news

News July 22, 2024

రూ.500కే గ్యాస్ సిలిండర్.. కేంద్రానికి సీఎం రేవంత్ రిక్వెస్ట్!

image

TG: ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీతో భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రూ.500కే గ్యాస్ సిలిండర్ (మహాలక్ష్మి) పథకం గురించి ఆయనకు వివరించారు. గ్యాస్ సిలిండర్ కోసం ప్రభుత్వం వినియోగదారులకు అందిస్తున్న రాయితీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

News July 22, 2024

ప్రత్యక్ష పన్నులతో కేంద్రానికి 55% ఆదాయం

image

FY24లో స్థూల పన్ను ఆదాయాన్ని 13.4 శాతంగా ఆర్థిక సర్వే అంచనా వేసింది. FY23లో ప్రత్యక్ష పన్నుల్లో 15.8%, పరోక్ష పన్నుల్లో 10.6% వృద్ధిరేటే ఇందుకు కారణమని వివరించింది. డైరెక్ట్ ట్యాక్స్ ద్వారా 55%, ఇన్ డైరెక్ట్ ట్యాక్స్ నుంచి 45% ఆదాయం వస్తున్నట్టు వెల్లడించింది. పన్ను సంస్కరణలే ఇందుకు కీలకంగా నిలిచాయని పేర్కొంది. కార్పొరేట్, కస్టమ్స్, జీఎస్టీ ద్వారానూ కేంద్రానికి పన్ను ఆదాయం గణనీయంగానే వస్తోంది.

News July 22, 2024

BREAKING: ప్రత్యేక హోదాపై కేంద్రం కీలక ప్రకటన

image

బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేసింది. పారిశ్రామిక అభివృద్ధి కోసం బిహార్, ఇతర వెనుకబడిన రాష్ట్రాలకు హోదా ఇవ్వాలని జేడీయూ ఎంపీ మండల్ అడిగిన ప్రశ్నకు ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ‘హోదా పొందడానికి గల 5 అర్హతలు బిహార్‌కు లేవని ఇంటర్ మినిస్టీరియల్ గ్రూప్ (IMG) నివేదిక ఇచ్చింది. దాని ప్రకారం స్పెషల్ స్టేటస్ కుదరదు’ అని తేల్చి చెప్పారు.

News July 22, 2024

3.2%కి తగ్గిన నిరుద్యోగిత రేటు: నిర్మలా సీతారామన్

image

దేశంలో నిరుద్యోగిత రేటు 2022-23 నాటికి 3.2%కి తగ్గిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2023-24 ఆర్థిక సర్వేను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 2024-25FYలో దేశ GDP 6.5%-7% వృద్ధిని నమోదు చేయవచ్చని పేర్కొన్నారు. ఆటో మొబైల్ రంగంలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం వల్ల ₹67,690 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయని, ₹14,000కోట్లు కార్యరూపం దాల్చాయని పేర్కొన్నారు.

News July 22, 2024

డెమోక్రాట్లకు ఒబామా హెచ్చరిక

image

మున్ముందు ఊహించని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని డెమోక్రటిక్ పార్టీ నేతల్ని మాజీ అధ్యక్షుడు ఒబామా హెచ్చరించారు. అధ్యక్ష బరి నుంచి బైడెన్ తప్పుకొన్న సంగతి తెలిసిందే. ఇది ట్రంప్‌నకు మరింత సానుకూలం కాగా డెమోక్రటిక్ పార్టీకి కొత్త అభ్యర్థిని వెతకడం, గెలిపించుకోవడం వంటి సవాళ్లున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒబామా పార్టీ నేతలతో మాట్లాడారు. భవిష్యత్తు కోసం బైడెన్ తప్పుకోవడం గొప్ప విషయమంటూ కొనియాడారు.

