News July 17, 2024
స్కూళ్లకు ప్రభుత్వం ఆదేశాలు
AP: ఈ నెల 22 నుంచి 28 వరకు అన్ని స్కూళ్లలో <<13648551>>’శిక్షా సప్తాహ్’<<>> నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశించింది. ఇందులో విద్యార్థులు, టీచర్లు, తల్లులను భాగస్వామ్యం చేయాలంది. జాతీయ విద్యావిధానం సంస్కరణలు తెలియజేయడమే దీని ఉద్దేశమంది. 22న బోధన అభ్యసన సామగ్రిని టీచర్లు ప్రదర్శించాలని, 27న అమ్మలతో కలిసి విద్యార్థులతో 35 మొక్కలు నాటించాలని, 28న విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనాలు నిర్వహించాలని DEOలకు తెలిపింది.
Similar News
News December 10, 2024
తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై సీఎం ట్వీట్
TG: డా.బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో నిన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ‘4 కోట్ల ప్రజల మనోఫలకాలపై నిండైన రూపంగా నిన్నటి వరకు నిలిచిన తెలంగాణ తల్లి నేడు సచివాలయ నడిబొడ్డున నిజమైన రూపంగా అవతరించిన శుభ సందర్భం. ఇది తల్లి రుణం తీసుకున్న తరుణం’ అని Xలో రాసుకొచ్చారు.
News December 10, 2024
జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి.. ఆరా తీసిన మంత్రి
TG: మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి ఘటనపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరా తీశారు. జర్నలిస్టు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పారు. మరోవైపు మోహన్ బాబు దాడిని ఖండిస్తున్నట్లు ప్రెస్ అకాడమీ మాజీ ఛైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. వెంటనే ఆయనను అరెస్ట్ చేయాలని, లేకుంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు.
News December 10, 2024
మహిళతో అసభ్య ప్రవర్తన.. స్పందించిన సీఎం
AP: విశాఖలోని ఓ ఆస్పత్రిలో స్కానింగ్ కోసం వచ్చిన మహిళ దుస్తులు విప్పించి సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. సదరు వ్యక్తిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. మహిళలతో ఇలా ప్రవర్తించడం బాధాకరమన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా నిందితుడు ప్రకాశ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు.