News October 18, 2024

టీడీపీ ప్రజాప్రతినిధులతో నేడు సీఎం కీలక భేటీ

image

AP: టీడీపీ చీఫ్, సీఎం చంద్రబాబు ఇవాళ పార్టీ MLAలు, MLCలు, MPలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. TDP సభ్యత్వ నమోదు, పార్టీ బలోపేతం, పల్లె పండుగ, పంచాయతీరాజ్ వ్యవస్థ తదితర 8 అంశాలపై చర్చిస్తారు. అలాగే మార్చిలో జరిగే పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలపై సీఎం దిశానిర్దేశం చేస్తారు. మద్యం, ఇసుక వ్యవహారాలు, నామినేటెడ్ పదవుల కేటాయింపు, క్షేత్రస్థాయి సమస్యలపైనా చర్చ జరుగుతుందని సమాచారం.

Similar News

News July 11, 2025

అమెరికాలో రిచెస్ట్ ఇండియన్ ఇతడే

image

విద్య, ఉపాధి కోసం అమెరికా వెళ్లిన కొందరు భారతీయులు అక్కడివారిని మించి సంపాదిస్తున్నారు. ‘2025 అమెరికా రిచెస్ట్ ఇమ్మిగ్రెంట్స్ లిస్ట్’ను ఫోర్బ్స్ విడుదల చేసింది. ఇందులో జెడ్‌స్కేలర్ కో ఫౌండర్ జై చౌదరి $17.9 బిలియన్లతో (రూ.1.53 లక్షల కోట్లు) అగ్ర స్థానంలో నిలిచారు. ఆ తర్వాత వినోద్ ఖోస్లా ($9.2 billion), రాకేశ్ గంగ్వాల్ ($6.6 b), రొమేశ్ టీ వాద్వానీ ($5.0 b), రాజీవ్ జైన్ ($4.8 b) ఉన్నారు.

News July 11, 2025

బీసీ రిజర్వేషన్లతో కాంగ్రెస్‌కు ‘పట్టు’ దొరికేనా?

image

TG: ఎన్నికల హామీ మేరకు BC రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేసింది. రాష్ట్రంలో ఇటీవల BJPకి BCల మద్దతు పెరిగినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో రిజర్వేషన్లు అమలైతే రెడ్డి, SC వర్గాల్లో బలంగా ఉన్న INCవైపు BCలూ మొగ్గు చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీంతో రాబోయే స్థానిక ఎన్నికలతో పాటు 2028 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీకి బలం పెరుగుతుందనేది విశ్లేషకుల అభిప్రాయం. మీరేమంటారు?

News July 11, 2025

పెరిగిన బంగారం ధరలు

image

బంగారం ధరలు ఇవాళ పెరిగాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై ₹600 పెరిగి ₹99,000కు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర ₹550 పెరిగి ₹90,750 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.1000 ఎగబాకి రూ.1,21,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.