news

News October 17, 2024

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నారాయణపేట, గద్వాల, నాగర్ కర్నూల్, MBNR, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, జనగామ, వరంగల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, NZB, జగిత్యాల, కరీంనగర్, కొత్తగూడెం, ఖమ్మం తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది.

News October 17, 2024

‘ఎమర్జెన్సీ’కి సెన్సార్ సర్టిఫికేట్ వచ్చింది: కంగన

image

తన సినిమా ఎమర్జెన్సీకి సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిందని నటి కంగనా రనౌత్ వెల్లడించారు. సర్టిఫికేట్ రావడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామన్నారు. అభిమానులు సహనంతో ఉండి మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. కాగా ఇందులో ఇందిరా గాంధీని, ఒక వర్గం ప్రజలను తప్పుగా చూపించారంటూ అభ్యంతరాలు వ్యక్తం అయిన సంగతి తెలిసిందే.

News October 17, 2024

తల్లిదండ్రుల కోసమే ఆ సినిమా చేశాను: షారుఖ్

image

2003లో రిలీజైన ‘దేవదాస్’ సినిమా షారుఖ్ ఖాన్ కెరీర్లో ఓ లాండ్ మార్క్ మూవీగా నిలిచింది. అయితే ఆ సినిమాలో తాను నటించాలనుకోలేదని ఓ ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. ‘నా కెరీర్లో అప్పటి వరకు భారీతనంతో కూడిన సినిమా లేదు. స్వర్గంలో ఉన్న నా తల్లిదండ్రులు నన్ను చూస్తుంటారని నా నమ్మకం. వారు పైనుంచి నన్ను చూసి గర్వపడేలా చేయాలనుకున్నాను. అందుకే సన్నిహితులు వద్దన్నా ఆ సినిమా ఒప్పుకొన్నాను’ అని వివరించారు.

News October 17, 2024

BREAKING: పట్టాలు తప్పిన రైలు

image

అస్సాంలోని డిమా హసావో జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. అగర్తల-ముంబై మధ్య నడిచే లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్(12520) పట్టాలు తప్పింది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈరోజు సా.4 గంటలకు డిమా హసావో జిల్లాలోని దిబ్లాంగ్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రైలు ఇంజిన్, నాలుగు కోచ్‌లు పట్టాలు తప్పినట్లు సమాచారం. ప్రాణనష్టం జరిగిందా? అనేది తెలియాల్సి ఉంది.

News October 17, 2024

అప్పుడు లేని ఆరోపణలు ఇప్పుడెందుకు?: రేవంత్

image

TG: మూసీ ప్రాజెక్ట్‌ పనులు దక్కించుకున్న సంస్థపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని CM రేవంత్ ఫైర్ అయ్యారు. ‘ముచ్చింతల్‌లో KCR, మైహోం రామేశ్వర్, చినజీయర్ కలిసి సమతామూర్తి విగ్రహం ఏర్పాటు చేశారు. దాన్ని అద్భుతమంటూ స్వయంగా PM మోదీనే వచ్చి ఆవిష్కరించారు. ఆ విగ్రహం కట్టిన సంస్థే ఇప్పుడు మూసీ ప్రాజెక్ట్ పనులు చేపడుతోంది. అప్పుడు లేని ఆరోపణలు, అపోహలు ఇప్పుడెందుకు వస్తున్నాయి?’ అని ప్రశ్నించారు.

News October 17, 2024

యువతితో టీడీపీ నేత రాసలీలలు! వీడియో వైరల్

image

AP: టీడీపీ నేత గాజుల ఖాదర్ బాషా తనను లైంగికంగా వేధించారని ఓ యువతి ఆరోపించింది. రేషన్ కార్డు, ఇంటి స్థలం, పెన్షన్ ఇప్పిస్తానని నమ్మించి లైంగిక దాడి చేశారని పేర్కొంది. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఖాదర్ బాషా రాష్ట్ర మంత్రికి ప్రధాన అనుచరుడని సమాచారం. ఈ ఆరోపణలపై ఖాదర్ బాషా స్పందించాల్సి ఉంది.
NOTE: బాధితురాలి ప్రైవసీ దృష్ట్యా వీడియోను పబ్లిష్ చేయడం లేదు.

News October 17, 2024

తొలి టెస్ట్: 134 పరుగుల ఆధిక్యంలో NZ

image

బెంగళూరు వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ 134 పరుగుల ఆధిక్యంలో ఉంది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియా బ్యాటర్లు చేతులెత్తేయడంతో 46 పరుగులకే ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన NZ రెండో రోజు ఆట ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. కాన్వే(91), యంగ్(33) పరుగులు చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్, అశ్విన్, జడేజా తలో వికెట్ తీశారు.

News October 17, 2024

మూసీ ప్రాజెక్టులో ఒక్క రూపాయి కూడా ఆశించట్లేదు: రేవంత్

image

TG: రాష్ట్రాన్ని, నగరాన్ని బాగుచేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తనకు ఇప్పటికే ఆస్తి, అంతస్తులు, పదవి అన్నీ వచ్చాయని చెప్పారు. ఈ సమయంలో ఎవ్వరినో మోసం చేయాల్సిన అవసరం లేదన్నారు. మూసీ ప్రాజెక్టుకు వెచ్చించే రూ.1.50 లక్షల కోట్లలో తాము ఒక్క రూపాయి కూడా ఆశించట్లేదని సీఎం తెలిపారు. తమ మంత్రులు కూడా ప్రజలకు మేలు చేసేందుకే పనిచేస్తున్నారని పేర్కొన్నారు.

News October 17, 2024

హోరాహోరీగా పోరాడి చిరుతను చంపిన వృద్ధ రైతు

image

యూపీలోని బిజ్నోర్ జిల్లాలో రైతు తగ్వీర్ సింగ్(60) తనపై దాడి చేసిన చిరుతను కొట్టి చంపారు. కలాఘర్ ప్రాంతంలోని భిక్కవాలా గ్రామంలో తగ్వీర్ తన పొలంలో పని చేస్తుండగా ఓ చిరుత అకస్మాత్తుగా దాడి చేసింది. అతడిని పొదల్లోకి తీసుకెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. అయితే తన దగ్గరున్న కర్రతో చిరుత తలపై బాదడంతో అది మృతి చెందింది. తగ్వీర్ పరిస్థితి సైతం విషమంగా ఉంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

News October 17, 2024

KTR, హరీశ్, ఈటలకు కిరాయి చెల్లిస్తా: రేవంత్

image

మూసీ పునరుజ్జీవాన్ని అడ్డుకునే నేతలు మూడు నెలలు ఆ పరీవాహక ప్రాంతంలో ఉండాలని CM రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. KTR,హరీశ్, ఈటల మూసీ ఒడ్డున ఇళ్లలో ఉంటే తానే కిరాయి చెల్లిస్తానన్నారు. లేదంటే ఖాళీ చేయించిన ఇళ్లలో అయినా ఉండొచ్చన్నారు. ఆ టైంలో వారికి ఆహారం సహా ఇతర సౌకర్యాలూ చెల్లించాలని కమిషనర్ దానకిషోర్‌ను ఆదేశిస్తున్నట్లు చెప్పారు. వారు ఉండలేరని, ఉంటే ఈ ప్రాజెక్టు వెంటనే ఆపేస్తానని CM ఛాలెంజ్ విసిరారు.