News July 17, 2024

శ్రీలంక సిరీస్‌కు భారత జట్టు ఎంపిక వాయిదా?

image

శ్రీలంకతో జరగబోయే టీ20, వన్డే సిరీస్‌కు భారత జట్టు ప్రకటన వాయిదా పడినట్లు తెలుస్తోంది. తొలుత ఇవాళ జట్టును ప్రకటించనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ జట్టు ఎంపికను సెలక్షన్ కమిటీ వాయిదా వేసినట్లు సమాచారం. టీ20 కెప్టెన్సీ విషయంలో కోచ్, సెలక్టర్లు, బీసీసీఐ మల్లగుల్లాలు పడుతున్నట్లు టాక్. హార్దిక్, సూర్యలలో ఎవరిని సారథిగా నియమించాలనేదానిపై ఇంకా క్లారిటీ రానట్లు తెలుస్తోంది.

Similar News

News December 12, 2024

ఆ దావాలను తీసుకోవద్దు: సుప్రీంకోర్టు

image

ప్రార్థనా స్థలాలపై దాఖలయ్యే దావాలను తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు తీసుకోవద్దని, ప్రస్తుతం విచారణలో ఉన్న కేసుల్లో తీర్పులు చెప్పొద్దని దేశంలోని కోర్టులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రార్థనా స్థలాల చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన కోర్టు, 4 వారాల్లోగా వీటిపై సమాధానమివ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ చట్టం హిందువులు, జైనులు, బౌద్ధులు, సిక్కుల హక్కులను హరిస్తోందని పిటిషన్ దాఖలైంది.

News December 12, 2024

క్లీంకార ఇప్పుడెలా ఉందో చూడండి!

image

రామ్ చరణ్, ఉపాసనల కుమార్తె క్లీంకార చూస్తుండగానే పెరిగిపోయింది. తన తాతతో క్లీంకార ఆలయాన్ని సందర్శించిన ఫొటోను ఉపాసన షేర్ చేశారు. ‘ఈరోజు మా హాస్పిటల్ టెంపుల్‌లోని వేంకటేశ్వర స్వామి పవిత్రోత్సవాల్లో తన ముత్తాతలతో కలిసి క్లీంకార పాల్గొంది. తాత చేతుల్లో తనను చూస్తుంటే నా బాల్యం గుర్తొస్తోంది’ అని ఆమె పేర్కొన్నారు. అయితే, మెగా ప్రిన్సెస్ ఫేస్ కనిపించకుండా ఆమె జాగ్రత్తలు తీసుకున్నారు.

News December 12, 2024

ప్రపంచంలోనే అరుదైన రక్తం ఇదే!

image

ప్రపంచంలో పలు రకాల బ్లడ్ గ్రూప్స్ ఉన్నప్పటికీ Rh-null అనేది అరుదైన రక్త సమూహంగా పరిగణిస్తుంటారు. దీనిని ‘గోల్డెన్ బ్లడ్’ అని కూడా పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా 50 కంటే తక్కువ మంది మాత్రమే ఈ ప్రత్యేకమైన రక్త వర్గాన్ని కలిగి ఉన్నారు. ఇది అరుదుగా ఉండటం వల్ల దీనిని విలువైనదిగా భావిస్తారు. యాంటీజెన్స్ ఉండవు కాబట్టి Rh వర్గం వారికి వినియోగించాల్సి వచ్చినపుడు దీని మ్యాచ్‌ను కనుగొనడం చాలా కష్టం.