News July 17, 2024

జరగబోయేదాన్ని ఎవరు ఆపగలరు: భోలే బాబా

image

UPలోని హాథ్రస్‌లో సత్సంగ్ నిర్వహించిన భోలే బాబా కాస్‌గంజ్‌లోని తన ఆశ్రమానికి తిరిగొచ్చారు. జులై 2న తన సత్సంగ్‌లో <<13577290>>తొక్కిసలాట <<>>జరిగి 121 మంది చనిపోయిన ఘటనలో కుట్ర కోణం ఉందని ఆరోపించారు. ‘ఆ దుర్ఘటన ఎంతో బాధించింది. కానీ జరగబోయేదాన్ని ఎవరు ఆపగలరు? వచ్చిన వారు ఏదో ఒక రోజు పోవాల్సిందే. అక్కడ విషపూరిత స్ప్రే గురించి ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. దీని వెనుక కుట్ర ఉంది. పోలీసుల విచారణలో నిజాలు బయటకొస్తాయి’ అని తెలిపారు.

Similar News

News December 13, 2024

కంటి ఆరోగ్యానికి ‘అమ్మ’ వంటిది.. ఉసిరి

image

మొబైల్, కంప్యూటర్‌ను విపరీతంగా చూడటం వల్ల నేత్ర సమస్యలు పెరుగుతున్నాయి. ఉసిరితో వీటిని తగ్గించుకోవచ్చని కొన్ని స్టడీస్ చెబుతున్నాయి. ఇందులోని విటమిన్-సి కంట్లో ఆక్సిడేషన్ స్ట్రెస్‌ను తగ్గిస్తుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఫ్రీ ర్యాడికల్స్ నుంచి కణాలను కాపాడతాయి. కంటి అలసట, పొడిబారడం, చిరాకు, మసక చూపుకు విటమిన్-ఏ చెక్ పెడుతుంది. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలతో కంటి నొప్పి, ఎర్రబారడం తగ్గుతాయి.

News December 13, 2024

జేసీబీ వ్యాఖ్యల ఎఫెక్ట్.. సిద్ధార్థ్ మూవీకి షాక్?

image

హీరో సిద్ధార్థ్ నటించిన ‘మిస్ యూ’ ఈరోజు రిలీజైంది. తమిళనాడులో ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తున్నా తెలంగాణలో మాత్రం టికెట్స్ కొనుగోలు జరగట్లేదని సినీవర్గాలు పేర్కొన్నాయి. హైదరాబాద్ సిటీ అడ్వాన్స్ బుకింగ్స్‌లో నిన్నటి వరకు కేవలం 50 టికెట్లే బుక్ అయినట్లు వెల్లడించాయి. సుదర్శన్‌లో 5 టికెట్లు బుక్కయ్యాయి. ‘పుష్ప-2’ ఈవెంట్‌పై ఆయన చేసిన<<14838054>> జేసీబీ<<>> వ్యాఖ్యలే దీనికి కారణం అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

News December 13, 2024

BREAKING: RBI హెడ్ క్వార్టర్స్‌కు బాంబు బెదిరింపులు

image

ముంబైలోని ఆర్బీఐ ప్రధాన కార్యాలయాన్ని పేల్చివేస్తామంటూ ఆగంతుకులు బెదిరించారు. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్‌కు బెదిరింపు మెయిల్ చేశారు. రష్యన్ భాషలో ఈ మెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలోని పలు స్కూళ్లకు కూడా ఇవాళ వరుస బాంబు బెదిరింపులు వచ్చాయి. వీటన్నింటిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.