news

News October 18, 2024

పోలీసులకు శుభవార్త

image

AP: రాష్ట్ర పోలీసులకు డీజీపీ ద్వారకా తిరుమలరావు శుభవార్త చెప్పారు. పోలీసులకు రుణాలు, బీమా, పరిహారం అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. నిలిచిపోయిన గ్రూప్ ఇన్సూరెన్స్‌ను పునరుద్ధరించామన్న ఆయన సర్వీస్ హోంగార్డు మరణిస్తే పరిహారం అందిస్తామన్నారు. అటు ఈ నెల 21 నుంచి 31 వరకు పోలీసు సంస్మరణ దినోత్సవాలు నిర్వహిస్తామని, దేశంలో అమరులైన పోలీసుల పేర్లన్నీ చదువుతామని చెప్పారు.

News October 18, 2024

9 యూనివర్సిటీలకు వీసీల నియామకం

image

TG: * కాకతీయ వర్సిటీ – ప్రతాప్ రెడ్డి
* ఉస్మానియా – ఎం.కుమార్
* పాలమూరు – శ్రీనివాస్
* శాతవాహన – ఉమేశ్ కుమార్
* తెలుగు వర్సిటీ – నిత్యానంద రావు
* మహాత్మాగాంధీ వర్సిటీ – అల్తాఫ్ హుస్సేన్
* తెలంగాణ వర్సిటీ – యాదగిరి రావు
* వ్యవసాయ వర్సిటీ – అల్దాస్ జానయ్య
* ఉద్యానవన వర్సిటీ – రాజిరెడ్డి

News October 18, 2024

బినామీ పదానికి అర్థమేంటి? ఈ చట్టమేంటి?

image

బినామీ హిందీపదం. పేరు లేదని దీనర్థం. ఏదైనా ఆస్తి ఓనర్ కాకుండా ఇతరుల పేరుతో ఉంటే దానిని బినామీ ప్రాపర్టీ అంటారు. 1988లో బినామీ లావాదేవీల నిషేధ చట్టం కేవలం 8 సెక్షన్లతో అమల్లోకి వచ్చింది. 2016లో మోదీ ప్రభుత్వం దానిని 72 సెక్షన్లకు పెంచుతూ సవరించింది. అనేక ఆస్తులు, మోసాలు, లావాదేవీలను వర్గీకరించింది. స్థిర, చర, టచ్ చేయలేని, కనిపించని ఆస్తులూ ఇందులో చేర్చింది. కొన్నిటికి కఠిన శిక్షలు నిర్దేశించింది.

News October 18, 2024

సెహ్వాగ్ రికార్డును అధిగమించిన సౌథీ

image

టెస్టుల్లో వీరేంద్ర సెహ్వాగ్(91) సిక్సర్ల రికార్డును న్యూజిలాండ్ ప్లేయర్ టిమ్ సౌథీ అధిగమించారు. భారత్‌తో జరుగుతున్న టెస్టులో నాలుగు సిక్సర్లు బాదిన సౌథీ(93) ఈ ఘనత తన ఖాతాలో వేసుకున్నారు. ఓవరాల్‌గా అత్యధిక సిక్సర్ల రికార్డు బెన్ స్టోక్స్(131) పేరిట ఉంది. ఈ జాబితాలో సౌథీ(93) ప్రస్తుతం ఆరో స్థానంలో ఉన్నారు. భారత జట్టు నుంచి సెహ్వాగ్ తర్వాత హిట్ మ్యాన్ రోహిత్(87) ఉన్నారు.

News October 18, 2024

అడ్డగోలు ధరలకు ఇసుక విక్రయాలు: జగన్

image

AP: ఉచిత ఇసుక ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వంలో అడ్డగోలు ధరలకు విక్రయిస్తున్నారని మాజీ సీఎం జగన్ అన్నారు. తమ హయాంతో పోలిస్తే ప్రభుత్వానికి ఆదాయం లేకపోగా రెండింతలు-మూడింతలు రేట్లు పెంచారని విమర్శించారు. పండుగ వేళ ఇసుక టెండర్లు పిలిచి సొంత వాళ్లకు దోచిపెట్టారని దుయ్యబట్టారు. వైసీపీ పాలనలో ఇసుక పాలసీ పారదర్శకంగా ఉందని చెప్పారు. ఇటీవల మద్యం టెండర్లలోనూ భారీ కుంభకోణాలకు తెరదీశారని ఆరోపించారు.

