India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇండియా పోస్టులో 44,288 ఉద్యోగాల భర్తీకి <<13634003>>దరఖాస్తుల<<>> స్వీకరణ కొనసాగుతోంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక ఉంటుంది. టెన్త్‌లో మ్యాథ్స్, ఇంగ్లీష్, స్థానిక భాషలో వచ్చిన మార్కుల ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. BPMకు రూ.12వేల నుంచి రూ.29,380, ABPM/డాక్ సేవక్‌కు రూ.10వేల నుంచి రూ.24,470గా నిర్ణయించారు. 18-40 ఏళ్లలోపు వారు అర్హులు. SC, STలకు ఐదేళ్లు, OBCలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు వయసులో సడలింపు ఉంది.
MPకి చెందిన BJP MLA పన్నాలాల్ షాక్య ఇచ్చిన సలహాతో విద్యార్థులు కంగుతిన్నారు. ‘PM కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్’ పేరుతో రాష్ట్రంలోని 55 జిల్లాల్లో ప్రత్యేక కేంద్రాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా వర్చువల్‌గా ప్రారంభించారు. ఈక్రమంలోనే MLA ‘నేడు PM కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఘనంగా ప్రారంభమైంది. అయితే మీరు చదివే డిగ్రీతో భవిష్యత్తులో పెద్దగా ఉపయోగం ఉండదు. అందుకే జీవనోపాధికి పంక్చర్ షాప్ పెట్టుకోండి’ అని అన్నారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నంపై FBI (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) విచారణ మొదలుపెట్టింది. అమెరికా సీక్రెట్ సర్వీస్ దీనికి సహకరిస్తోంది. దుండగుడు ఎలా రూఫ్ ఫైకి చేరుకుని, కాల్పులు జరిపాడనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ట్రంప్‌కు భద్రత పెంచాలని ఎలాన్ మస్క్ డిమాండ్ చేశారు.
AP: JSW గ్రూప్ ఛైర్మన్ సజ్జన్ జిందాల్ అమరావతిలో సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులపై బాబుతో జిందాల్ చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు మంచి అవకాశాలున్నాయని, ప్రతిపాదనలతో వస్తే ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని CM భరోసా ఇచ్చారు.
TG: రూ.2లక్షల రుణమాఫీ అమలులో ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి బ్యాంకులో ఒక నోడల్ అధికారిని నియమించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ అధికారి బ్యాంకులకు వ్యవసాయ శాఖ సంచాలకుల మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. బ్యాంకు నుంచి ప్రభుత్వానికి సమర్పించే ప్రతి జాబితాపై నోడల్ అధికారి డిజిటల్ సంతకం చేయాల్సి ఉంటుంది.
TG: గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ జీతాల చెల్లింపునకు రాష్ట్ర ప్రభుత్వం రూ.150 కోట్ల నిధులు విడుదల చేసింది. ఇందులో 29,676 మంది మల్టీపర్పస్ వర్కర్లు మే వరకు అందుకోవాల్సిన బకాయిలు ఉన్నాయి. గత కొద్దిరోజులుగా జీతాలు చెల్లించాలని వారంతా ఆందోళనలు చేస్తున్నారు.
AP సీఎం చంద్రబాబు రేపు సాయంత్రం 4 గంటలకు విజయవాడ నుంచి బయల్దేరి ఢిల్లీకి వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను CM కలిసే అవకాశం ఉంది. విభజన చట్టంలోని పెండింగ్, ఇతర అంశాలపై షాతో ఆయన చర్చించనున్నట్లు తెలుస్తోంది.
దేశ వ్యాప్తంగా పోస్టాఫీసుల్లోని 44,228 బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ ఉద్యోగాల భర్తీకి ఇండియా పోస్ట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇవాళ్టి నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 6 నుంచి 8వ తేదీ వరకు దరఖాస్తుల్లో మార్పులు చేసుకోవచ్చు. టెన్త్ పాసైన 18 నుంచి 40 ఏళ్లలోపు వారు అర్హులు. ఏపీలో 1355, TGలో 981 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరిన్ని వివరాలకు ఇక్కడ <
TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మంత్రులు, అధికారులతో సమావేశం అయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలు, రాబోయే ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై చర్చించారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోకుండా త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.