news

News July 17, 2024

యూపీ కేబినెట్‌లో మార్పులు?

image

UP సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇవాళ గవర్నర్‌ను కలవనున్నట్లు తెలుస్తోంది. కేబినెట్‌లో మార్పులు చేయనున్నట్లు సమాచారం. యూపీ BJPలో లుకలుకలున్నాయని కొన్నిరోజులుగా ప్రచారం సాగుతోంది. డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్‌తో CMకు విభేదాలున్నాయనే ఊహాగానాలున్నాయి. దీంతో ఆయనకు పార్టీ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ‘ప్రభుత్వం కంటే పార్టీనే పెద్దది. పార్టీ కంటే ఎవరూ పెద్దవారు కాదు’ అని కేశవ్ వ్యాఖ్యానించారు.

News July 17, 2024

ఏడాదికి సరిపడా వర్షపాతం ఒకేరోజులో!

image

చైనాలోని హెనాన్ ప్రావిన్సులో ఆసక్తికర ఘటన జరిగింది. డఫెంగ్యింగ్ అనే పట్టణంలో దాదాపు ఒక ఏడాదిలో కురిసే వర్షపాతం 24 గంటల్లో కురిసింది. ఏకంగా 606.7 మి.మీ వర్షపాతం నమోదు కావడంతో టౌన్ అంతా నీట మునిగింది. దీంతో అక్కడి ప్రజలు దిక్కుతోచని స్థితిలో వణికిపోతున్నారు. హెనాన్, షాండాంగ్, అన్హూయ్ ప్రావిన్సుల్లోనూ విస్తారంగా వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

News July 17, 2024

HYDకి వచ్చేయండి.. నెట్టింట NASSCOMకు ఆహ్వానం!

image

ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్లు కల్పించడంతో కర్ణాటకలోని కంపెనీలు వేరే రాష్ట్రాలకు వెళ్లే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (<<13648455>>NASSCOM<<>>) ప్రభుత్వానికి సూచించింది. దీంతో హైదరాబాద్‌ అనుకూల ప్రాంతమని NASSCOMకు పలువురు నెట్టింట రిక్వెస్ట్ చేస్తున్నారు. కంపెనీలను ఆకర్షించేందుకు ఇదే మంచి అవకాశం అంటూ TG CMO, IT మంత్రికి ట్యాగ్ చేస్తున్నారు.

News July 17, 2024

‘కర్ణాటక రిజర్వేషన్ల బిల్లు’ రద్దు చేయాలని నాస్కామ్ డిమాండ్

image

కర్ణాటక ప్రభుత్వం ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్లు కేటాయించడాన్ని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (Nasscom) తప్పుపట్టింది. ఈ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేసింది. గ్లోబల్ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తి కనబరుస్తున్న వేళ ఈ చర్య సరికాదని పేర్కొంది. లోకల్ టాలెంట్‌కు కొరత ఉందని, ఈ నిర్ణయంతో సంస్థలను మరోచోటుకు తరలించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది.

News July 17, 2024

స్కూళ్లకు ప్రభుత్వం ఆదేశాలు

image

AP: ఈ నెల 22 నుంచి 28 వరకు అన్ని స్కూళ్లలో <<13648551>>’శిక్షా సప్తాహ్’<<>> నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశించింది. ఇందులో విద్యార్థులు, టీచర్లు, తల్లులను భాగస్వామ్యం చేయాలంది. జాతీయ విద్యావిధానం సంస్కరణలు తెలియజేయడమే దీని ఉద్దేశమంది. 22న బోధన అభ్యసన సామగ్రిని టీచర్లు ప్రదర్శించాలని, 27న అమ్మలతో కలిసి విద్యార్థులతో 35 మొక్కలు నాటించాలని, 28న విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనాలు నిర్వహించాలని DEOలకు తెలిపింది.

News July 17, 2024

AP స్కూళ్లలో ‘శిక్షా సప్తాహ్’.. ఏ రోజు ఏం చేయాలంటే?

image

జులై 22: స్థానిక వనరులతో బోధన సామగ్రి ప్రదర్శన
జులై 23: పునాది అభ్యసన, సంఖ్యాశాస్త్రం నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమం
జులై 24: క్రీడా పోటీలు నిర్వహించడం
జులై 25: సాంస్కృతిక కార్యక్రమాలు
జులై 26: సాంకేతిక నైపుణ్యాల దినోత్సవం
జులై 27: పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు
జులై 28: సామాజిక భాగస్వామ్య దినోత్సవం

News July 17, 2024

రూపాయి రూపాయి పోగేసి రుణమాఫీ చేస్తున్నాం: భట్టి

image

TG: రైతులకు పంట రుణాలు మాఫీ చేసేందుకు రూపాయి రూపాయి పోగేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రూ.2లక్షలు ఒకేసారి మాఫీ చేసేందుకు నిద్రలేని రాత్రులు గడిపామని తెలిపారు. అన్ని రైతు కుటుంబాలకు ఆగస్టు ముగిసేలోపు కచ్చితంగా రుణమాఫీ చేస్తామని భట్టి స్పష్టం చేశారు.

News July 17, 2024

ALERT.. కాసేపట్లో ఈ ప్రాంతాల్లో వర్షం

image

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రాత్రి 8 గంటల్లోగా వర్షం కురుస్తుందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మల్కాజ్‌గిరి, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, భువనగిరి ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు రాష్ట్రంలో ఐదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

News July 17, 2024

వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ ఇంటిపైకి బుల్డోజర్

image

వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్‌ ఇంటి బయట ఉన్న అక్రమ నిర్మాణాలను పుణే మున్సిపల్ కార్పొరేషన్ బుల్డోజర్‌తో కూల్చేస్తోంది. దీనిపై ఇప్పటికే నోటీసులు ఇచ్చామని, వారి కుటుంబం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతోనే కూల్చివేతలు చేపట్టామని అధికారులు వివరించారు. బ్యూరోక్రాట్‌గా పదవిని దుర్వినియోగం చేయడం, తప్పుడు పత్రాల్ని సమర్పించడం వంటి పలు ఆరోపణల్ని పూజ ఎదుర్కొంటున్నారు.

News July 17, 2024

ట్రంప్ మళ్లీ గెలిస్తే నాటో పాలసీల్లో మార్పు?

image

మరోసారి అధికారంలోకి వస్తే US అంతర్జాతీయ వ్యవహారాల్లో ట్రంప్ భారీ మార్పులు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా నాటో వ్యవహారాల్లో US పాత్రను తగ్గించేందుకు ట్రంప్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రష్యాపై యుద్ధంలో ఉక్రెయిన్‌కు సాయం అందించినందుకు అమెరికాకు $200 బిలియన్లు పరిహారం చెల్లించమని ఐరోపాను అడుగుతానని ప్రచారం సందర్భంగా ట్రంప్ చెబుతున్నారు. ఉక్రెయిన్‌కు సాయాన్ని కొనసాగించడంపైనా ట్రంప్ విముఖంగా ఉన్నారు.