News October 18, 2024

రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది: జగన్

image

AP: రాష్ట్రంలో మాఫియా సామ్రాజ్యం నడుస్తోందని మాజీ సీఎం జగన్ విరుచుకుపడ్డారు. ఏపీలో దోచుకో, పంచుకో, తినుకో అనేలా పాలన సాగుతోందని దుయ్యబట్టారు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, అధికారంలోకి వచ్చి 5 నెలలైనా సూపర్ 6 జాడే లేదన్నారు. హామీలపై ప్రజలు నిలదీస్తారని భయపడుతున్నారని అన్నారు. మార్పుల పేరు చెబుతూ కూటమి ప్రభుత్వం స్కాములకు తెరదీస్తోందని విమర్శించారు.

News October 18, 2024

నిలకడగా ఆడుతున్న భారత ఓపెనర్లు

image

న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్లు నిలకడగా ఆడుతున్నారు. టీ సమయానికి స్కోర్ 15 ఓవర్లలో 57/0గా ఉంది. రోహిత్ శర్మ 27, యశస్వి జైస్వాల్ 29 రన్స్‌తో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 299 పరుగులు వెనుకబడి ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా 46, న్యూజిలాండ్ 402 స్కోర్ చేసిన సంగతి తెలిసిందే.

News October 18, 2024

వచ్చే వారం రష్యాకు మోదీ.. ఎందుకంటే!

image

PM మోదీ వచ్చేవారం రష్యా వెళ్తున్నారు. వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు అక్టోబర్ 22, 23 తేదీల్లో కజాన్‌లో BRICS 16వ సమ్మిట్లో పాల్గొంటారు. అదే టైమ్‌లో సభ్యదేశాల అధినేతలతో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తారని విదేశాంగ శాఖ తెలిపింది. ‘Strengthening Multilateralism for Just Global Development and Security’ థీమ్‌తో తాజా సమ్మిట్ జరుగుతోందని పేర్కొంది. బ్రిక్స్ ప్రాజెక్టుల ప్రోగ్రెస్‌ను పరిశీలిస్తారంది.

News October 18, 2024

సంచలనం.. ఇద్దరే 20 వికెట్లు కూల్చేశారు

image

రెండో టెస్టులో ENGపై పాకిస్థాన్ 152 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపులో స్పిన్నర్లు సాజిద్ ఖాన్, నోమన్ అలీ కీలక పాత్ర పోషించారు. రెండు ఇన్నింగ్సులూ కలిపి వీరిద్దరే 20 వికెట్లు కూల్చేశారు. టెస్టు క్రికెట్‌లో ఇలాంటి ఘనత సాధించిన ఏడో ద్వయంగా వీరు నిలిచారు. 52 ఏళ్లలో ఇదే తొలిసారి. నోమన్ 11(3+8), సాజిద్ 9(7+2) వికెట్లు పడగొట్టారు. రెండో ఇన్నింగ్స్‌లో వీరిద్దరే బౌలింగ్ చేయడం మరో విశేషం.

News October 18, 2024

రెండు ఖండాలను కలిపే బ్రిడ్జ్ గురించి తెలుసా?

image

రెండు గ్రామాల మధ్య బ్రిడ్జి ఉండటం కామన్. కానీ, 2 ఖండాలను కలిపే వంతెన గురించి మీకు తెలుసా? నార్త్ అమెరికా, యూరప్‌ ఖండాలను కలిపే ‘బ్రిడ్జ్ బిట్వీన్ కాంటినెంట్స్’ అనే ఫుట్ బ్రిడ్జి ఐస్‌లాండ్‌లో ఉంది. 50 అడుగుల పొడవైన ఈ బ్రిడ్జిని దాటితే గ్రీన్స్‌లాండ్స్‌‌పై అడుగుపెట్టొచ్చు. ఇక్కడ ఎలాంటి పర్మిషన్ లేకుండా ఈజీగా ఖండాన్ని దాటొచ్చు. భూమిపై ఏర్పడిన చీలికతో ఖండాన్ని విభజించిన గుర్తులు కనిపిస్తాయి.