India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: రైతు రుణమాఫీని మొత్తం మూడు విడతల్లో జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. టీపీసీసీ నేతలతో ప్రజాభవన్‌లో ఆయన మాట్లాడారు. ‘రేపు సా.4 గంటలకు రూ.లక్ష వరకు ఉన్న రైతు రుణాలకు నిధులు విడుదల చేస్తాం. రూ.7వేల కోట్లు రైతుల ఖాతాల్లోకి వెళ్తాయి. ఈ నెలాఖరులోగా రూ.లక్షన్నర వరకు, ఆగస్టులో రూ.2లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తాం. ఆగస్టు పూర్తయ్యేలోగా 3 విడతల్లో రుణమాఫీ పూర్తవుతుంది’ అని వెల్లడించారు.
AP: కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్న ఆంధ్రా క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్ ఆకే రవికృష్ణ మరికొన్ని రోజుల్లో ఏపీకి రానున్నారు. ఈ మేరకు ఆయన్ను పంపించే ప్రతిపాదనను కేంద్రం ఆమోదించింది. ఏపీలో డ్రగ్స్ నియంత్రణకోసం ఏర్పాటు కానున్న యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ బాధ్యతల్ని ఆయనకు అప్పగించే అవకాశముంది. 2006 బ్యాచ్‌కు చెందిన రవికృష్ణ 2018 నుంచి ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేస్తున్నారు.
సినీ నటుడు, నిర్మాత నారాయణమూర్తి అస్వస్థతకు గురయ్యారు. దీంతో HYD నిమ్స్ ఆస్పత్రిలో డా.బీరప్ప పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఆయన త్వరగా కోలుకోవాలని, పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
TG: తెలుగు భాషలో ప్రభుత్వం ఉత్తర్వులను విడుదల చేయడాన్ని మాజీ ఉపరాష్ట్రపతి <<13639773>>వెంకయ్యనాయుడు<<>> అభినందించడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఆయనకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానని రేవంత్ ట్వీట్ చేశారు. కాగా రైతుల రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం తెలుగులో ఉత్తర్వులను జారీ చేసిన సంగతి తెలిసిందే.
దుబాయ్ రాజు మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కుమార్తె, ప్రిన్సెస్ షైఖా మహ్ర తన భర్త షేక్ మనా బిన్ మహమ్మద్‌కు విడాకులు ఇచ్చారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాలో ప్రకటించారు. దీనికి గల కారణాన్ని సైతం వెల్లడించారు. ‘డియర్ హస్బెండ్.. మీరు సహచరులతో ఎక్కువ సమయం గడుపుతున్నందున నేను మీకు విడాకులు ఇస్తున్నా. తలాఖ్, తలాఖ్, తలాఖ్. మీ మాజీ భార్య’ అని పోస్ట్ చేశారు. రెండు నెలల క్రితమే ఈమె బిడ్డకు జన్మనిచ్చారు.
విశ్వనటుడు కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కిన ‘భారతీయుడు-2’ సినిమాలో మార్పులు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్‌తో సినిమాలోని 12 నిమిషాలను ట్రిమ్ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ట్రిమ్ చేసిన అనంతరం ఎడిషన్‌ను థియేటర్లలో చూడొచ్చని ప్రకటనలో వెల్లడించారు. ఈ సినిమా ఈనెల 12న రిలీజ్ అవ్వగా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది.
సైబర్ నేరగాళ్లు వాట్సాప్ వేదికగా కొత్త స్కాంకు తెర తీశారు. ట్రాఫిక్ ఇ-చలాన్ పేరుతో ఒక APK ఫైల్ పంపిస్తున్నారు. దానిపై క్లిక్ చేయగానే ఫోన్ నియంత్రణను తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. ఈ స్కాం ఇప్పటికే 4,400 ఫోన్లకు చేరిందని సమాచారం. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ సంస్థ క్లౌడ్ ఎస్‌ఈకే హెచ్చరించింది. వియత్నాం కేంద్రంగా ఇండియన్లను ఈ సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.
శ్రీలంకతో జరగబోయే టీ20, వన్డే సిరీస్‌కు భారత జట్టు ప్రకటన వాయిదా పడినట్లు తెలుస్తోంది. తొలుత ఇవాళ జట్టును ప్రకటించనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ జట్టు ఎంపికను సెలక్షన్ కమిటీ వాయిదా వేసినట్లు సమాచారం. టీ20 కెప్టెన్సీ విషయంలో కోచ్, సెలక్టర్లు, బీసీసీఐ మల్లగుల్లాలు పడుతున్నట్లు టాక్. హార్దిక్, సూర్యలలో ఎవరిని సారథిగా నియమించాలనేదానిపై ఇంకా క్లారిటీ రానట్లు తెలుస్తోంది.
AP: చంద్రబాబు ఢిల్లీ పర్యటనలపై APCC చీఫ్ షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు. ‘NDAలో పెద్దన్న పాత్రగా, ఢిల్లీలో చక్రం తిప్పాల్సిన మీరు.. ఢిల్లీ చుట్టూ ఎందుకు చక్కర్లు కొడుతున్నారు? ముక్కుపిండి విభజన సమస్యలపై పట్టుబట్టాల్సింది పోయి BJP పెద్దలకు జీ హుజూర్ అంటూ సలాంలు ఎందుకు కొడుతున్నారు? గెలిచిన రోజు నుంచి 4 సార్లు ఢిల్లీకి వెళ్లినా రాష్ట్ర ప్రయోజనాలపై ఒక్క ప్రకటన అయినా వచ్చిందా?’ అని ఆమె నిలదీశారు.
మహీంద్ర గ్రూప్స్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర ప్రజలకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు Xలో ఆయన తెలుగు భాషలో ట్వీట్ చేశారు. ‘మిత్రులకు, శ్రేయోభిలాషులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మీపై, మీ కుటుంబ సభ్యులపై ఆ శ్రీ మహా విష్ణువు కృప ఉండాలని కోరుకుంటున్నాం’ అని పోస్ట్ చేశారు. దిగ్గజ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర తెలుగులో శుభాకాంక్షలు చెప్పడం ఎంతో ఆనందంగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.