భారత బ్యాటర్ సర్ఫరాజ్(125) సెంచరీ చేయగా, పంత్(53) అర్ధసెంచరీతో క్రీజులో ఉన్నారు. భారత స్కోరు 344/3.
చైనాలో ఓ తల్లి బిడ్డల పట్ల అమానుషంగా ప్రవర్తించింది. భర్తతో గొడవపడి అతడిని బెదిరించేందుకు కొడుకు, కూతురును 23వ అంతస్తులోని అపార్ట్‌మెంట్ బయట AC యూనిట్‌పై కూర్చోబెట్టింది. పిల్లలు ఏడుస్తున్నా పట్టించుకోలేదు. వారిని కాపాడేందుకు వస్తున్న భర్తను అడ్డుకుని రాక్షసిలా ప్రవర్తించింది. ఈ తతంగాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వారు పిల్లలను కాపాడారు.
భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని మెక్సికన్ ఇన్వెస్టర్లను FM నిర్మలా సీతారామన్ ఆహ్వానించారు. GIFT-IFSCలో ఫారిన్ యూనివర్సిటీల సెటప్, GICCs, ఎయిర్ క్రాఫ్ట్ లీజింగ్, షిప్ లీజింగ్‌లో అవకాశాలను అన్వేషించాలని సూచించారు. ఆర్థిక సంబంధాలు, ఫార్మా సూటికల్స్, మెడ్ టెక్, డిజిటల్ ఇన్నోవేషన్ రంగాల్లో గ్రోత్‌ను 2 దేశాల ప్రైవేటు సెక్టార్ లీడర్లు ముందుకు తీసుకెళ్లాలని కోరారు. కొన్ని కంపెనీలతో MoUలు కుదిరాయన్నారు.
Sorry, no posts matched your criteria.