news

News July 16, 2024

నైట్ ఫుడ్ కోర్టులకు ఇబ్బంది కలిగించొద్దు: సీఎం రేవంత్

image

HYDలో శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్లు, SPలతో సమావేశంలో CM రేవంత్ స్పష్టం చేశారు. ‘మానవ అక్రమ రవాణా నియంత్రణకు చర్యలు తీసుకోవాలి. నేరస్థులతో కాకుండా బాధితులతో పోలీసులు ఫ్రెండ్లీగా ఉండాలి. HYDలో రాత్రిపూట ఫుడ్ కోర్టులకు ఇబ్బంది కలిగించవద్దు. డ్రగ్స్ నియంత్రణకు పోలీస్, ఎక్సైజ్ శాఖలు కలిసి పనిచేయాలి. డ్రంక్ అండ్ డ్రైవ్‌తో పాటు డ్రైవ్ ఆన్ డ్రగ్స్ కూడా ఉండాలి’ అని సీఎం సూచించారు.

News July 16, 2024

అమిత్ ‌షాతో సీఎం చంద్రబాబు భేటీ

image

AP: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సీఎం చంద్రబాబు ఢిల్లీలో భేటీ అయ్యారు. విభజన సమస్యలు, తాజా రాజకీయ అంశాలపై షాతో సీఎం చర్చిస్తున్నారు. కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరే అవకాశం ఉంది.

News July 16, 2024

SAD: ఇంటికి వస్తున్నానని ఫోన్.. ఇక లేడని మరో ఫోన్!

image

J&Kలోని డోడాలో సోమవారం రాత్రి జరిగిన కాల్పుల్లో మరణించిన నలుగురు జవాన్లలో రాజస్థాన్‌కు చెందిన అజయ్ సింగ్ ఒకరు. అయితే కాల్పులకు ముందురోజు అజయ్ తన ఇంటికి ఫోన్ చేసి ‘కాల్పులు కొనసాగుతున్నాయి. కానీ నాకు సెలవులు మంజూరయ్యాయి. ఇంటికి వచ్చేస్తున్నా’ అని అన్నారట. కానీ ఈరోజు ఆర్మీ అధికారులు తన తండ్రికి ఫోన్ చేసి ‘మీ అబ్బాయి ఇకలేరు’ అని చెప్పారట. అతడికి రెండేళ్ల క్రితమే వివాహం జరిగిందని బంధువులు చెప్పారు.

News July 16, 2024

అలాగైతే నా కొడుకుని ఉరి తీయండి: HD రేవణ్ణ

image

తన కొడుకు తప్పు చేసి ఉంటే ఉరి తీయండని కర్ణాటక JDS MLA HD రేవణ్ణ అన్నారు. మహిళలపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న MP ప్రజ్వల్ అంశం అసెంబ్లీలో చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా రేవణ్ణ ఉద్వేగానికి లోనయ్యారు. ‘నా కుమారుడిని శిక్షిస్తామంటే అడ్డు చెప్పను. కానీ ఎవరో ఓ మహిళను డీజీపీ ఆఫీసుకు తీసుకొచ్చి ఆరోపణలు చేయించారు. ఫిర్యాదు తీసుకున్నారు. ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదు’ అని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

News July 16, 2024

టీమ్ ఇండియా కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్?

image

టీ20లకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో హార్దిక్ పాండ్య పగ్గాలు చేపడతారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ రేసులోకి వచ్చారని ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (PTI) తెలిపింది. 2026 టీ20 ప్రపంచకప్ వరకు సూర్య T20లకు సారథిగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు గంభీర్, అజిత్ అగార్కర్.. పాండ్యతో చర్చించారని, దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు PTI వివరించింది.

News July 16, 2024

T-SAT సేవలు తక్షణమే పునరుద్ధరించాలి: KTR

image

TG: T-SAT ఛానళ్లు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో మూగబోయాయని కేటీఆర్ ఆరోపించారు. ‘ప్రస్తుతం కొన్ని నోటిఫికేషన్లు విడుదలైన పరిస్థితుల్లో T-SAT ఛానళ్ల ద్వారా విద్యార్థులు, నిరుద్యోగులకు శిక్షణ అందేది. కాంగ్రెస్ అస్తవ్యస్త విధానాలతో వారికి తీవ్ర నష్టం జరుగుతోంది. NSILతో ఒప్పందంపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. తక్షణమే T-SAT సేవలు పునరుద్ధరించాలి’ అని KTR డిమాండ్ చేశారు.

News July 16, 2024

రూ.2 లక్షల రుణమాఫీ.. గోల్డ్ లోన్ తీసుకున్న వారికి వర్తిస్తుందా?

image

TG: బ్యాంకుల్లో బంగారం పెట్టి క్రాప్ లోన్ తీసుకున్న వాళ్లకు పాస్ బుక్ ఉంటే రుణమాఫీ చేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. అర్హులైన రైతులకు రేషన్‌కార్డు లేకపోయినా మాఫీ చేస్తామన్నారు. ‘MLAలు, IAS, ఉన్నతాధికారులకు రుణమాఫీ ఉండదు. వ్యవసాయం చేసే గ్రూప్-4 ఉద్యోగులకూ మాఫీ చేస్తాం. 11.50 లక్షల మందికి రూ.లక్ష వరకు బకాయిలు ఉన్నాయి. వీరి కోసం ఎల్లుండి రూ.6వేల కోట్లు రిలీజ్ చేస్తున్నాం’ అని తెలిపారు.

News July 16, 2024

విద్యాదీవెన, వసతిదీవెన స్థానంలో పాత విధానం: లోకేశ్

image

AP: విద్యాదీవెన, వసతిదీవెన స్థానంలో పాత ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానాన్ని అమలు చేసేందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించాలని మంత్రి లోకేశ్ ఆదేశించారు. గత ప్రభుత్వం రూ.3,480 కోట్ల బకాయిలు పెట్టడంతో విద్యార్థుల సర్టిఫికెట్లు ఆయా విద్యాసంస్థల్లో నిలిచిపోయాయన్నారు. దీంతో విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని లోకేశ్ తెలిపారు. కాలేజీల్లో డ్రగ్స్ నిర్మూలనకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

News July 16, 2024

AP, తెలంగాణకు నీటి కేటాయింపులు చేసిన KRMB

image

ఏపీ, తెలంగాణకు 9.914 టీఎంసీల నీటిని కేటాయిస్తూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. APకి 4.500 TMCలు, TGకి 5.414 TMCల నీటిని శ్రీశైలం పవర్ హౌసెస్ ద్వారానే విడుదల చేయాలని బోర్డు స్పష్టం చేసింది.

News July 16, 2024

తొలి ఏకాదశి రోజు చేయాల్సినవి.. చేయకూడనివి!

image

తొలి <<13641339>>ఏకాదశి<<>> (జులై 17) రోజు తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి పూజా మందిరాన్ని అలంకరించి మహా విష్ణువు, లక్ష్మీదేవిని పూజించాలి. విష్ణుసహస్రనామ పారాయణం చేయాలి. రోజంతా ఉపవాసం ఉండి మరుసటి రోజైన ద్వాదశి నాడు ఆలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి. పేదలకు ధాన్యాలు, వస్త్రాలు దానం చేయడం మేలు. అయితే ఏకాదశి రోజు మద్య, మాంసాలకు దూరంగా ఉండాలి. గోళ్లు/వెంట్రుకలు కత్తిరించొద్దు. బ్రహ్మచర్యం పాటించాలి.