News July 16, 2024
SAD: ఇంటికి వస్తున్నానని ఫోన్.. ఇక లేడని మరో ఫోన్!
J&Kలోని డోడాలో సోమవారం రాత్రి జరిగిన కాల్పుల్లో మరణించిన నలుగురు జవాన్లలో రాజస్థాన్‌కు చెందిన అజయ్ సింగ్ ఒకరు. అయితే కాల్పులకు ముందురోజు అజయ్ తన ఇంటికి ఫోన్ చేసి ‘కాల్పులు కొనసాగుతున్నాయి. కానీ నాకు సెలవులు మంజూరయ్యాయి. ఇంటికి వచ్చేస్తున్నా’ అని అన్నారట. కానీ ఈరోజు ఆర్మీ అధికారులు తన తండ్రికి ఫోన్ చేసి ‘మీ అబ్బాయి ఇకలేరు’ అని చెప్పారట. అతడికి రెండేళ్ల క్రితమే వివాహం జరిగిందని బంధువులు చెప్పారు.
Similar News
News October 16, 2024
విజయం కోసం పేర్లు మార్చుకోవాల్సిందేనా?
సినీ ప్రముఖులు సైతం న్యూమరాలజీని ఫాలో అవుతుంటారు. వరుసగా సినిమాలు ఫ్లాప్ అవడం, స్టార్‌గా గుర్తింపు రాకపోవడం తదితర కారణాలతో పేర్లలో మార్పులు, చేర్పులు చేసుకున్న నటీనటులున్నారు. ఇటీవలే సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తన పేరును సాయి దుర్గ తేజ్‌గా మార్చుకున్న విషయం తెలిసిందే. గతంలోనూ లక్ష్మీ రాయ్ – రాయ్ లక్ష్మీగా, కిచ్చా సుదీప్ – సుదీపగా, Sundeep Kishan – Sundeep Kishnగా పేరు మార్చుకున్నారు.
News October 16, 2024
పెరగనున్న మందుల ధరలు
టీబీ, ఆస్తమా, గ్లాకోమా, తలసేమియా, మెంటల్ హెల్త్‌కు సంబంధించిన మెడిసిన్ ధరలను 50 శాతం పెంచేందుకు ఎన్‌పీపీఏ ఆమోదం తెలిపింది. ఉత్పత్తి ఖర్చులు పెరిగాయనే ఫార్మాస్యూటికల్ కంపెనీల విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకుంది. బెంజిపెన్సిలిన్, ఆట్రోపైన్, స్ట్రెప్టోమైసిన్, సాల్బుటమాల్, పిలోకార్పైన్, సెఫడ్రాక్సిల్, డెస్ఫెర్రొగ్జామైన్, లిథియం మందులు ఈ జాబితాలో ఉన్నాయి.
News October 16, 2024
వాయుగుండంపై LATEST UPDATE
AP: బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం వాయువ్య దిశగా 12KM వేగంతో కదులుతున్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. చెన్నైకి 360KM, పుదుచ్చేరికి 390KM, నెల్లూరుకు 450KM దూరంలో ఉన్నట్లు పేర్కొంది. ఇది రేపు తెల్లవారుజామున చెన్నైకి దగ్గరగా పుదుచ్చేరి, నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని చెప్పింది. వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.