India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: ఈ నెల 22న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కోనసీమ, ఉమ్మడి గోదావరి జిల్లాలు, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వానలు పడతాయని అంచనా వేసింది. అల్పపీడన ప్రభావం తెలంగాణపై కూడా ఉంటుందని తెలిపింది.
TG: రాష్ట్ర క్యాబినెట్ ఈనెల 23న భేటీ కానుంది. రైతు భరోసా విధి విధానాలు, మూసీ నిర్వాసితులను ఆదుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు, ఫ్యామిలీ హెల్త్ డిజిటల్ కార్డు ప్రాజెక్టు, అసెంబ్లీ సమావేశాల తేదీపై చర్చించనుంది. కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదా, ధరణి స్థానంలో భూమాత పోర్టల్, హైడ్రాకు మరిన్ని అధికారాలు, గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి వంటి అంశాలకు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.
AP: రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్‌ను నవంబర్ రెండో వారంలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆర్థిక శాఖ అధికారులు బడ్జెట్ రూపకల్పనపై కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల దృష్ట్యా గత ప్రభుత్వం ఏప్రిల్-జులై వరకు, కూటమి ప్రభుత్వం ఆగస్టు-నవంబర్ వరకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను సమర్పించిన విషయం తెలిసిందే. ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్‌లో అమరావతి, పోలవరం, సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపు చేస్తారని సమాచారం.
AP: వచ్చే జనవరిలో ‘తల్లికి వందనం’ పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులందరికీ ఈ పథకం వర్తించనుంది. ఇంట్లో ఎంతమంది చదువుతుంటే అంతమందికీ రూ.15 వేల చొప్పున ఇస్తామని టీడీపీ మేనిఫెస్టోలో ప్రకటించింది. ఇందుకు రూ.12 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా. రూ.20 వేల లబ్ధి చేకూర్చే ‘అన్నదాత సుఖీభవ’ను మార్చి/ఏప్రిల్‌లో అమలు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.
‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ తర్వాత ఏడాదిగా వెండి తెరకు దూరంగా ఉన్న అనుష్క త్వరలోనే ప్రేక్షకులను పలకరించనున్నారు. ఆమె తొలి మలయాళ చిత్రం ‘కథనార్- ది వైల్డ్ సోర్సెరర్’ చిత్రీకరణ పూర్తయినట్లు మేకర్స్ వెల్లడించారు. హారర్ ఫాంటసీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. డైరెక్టర్ రోజిన్ థామస్ ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.
TG: అభివృద్ధి చేయడం తెలియక కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ మురుగులో పొర్లుతోందని KTR అన్నారు. ‘పనికిమాలిన మాటలు, పాగల్ పనులతో రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. మూసీ ప్రాజెక్టుతోనే HYD అభివృద్ధి అవుతుందన్న చేతకాని దద్దమ్మ తెలుసుకోవాల్సింది చాలా ఉంది. మూసీ ప్రాజెక్టుతో సంబంధం లేకుండానే GDP, IT ఎగుమతులు వంటి అంశాల్లో HYD నం.1 అయింది’ అని CM రేవంత్‌పై మండిపడ్డారు.
AP: టీడీపీ చీఫ్, సీఎం చంద్రబాబు ఇవాళ పార్టీ MLAలు, MLCలు, MPలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. TDP సభ్యత్వ నమోదు, పార్టీ బలోపేతం, పల్లె పండుగ, పంచాయతీరాజ్ వ్యవస్థ తదితర 8 అంశాలపై చర్చిస్తారు. అలాగే మార్చిలో జరిగే పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలపై సీఎం దిశానిర్దేశం చేస్తారు. మద్యం, ఇసుక వ్యవహారాలు, నామినేటెడ్ పదవుల కేటాయింపు, క్షేత్రస్థాయి సమస్యలపైనా చర్చ జరుగుతుందని సమాచారం.
గాజాలోని హమాస్ చీఫ్ యాహ్యా సిన్వర్‌ను ఇజ్రాయెల్‌కు చెందిన యువ సైనికులు హతమార్చారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న సైనికులు 9 నెలల క్రితమే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్‌లో చేరారు. గతేడాది ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు దాడులు చేసినప్పుడు వారు ఆర్మీలోనే లేరు. ప్రస్తుతం వారందరి వయసు 19-21 ఏళ్ల మధ్యే ఉండటం గమనార్హం. మరణించింది యాహ్యా అని ధ్రువీకరించేందుకు అతడి చేతివేలును కట్ చేసి DNA టెస్ట్ చేశారు.
గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్ సరిహద్దులపై హమాస్ జరిపిన దాడిలో 1200 మంది మరణించారు. 250 మందిని బందీలుగా గాజాకు తీసుకెళ్లారు. దీంతో గాజాపై యుద్ధం ప్రకటించిన ఇజ్రాయెల్ హమాస్ అగ్రనేతలందరినీ చంపుతామని ప్రతిజ్ఞ చేసింది. అప్పటి నుంచి ఒక్కొక్కరిని వేటాడుతూ మట్టుబెట్టింది. మహమ్మద్ డైఫ్, ఇస్మాయిల్ హనియే, మర్వాన్ ఇస్సా, రాద్ సాద్, సలేహ్ అల్-అరౌరీ, యాహ్యా సిన్వార్ ఇలా టాప్ కమాండర్లందరినీ చంపేసింది.
TG: మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు. ఈ కేసులో కేటీఆర్ సాక్ష్యాన్ని కోర్టు నమోదు చేయనుంది. ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్ నుంచి ఆయన పార్టీ కార్యకర్తలతో కలిసి కోర్టుకు చేరుకుంటారు.
Sorry, no posts matched your criteria.