News July 22, 2024

ఇన్‌స్టా మార్ట్‌పై కన్నేసిన అమెజాన్!

image

ఇన్‌స్టామార్ట్ బిజినెస్‌ను కొనేందుకు అమెజాన్ ఆసక్తికరంగా ఉందని సమాచారం. ఇప్పటికే స్విగ్గీని సంప్రదించినట్టు వార్తలు వస్తున్నాయి. ఐపీవోకు ముందే వాటా దక్కించుకోవడం లేదా మొత్తంగా వ్యాపారాన్నే కైవసం చేసుకొనే ప్లాన్‌లో ఉందట. సొంతంగా క్విక్ కామర్స్ రంగంలోకి రావాలని అమెజాన్ కొన్ని నెలలుగా ప్రయత్నిస్తోంది. అయితే గ్లోబల్‌గా క్లియరెన్స్ రావడానికి టైమ్ పట్టేలా ఉండటంతో స్విగ్గీ దారి ఎంచుకొందని తెలుస్తోంది.

News July 22, 2024

7,934 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

image

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) 7,934 జూనియర్ ఇంజినీర్ (జేఈ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జులై 30 నుంచి ఆగస్టు 29 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు: 18-36 ఏళ్లు. విద్యార్హత: బీటెక్/బీఈ. CBT-1, CBT-2, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. త్వరలో పరీక్ష తేదీలను ప్రకటించనున్నారు. ప్రారంభ వేతనం రూ.35,400+అలవెన్సులు ఉంటాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News July 22, 2024

26 వరకు అసెంబ్లీ సమావేశాలు

image

AP: అసెంబ్లీ సమావేశాలు ఈనెల 26 వరకు జరగనున్నాయి. స్పీకర్ అయ్యన్నపాత్రుడి అధ్యక్షతన జరిగిన బీఏసీ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, హెల్త్ వర్సిటీ పేరు మార్పు బిల్లులతో పాటు కొన్ని శ్వేతపత్రాలను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లు స్పీకర్ తెలిపారు. సీఎం సూచనతో నలుగురు ప్యానల్ స్పీకర్లను నియమించనున్నట్లు ఆయన వెల్లడించారు.

News July 22, 2024

IAS స్మితా సబర్వాల్‌పై విమర్శలు

image

సివిల్స్‌లో వికలాంగుల కోటాపై IAS స్మితా సబర్వాల్‌ చేసిన <<13679127>>వ్యాఖ్యలపై<<>> సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయంపై ఓ వైద్యుడు స్పందిస్తూ తాను డాక్టర్ కావడానికి దివ్యాంగులైన టీచర్లు పాఠాలు చెప్పారన్నారు. వాళ్లకు అవకాశం ఇవ్వకపోతే గొప్ప గురువులను కోల్పోయేవారిమన్నారు. వైద్యం చదివేందుకు, చెప్పేందుకు, చేసేందుకు అంగవైకల్యం అడ్డు కాదని, అలాగే పరిపాలనకు ఇది మినహాయింపు కాదన్నారు. దీనిపై మీ కామెంట్?

News July 22, 2024

విప్రో షేర్లు క్రాష్.. ఎందుకంటే?

image

FY25 Q1లో విప్రో ఫలితాలు నిరాశపరిచాయి. ఆదాయం కేవలం రూ.21,963 కోట్లుగా నమోదైంది. త్రైమాసిక ప్రాతిపదికన వృద్ధిరేటు ఒక శాతం తగ్గింది. క్యూ2 గైడెన్స్ సైతం అంచనాలను అందుకోలేదు. పైగా పోటీ సంస్థలైన TCS, ఇన్ఫోసిస్ రెవెన్యూ 2-3% పెరిగింది. దీంతో నేటి సెషన్లో విప్రో షేర్లు 9% మేర క్రాష్ అయ్యాయి. ప్రస్తుతం రూ.50 నష్టంతో రూ.507 వద్ద ట్రేడవుతున్నాయి. సిటీ రూ.495 టార్గెట్ ధరతో సెల్ రేటింగ్ ఇవ్వడం గమనార్హం.