News October 18, 2024

అడ్డగోలు ధరలకు ఇసుక విక్రయాలు: జగన్

image

AP: ఉచిత ఇసుక ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వంలో అడ్డగోలు ధరలకు విక్రయిస్తున్నారని మాజీ సీఎం జగన్ అన్నారు. తమ హయాంతో పోలిస్తే ప్రభుత్వానికి ఆదాయం లేకపోగా రెండింతలు-మూడింతలు రేట్లు పెంచారని విమర్శించారు. పండుగ వేళ ఇసుక టెండర్లు పిలిచి సొంత వాళ్లకు దోచిపెట్టారని దుయ్యబట్టారు. వైసీపీ పాలనలో ఇసుక పాలసీ పారదర్శకంగా ఉందని చెప్పారు. ఇటీవల మద్యం టెండర్లలోనూ భారీ కుంభకోణాలకు తెరదీశారని ఆరోపించారు.

Similar News

News November 13, 2025

ఈ టిప్స్‌తో ల్యాప్‌టాప్ బ్యాటరీ హెల్త్ సేఫ్‌

image

ల్యాప్‌టాప్‌లలో ఉపయోగించే లిథియం-అయాన్ బ్యాటరీలు 20-80% ఛార్జింగ్ ఉన్నప్పుడు బాగా పనిచేస్తాయి. 100% ఛార్జ్ చేసిన ప్రతిసారీ బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది. 25% కంటే తక్కువకు చేరినప్పుడు ఛార్జింగ్ పెట్టాలి. కంపెనీ లేదా సర్టిఫైడ్ ఛార్జర్లనే వాడాలి. అధిక చల్లదనం, వేడి ప్రాంతాల్లో, బెడ్, బ్లాంకెట్‌పై ఉంచి ల్యాప్‌టాప్ వాడొద్దు. బ్రైట్‌నెస్, బ్యాక్‌గ్రౌండ్ యాప్స్‌ బ్యాటరీ హెల్త్‌పై ప్రతికూల ప్రభావం చూపుతాయి.

News November 13, 2025

బంగాళదుంపతో బ్యూటిఫుల్ స్కిన్

image

బంగాళదుంపలో ఉండే బ్లీచింగ్ లక్షణాలు పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్, డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగించడంలో సహాయపడతాయి. చర్మసంరక్షణలో దీన్ని ఎలా వాడాలంటే..* బంగాళదుంప రసానికి తేనె కలిపి ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖం ప్రకాశవంతంగా మారుతుంది. * బంగాళదుంప రసానికి పెరుగు కలిపి ముఖానికి రాసి పావుగంట తర్వాత కడిగేయాలి. ఈ ప్యాక్ చర్మంపై ఉండే మలినాలను తొలగిస్తుంది.

News November 13, 2025

పరిస్థితి తీవ్రంగా ఉంది.. మాస్కులు సరిపోవు: SC

image

ఢిల్లీ గాలి కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితి తీవ్రంగా ఉందని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు మాస్కులు సరిపోవని చెప్పింది. లాయర్లు వర్చువల్‌గా విచారణకు హాజరుకావాలని సూచించింది. ఈ కాలుష్యం వల్ల శాశ్వత నష్టం జరుగుతుందని చెప్పింది. పంట వ్యర్థాలను తగలబెట్టడాన్ని అరికట్టేందుకు తీసుకున్న చర్యలపై స్టేటస్ రిపోర్టు దాఖలు చేయాలని పంజాబ్, హరియాణా ప్రభుత్వాలను ఆదేశించింది.